Janaki Kalaganaledu November 14th: తల్లి జ్ఞానంబ దగ్గర అఖిల్ దొంగ నాటకాలు ఆడతాడు. ఎలాగైనా బయటకి తీసుకెళ్లమని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. లాయర్ తో మాట్లాడి బెయిల్ ఇప్పిస్తానని రామా ధైర్యం చెప్తాడు. తానేమీ తప్పు చేయలేదని జానకి తన మీద కక్ష కట్టి ఇలా తప్పుడు కేసు పెట్టి ఇరికించాలని చూస్తుందని అఖిల్ అందరికీ ఎక్కిస్తాడు. మేమేమి చేయలేకపోతున్నామని గోవిందరాజులు అంటాడు. తను ఎవరిని చంపడానికి ట్రై చేయలేదని జెస్సికి చెప్పి ఏడుస్తాడు. జానకి అఖిల్ విషయంలో ఎందుకు మొండిగా ప్రవర్తిస్తుందని జ్ఞానంబ రామాని అడుగుతుంది. మొండితనం కాదు మూర్ఖత్వం అని రామా కూడా జానకిని తిడతాడు. జానకి రామా అన్న మాటలు గురించి ఆలోచిస్తుంటే మల్లిక వచ్చి భయపెట్టాలని చూస్తుంది.


మల్లిక: ఇంటికి పెద్ద కోడలిగా నీ స్థానాన్ని అడ్డుపెట్టుకుని నీ తెలివితేటలతో నా బతుకు మునిసిపాలిటీ చేసేశావ్ కదా.. కానీ నీ అదృష్టం గిర్రున తిరిగి దురదృష్టం అయ్యింది, జెస్సికి నీ మీద ఉన్న అభిమానం పోగొట్టుకున్నావ్, నీ మీద పెట్టుకున్న నమ్మకం పోయేలా చేసుకున్నావ్


జానకి: దేవుడు ఉన్నాడు మల్లిక, నేనే నిజమని కచ్చితంగా నిరూపిస్తాడు, నీ టైమ్ బాగుంది నీ ఫెక్ ప్రెగ్నెన్సీ బయటపెట్టే లోపు అఖిల్ సమస్య వచ్చింది. అది అయిపోగానే నెక్ట్ నువ్వే


మల్లిక: అయ్యయ్యో భయమేస్తుంది జానకి అని వెటకారం ఆడుతుంది


Also Read: చిక్కుల్లో పడ్డ దేవయాని- తండ్రికి దగ్గరగా రిషి, వాళ్ళని చూస్తాడా?


నీకు టైమ్ తొందరపడిందని జానకి వార్నింగ్ ఇస్తుంది. జ్ఞానంబ వాళ్ళు స్టేషన్ నుంచి బయటకి వచ్చేసరికి సునంద ఎదురుపడుతుంది. నువ్వంటే నాకు పడకపోయినా నీ నిజాయితీ అంటే మర్యాద కానీ అవి మంట గలిసి నీ కొడుకు కోసం స్టేషన్ మెట్లు ఎక్కడం చూసి బాధగా ఉందని సునంద దెప్పిపొడుస్తుంది. జానకి, జ్ఞానంబ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది సునంద. ఎట్టి పరిస్థితుల్లోని జ్ఞానంబ కొడుకు అఖిల్ ఈ కేసు నుంచి బయటకి రాకూడదని సునంద పోలీసులతో డీల్ కుదుర్చుకుంటుంది.


మల్లిక జెస్సి తల్లిదండ్రులకి ఫోన్ చేసి జానకి గురించి మళ్ళీ ఎక్కిస్తుంది. జానకి అఖిల్ మీద కేసు పెట్టి పోలీసులతో అరెస్ట్ చేయించిందని మల్లిక జెస్సి తండ్రి పీటర్ కి చెప్తుంది. అది విని షాక్ అవుతాడు. ఇంట్లో వాళ్ళందరూ కేసు వెనక్కి తీసుకోమని చెప్తున్నా వినకుండా కేసు వెనక్కి తీసుకొనని పట్టుబట్టిందని చెప్తుంది. అఖిల్ కి తల్లిలాంటి దాన్ని అని పైకి చెప్తూనే ఇలా చేసిందని పుల్ల పెడుతుంది. నేను వేసిన ప్లాన్ వల్ల జానకి ఇంటి నుంచి కాలు బయట పెట్టేలా చేస్తుందని మల్లిక సంకలు గుద్దుకుంటుంది. జెస్సి తల్లిదండ్రులు కంగారుగా తనకి ఫోన్ చేస్తారు. రామా, విష్ణు లాయర్ ని కలిసేందుకు వస్తారు. రామా జరిగింది మొత్తం లాయర్ కి చెప్తాడు. మీ తమ్ముడి కేసుకి ప్రధాన సాక్షి జానకి, తనని ఎలాగైనా ఒప్పించి కేసు విత్ డ్రా చేయించమని లాయర్ చెప్తాడు.


Also Read: తగలబెట్టుకుంటానన్న మోనిత, పట్టించుకోని కార్తీక్- ఉగ్రరూపం దాల్చిన దీప