ప్రపంచ వ్యప్తంగా నవంబర్ 14 ను వరల్డ్ డయాబెటిక్ డే గా జరుపుకుంటారు. డయాబెటిస్ కు సంబంధించిన  అవగాహన అందించడమే ఈ రోజు ఉద్దేశ్యం. ఈ సమస్య లక్షణాలను బట్టి దాన్ని గుర్తించడం, నిర్దారించడం గురించిన చర్చ జరగాలనేది లక్ష్యం. ఈ ఏడాది ‘access to diabetes education’  అనే థీమ్. అంటే పూర్తి స్థాయి లో డయాబెటిస్ కు సంబంధించిన అవగాహన అందించడం . ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 422 మిలియన్ల మంది డయాబెటిస్ రోగులు ఉండగా సంవత్సరానికి 1.5 మిలియన్ల మంది డయాబెటిస్ దాని సంబంధ సమస్యలతో మరణిస్తున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతోంది. ఇప్పుడు డయాబెటిస్ చాలా సాధరణం అయిపోయిందని ఈ లెక్కలను బట్టి అర్థం అవుతోంది. అయితే అంత సులభంగా తీసుకోవాల్సిన విషయం కాదు, డయాబెటిస్ విషయంలో నిర్లక్ష్యం అసలు కూడదు.


మన దేశంలో డయాబెటిస్ చాలా వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల్లో ప్రతి ఏటా 8.7 శాతం డయాబెటిక్ రోగుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోందట. వీరంతా కూడా 20 నుంచి 70 సంవత్సరాల లోపు వయసు వారు కావడం గమనార్హం. ప్రభుత్వం, వైద్యరంగం కలిసి కట్టుగా ఈ సమస్యకు సంబంధించిన అవగాహన కల్పించడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


డయాబెటిక్ పర్సన్ కు హెల్త్ ఇన్ష్యూరెన్స్ దొరుకుతుందా?


కచ్చితంగా దొరకుతుంది. కానీ వీళ్లు ప్రతి ఏటా ప్రీమియం కాస్త ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. మధుమేహం వంటి లైఫ్ స్టైల్ వ్యాధులను కూడా భీమాపాలసీలు కవర్ చేస్తాయి. ఒక్కోసారి పాలసీ ప్రారంభించిన తర్వాత నిర్ధారణ కావచ్చు. అయితే పాలసీ కొనడానికి ముందే మధుమేహం ఉన్నవారికి పాలసీ తీసుకోవాలనుకున్నపుడు మాత్రం కాస్త వెయిటింగ్ పీరియడ్, వెయిటింగ్ పీరియడ్ వర్తించే విధంగా ఉంటుందని ఎడ్విసిప్ జనరల్ ఇన్ష్యూరెన్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పూజా యాదవ్ అంటున్నారు.


హెల్త్ ఇన్ష్యూరెన్స్ డయాబెటిక్స్ కి అవసరమా?


నిజానికి డయాబెటిస్ ను మేనేజ్ చెయ్యడం కర్చుతో కూడుకున్న వ్యవహారంగా తయారవుతోంది. ఇది కుటుంబం ఆర్థిక స్థితి మీద ప్రభావం చూపుతోంది. కాబట్టి ఆరోగ్య భీమా పాలసీ తప్పకుండా తీసుకోవాలి. అది తీసుకునే సందర్భంలో కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. హాస్పిటల్లో చేరినపుడు మాత్రమే కాదు, అంతకు ముందు, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉండే డే కేర్, హాస్పిటల్ కేర్ ట్రీట్మెంట్లతో పాటు డయాలసిస్ కర్చుల వంటి వాటన్నింటిని కవర్ చేసే పాలసీని ఎంచుకోవాలని డైరెక్టర్, హెడ్ రిటైల్, కేర్ హెల్త్ ఇన్ష్యూరెన్స్ కు చెందిన అజయ్ షా సలహా ఇస్తున్నారు.


ప్రీమియంలో ఎంత తేడా?


సాధారణంగా ప్రీమియం కవరేజిలో వచ్చే సదుపాయాలు, బీమా మొత్తం విలువ, బీమా చేసిన వ్యక్తి వయసు, అతని ఆరోగ్య చరిత్ర వంటి అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులతో పోల్చినపుడు మధుమేహుల కు ప్రమాదం ఎక్కువ అని బీమా కంపెనీలు అంచనా వేస్తాయి. వీరు హాస్పటలైజ్ అయ్యే అవసరం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయడతారు. అందువల్ల మధుమేహులు 15-30 శాతం వరకు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఉండే ఆరోగ్యవంతుడికి భీమా పాలసి 10 వేల నుంచి 12 వేల మధ్య దొరకుతుంది. 10 లక్షల వరకు బీమా కవరేజి ఉంటుంది. ఒకవేళ పాలసీ దారు డయాబెటిక్ అయితే మాత్రం పరిస్థితిని బట్టి ప్రీమియం 10-20 శాతం వరకు పెరగవచ్చు.