Morning Drink to Loose Weight : రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం వేసుకుని తాగితే బరువు తగ్గుతామంటారు. ఇప్పటికీ దీనిని చాలామంది ఫాలో అవుతారు. అయితే కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే కూడా బరువు తగ్గుతారనే వాదన వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం. ఈ కాఫీ తాగితే బరువు తగ్గడంతో పాటు ఇంకేమైనా ప్రయోజనాలు ఉన్నాయా? లేక సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అసలు దీని గురించి నిపుణులు ఏమంటున్నారు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


ముందు అక్కడే..


కాఫీ తాగితే చాలామంది ఇన్​స్టాంట్​గా ఎనర్జీ వచ్చినట్లు ఫీల్ అవుతారు. మరి కొందరు తమ వెయిట్ లాస్ డైట్​లో భాగం చేసుకుంటారు. కాఫీలోని కెఫీన్ నిద్రను దూరం చేసి పనిపై ఫోకస్ చేయడాన్ని పెంచుతుందని చెప్తారు. కానీ కాఫీలో నెయ్యి కూడా వేసుకుంటే బరువు తొందరగా తగ్గుతారని అంటున్నారు. ఇలా నెయ్యితో చేసే కాఫీని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటారు. దీనిని సెలబ్రెటీలు కూడా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. ఇదేదో నెయ్యి అంటే ఇండియాలో మొదలైంది అనుకుంటున్నారేమో.. విదేశాల్లో మొదలయ్యాకే ఇండియాకు ఇది వచ్చింది. మరి ఇది బరువు తగ్గడంలో నిజంగానే హెల్ప్ చేస్తుందా?


పరిశోధనలు ఏమి చెప్తున్నాయంటే..


ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో కార్బ్స్ తక్కువగా ఉంటాయి. మీ డేని ఎనర్జీటిక్​గా స్టార్ట్ చేసేందుకు ఇది హెల్ప్ చేస్తుంది. ఈ కాఫీలో నెయ్యి లేదా కొబ్బరి నూనెను వేసుకోవచ్చు. దీనిని రెగ్యూలర్​గా తీసుకోవడం వల్ల.. శరీరంలోని నిల్వ, పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. దీని గురించి చేసిన అధ్యయనంలో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుందని పరిశోధకులు తెలిపారు. హెల్తీ ఫ్యాట్స్ శరీరంలోకి నెయ్యి ద్వారా వెళ్లి.. చెడు కొవ్వును బయటకు పంపిస్తాయని వెల్లడించారు. 


మధుమేహం ఉంటే..


బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో మోనోశాచురేటెడ్, పాలీ అన్​శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కూడా మంచివి. ఎనర్జీతో నిండిన కార్బోహైడ్రేట్లు తీసుకున్నప్పుడు.. శరీరం శక్తిని ఎక్కువగా విడుదల చేస్తుంది. ఈ ఎనర్జీ అనేది శరీరంలోని కొవ్వు నిల్వలపై ఎటాక్ చేస్తుంది. వాటిని కరిగించడంలో హెల్ప్ చేస్తుంది. అందుకే దీనిని ఉదయాన్నే తీసుకుంటే రోజంతా ఎనర్జీటిక్​గా ఉండడమే కాకుండా.. కొవ్వును తగ్గించుకోగలుగుతారు. 


ఫుడ్ కంట్రోల్ 


కొందరిలో బరువు పెరిగే కొద్ది ఫుడ్ కంట్రోల్ ఉండదు. నోటికి నచ్చిందల్లా తింటూ ఉంటారు. మీకు అలాంటి సమస్య ఉంటే ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ హెల్ప్ చేస్తుంది. ఇది ఆకలిని తగ్గించి.. కొవ్వును కరిగించి.. దాని నుంచి ఎనర్జీని శరీరానికి అందిస్తుంది. దీనివల్ల ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. అన్​హెల్తీ స్నాక్స్ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు పెరుగుతుంది. దీనివల్ల ఆ సమస్య ఉండదు. 


ఎసిడిటీ సమస్య ఉంటే..


ఎసిడిటీ సమస్యతో ఉన్నవారు కూడా ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని తయారు చేసుకోవచ్చు. ఇది దానికి విరుగుడుగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగ్గా చేస్తుంది. మలబద్ధకం సమస్యతో ఇబ్బందిపడేవారికి ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. గట్​ ఫ్రీగా ఉంటే రోజంతా యాక్టివ్​గా ఉంటారు. పనిమీద ఏకాగ్రత కూడా పెరుగుతుంది. రెగ్యూలర్​గా వ్యాయామం చేసే వారు దీనిని తీసుకుంటే వారికి ఎనర్జీ అందుతుంది. కాబట్టి మరింత మెరుగ్గా వ్యాయామం చేయవచ్చు. దీనివల్ల ఫిట్​గా మారుతారు. 



రెగ్యూలర్​గా తాగితే..


అయితే అందరికీ ఇదే రిజల్ట్స్ వస్తాయని రూల్ లేదు. ఒక్కో శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది కాబట్టి.. మీ శరీరానికి ఇది సెట్ అవుతుందో లేదో ముందుగా వైద్యులను అడిగి తెలుసుకోవాలి. లేదంటే ప్రతి చర్యలు చూపించే అవకాశముంది. అయితే మీరు రెగ్యూలర్​గా ఒకటే డ్రింక్ తాగితే శరీరానికి అది అలవాటై.. దాని ఫలితాలు చూపించడం ఆపేస్తుంది. కాబట్టి నెల లేదా నెలన్నరకి వాటిని ఇతర అలవాట్లతో మారుస్తూ ఉండాలి అంటున్నారు నిపుణులు.


Also Read : సమ్మర్​లో పుచ్చకాయను ఇలా తీసుకుంటే.. హెల్త్​కి, బ్యూటీకి ఎన్నో బెనిఫిట్స్