Swayam Vyakta Kshetras of Lord Sri venkateswara:   కలియుగంలో ఏ స్వామిని దర్శించుకుంటే బాధలు మటుమాయం అవుతాయో...ఏ స్వామిరూపం చూస్తే సమస్యలు తొలగి మనశ్సాంతి లభిస్తుందో... ఏ స్వామి దర్శనంతో జన్మధన్యం అవుతుందని భావిస్తారో ...ఈ రూపాన్ని పూజిస్తే ఆయురారోగ్యఐశ్వర్యాలకు లోటుండదో ఆయనే శ్రీ వేంకటేశ్వరుడు. కలియుగప్రత్యక్షదైవంగా పూజలందుకుంటున్న వేంకటేశ్వరస్వామి స్వామి తిరుమలలో కొలువైఉన్నాడు. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా వెలిగే ఈ క్షేత్రం తర్వాత  వేంకటేశుడికి సంబంధించి 7 స్వయంభు క్షేత్రాలున్నాయి...వీటినే సప్త శ్రీనివాస క్షేత్రాలు అంటారు. ఇన్నీ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి...


వేంకటేశ్వర స్వామి వాడపల్లి (కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్)


వందల ఏళ్లక్రితం నాసిక్ ప్రాంతంలో నారద మహర్షి..ఎర్రచందనరూపుడైన వేంకటేశ్వరస్వామికి పూజించి ఆ రూపాన్ని ఓ పెట్టెలో పెట్టి గోదావరిలో నిమజ్జనం చేశారట. వందలకిలోమీటర్లు కొట్టుకువచ్చిన ఆ ప్రతిమ కోనసీమ జిల్లా వాడపల్లికి చేరింది. ఓబ్రాహ్మణుడి కలలో స్వామివారు కనిపించి చెప్పడంతో...రెండు రోజుల పాటూ వెతికి ఆ విగ్రహాన్ని గుర్తించి ఆ తర్వాత ప్రతిష్టించారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం చుట్టూ ఏడు వారాల పాటూ ఒక్కోసారి ఏడు ప్రదిక్షిణలు చేసి మనసులో కోర్కెలు చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం


Also Read: నారసింహస్వామి ఆలయం ఉన్న ఊర్లో కాకులుండవా - ఇందులో నిజమెంత!


కళ్యాణ వేంకటేశ్వర స్వామి (అన్నవరప్పాడు, పశ్చిమగోదావరి జిల్లా )


రావులాపాలెం నుంచి తణుకు హైవే మార్గంలో ఉంటుంది కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం. పవిత్ర గోదావరీ నదీ తీరాన ఉన్న ఈ ప్రదేశంలో కశ్యప ప్రజాపతి తపమాచరించారని చెబుతారు.  ఆయన అభీష్టం మేరకే ఈ ఆలయం నిర్మించారని... ఇక్కడ కళ్యాణ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే వివాహానికి సంబంధించి జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రతి నెల శ్రవణ నక్షత్రంలో స్వామి వారికి ఇక్కడ కళ్యాణం జరిపిస్తారు.


బాల బాలాజి స్వామి(అప్పనపల్లి)


గోదావరి జిల్లాలోనే ఉన్న సప్త శ్రీనివాసక్షేత్రాల్లో అప్పనపల్లి ఒకటి. ఇక్కడి వెంకటేశ్వర స్వామిని బాల బాలాజీ అని పిలుస్తారు. ఈ దేవస్థాన నిర్మాత  మొల్లేటి రామస్వామి కొబ్బరి వ్యాపారి. ఓ రోజు కొబ్బరిరాశిలో ఓ కాయలో శ్రీ వేంకటేశ్వరుడి తిరునామాలు కనిపించాయి. స్వామివారే అలా వచ్చారని భావించి ఆ కొబ్బరికాయను ప్రతిష్టించి పూజలు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత భక్తుల తాకిడితో పెద్ద క్షేత్రంగా మారింది.  ప్రధాన దేవస్థానమునకు కొంచెం దూరములో పురాతన దేవాలయము ఉంది..అప్పనముని అక్కడే తపస్సు చేసుకున్నారని ఆయన పేరుమీదుగానే అప్పనపల్లి వచ్చిందని చెబుతారు. అమలాపురం నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం


Also Read: పాములకు రెండు నాలుకలు ఎందుకుంటాయి - సర్పజాతి పుట్టుకకు మూలం ఎవరు!


మీసాల వేంకటేశ్వరస్వామి (యానాం)


సప్త వేంకటేశ్వరస్వామి క్షేత్రాల్లో నాలుగోది యానాంలో ఉన్న మీసాల వేంకటేశ్వరస్వామి. ఇక్కడ శ్రీ వేంకటేశ్వరుడి మీసాలు ఉండడంతో మీసాల వెంకన్నగా పిలుచుకుంటారు భక్తులు. తెల్లవారు జామునే మత్స్యకారులు వేటకు వెళ్లే ముందు వెంకటేశ్వరస్వామికి చద్దన్నం ప్రసాదంగా సమర్పించేవారని అందుకే చల్దికూడు వెంకన్న అని కూడా అంటారు. 15వ శతాబ్దానికి చెందిన రెడ్డిరాజులు నిర్మించిన ఈ ఆలయంలో ఏటా కళ్యాణోత్సవం, రథయాత్ర కన్నులపండువగా జరుగుతుంది.  


సప్తవేంకటేశ్వర క్షేత్రాల్లో ఐదోది మండపేటలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం...ఇక్కడకు రావులపాలెం, రాజమండ్రి మీదుగా చేరుకోవచ్చు


ఆరో క్షేత్రం కొడమంచిలి వేంకటేశ్వరస్వామి...ఈ ఆలయానికి వెళ్లేందుకు పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం వరకూ బస్సులో ఆ తర్వాత ఏదైనా వాహనం మాట్లాడుకుని వెళ్లొచ్చు


సప్త వేంకటేశ్వర క్షేత్రాల్లో ఏడోది పశ్చిమగోదావరి జిల్లా అబ్బరాజుపాలెంలో ఉంది.  కొడమంచిలి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాక అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం...


ఏటా మార్గశిరమాసంలో ఈ సప్త శ్రీనివాసక్షేత్రాలకు ట్రావెల్స్ వారు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తారు. వీటితో పాటూ నవ జనార్ధన క్షేత్రాలైన ధవళేశ్వరం, మడికి, జొన్నాడ, ఆలమూరు, మండపేట, కపిలేశ్వరం, మాచర, కోటిపల్లి, కోరుమిల్లి ప్రాంతాలను దర్శించుకోవచ్చు...