Cardiac Arrest: వరల్డ్ కప్ టీ 20లో భారత్ - పాకిస్తాన్ మధ్య పోటీ ఎంత ఉత్కంఠగా సాగిందో అందరికీ తెలిసిందే. అసోం రాష్ట్రంలోని శివసాగర్ జిల్లాకు చెందిన 34 ఏళ్ల బితు గొగోయ్‌కు క్రికెట్ అంటే ఇష్టం. ఇండియా - పాక్ మ్యాచ్‌ను ఆయన సినిమా హాల్లో చూశారు. అభిమానులంతా కలిసి క్రికెట్ లైవ్‌ను ప్రసారం చేశారు. ఆయన ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే పక్కనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు వైద్యులు. మ్యాచ్ ఉత్కంఠగా సాగడం, హాల్లో విపరీతై శబ్ధకాలుష్యం వల్ల ఆయన మరణించినట్టు భావిస్తున్నారు వైద్యులు. ఈ సంఘటన తరువాత చాలా మందికి వచ్చిన సందేహం అతిగా ఎగ్జయిట్మెంట్‌కు గురైతే ఇలా కార్డియాక్ అరెస్టుకు గురయ్యే అవకాశ ఉందా అని? వైద్యులు కచ్చితంగా వస్తుందని చెప్పలేం, అలా అని కాదని కొట్టిపారేయలేం అంటున్నారు. 

కార్డియాక్ అరెస్ట్ అంటే...
మాయో క్లినిక్ ప్రకారం, ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె కొట్టుకోవడం, శ్వాస,  స్పృహ ఆకస్మికంగా ఆగిపోవడం.గుండెకు చెందిన విద్యుత్ వ్యవస్థలో సమస్యలు ఏర్పడినప్పుడు గుండె చేసే పంపింగ్‌ పనికి అంతరాయం కలుగుతుంది. అప్పుడు శరీరానికి రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఇలాంటి సమయంలో తక్షణ చికిత్స అందించకపోతే కార్డియాక్ అరెస్టుతో మనిషి మరణిస్తాడు. దాదాపు 25 శాతం కార్డియాక్ అరెస్ట్‌లు ఎటువంటి సంకేతాలు ఇవ్వకుండానే వస్తాయి. 


అత్యుత్సాహం కార్డియాక్ అరెస్టుకు కారణమవుతుందా?
అకస్మాత్తుగా వచ్చే ఒత్తిడి అయినా, ఉత్సాహం అయినా గుండె ధమనులపై చాలా ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. ధమనుల లోపల ఉండే ఫలకం పగిలిపోయి రక్త ప్రసరణ ఆగిపోతుందని అంటున్నారు. ఈ సమయంలో రక్తంలోని అడ్రినల్ గుండె ఆగిపోవడాన్ని ప్రేరేపిస్తుంది. 


ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ సంకేతాలు ఎలా ఉంటాయంటే...


1. హఠాత్తుగా కిందపడి స్పృహ కోల్పోతారు. 
2. శ్వాస ఆడదు.
3. ఛాతీలో అసౌకర్యం అనిపిస్తుంది.
4. హఠాత్తుగా శరీరం బలహీనంగా మారుతుంది.
5. గుండె అతి వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. 


ఎవరికి ఇలా జరుగుతుంది?
1. కొరోనరీ ఆర్టరీ వ్యాధిని కలిగి ఉన్నవారిలో ఇలా అత్యుత్సాహం వల్ల కార్డియాక్ అరెస్టు వచ్చే అవకాశం ఉంది. 
2. వయసు పెరిగే కొద్దీ కార్డియాక్ అరెస్టు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. 
3. మధుమేహం, అధిక రక్తపోటు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు ఉన్నవారిలో ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. 
4. అలాగే గుండె కొట్టుకోవడం క్రమబద్ధంగా లేకపోయినా కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. 
5. కుటుంబచరిత్రలో కార్డియాక్ అరెస్టులు సంభవిస్తే వారి తరువాత తరాలకు కూడా వచ్చే అవకాశం ఉంది. 
6. గుండెపోటు వచ్చిన తగినవారికి కూడా కార్డియాక్ అరెస్టు ఎప్పుడైనా సంభవించవచ్చు. 


Also read: మూర్ఛ ఉన్న వారు ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి

















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.