Lakshmi Narasimha Swamy Temple:  హిరణ్యకశిపుడిని సంహరించేందుకు ప్రహ్లాదుడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన నారసింహస్వామి...తన అవతార ఆంతర్యం ముగిసిన తర్వాత దండకారణ్యం అంతా తిరిగాడు. అలా స్వామివారు అడుగుపెట్టిన ప్రతి అణువూ పవిత్రప్రదేశంగా మారింది. స్వామి స్వయంభువుగా వెలిసిన క్షేత్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నాయి. కొండల్లో మీసా దేవుడిగా, పొలిమేరల్లో చల్లని చూపులు ప్రసరించే దైవంగా, వనాల్లో, పట్టణాల్లో భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలందుకుంటున్నాడు. దేశవ్యాప్తంగా నారసింహ క్షేత్రాలున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలు మరింత ప్రత్యేకం.  ఈ దేవాలయాల్లో వేటి ప్రాశస్త్యం వాటిదే అయినప్పటికీ...నారసింహ స్వామి కొలువైన ఊర్లో కాకులుండవు అనే ప్రచారం ఉంది. ఇది నిజమా? అవును - కాదు అని సమాధానం చెప్పాలి. ఎందుకంటే నృసింహస్వామి కొలువైన కొన్ని ప్రత్యేక క్షేత్రాల్లో కాకులు లేవన్నది నిజమే ... అయితే ఇది అన్ని క్షేత్రాలకు వర్తించదు...


Also Read: పాములకు రెండు నాలుకలు ఎందుకుంటాయి - సర్పజాతి పుట్టుకకు మూలం ఎవరు!


కాకులు కనిపించని నారసింహ క్షేత్రాలివే!


​​యాగంటి ఉమామహేశ్వరాలయం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా యాగంటి దేవాలయం ప్రాంగణంలో కాకులు కనిపించవు. దీనివెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. వాస్తవానికి ఇక్కడ వేంకటేశ్వరస్వామి విగ్రహం ప్రతిష్టించాలి అనుకున్నాడు అగస్యమహాముని. ఆ విగ్రహం బొటనవేలు విరగడంతో తన తప్పిదం తెలుసుకునేందుకు తపస్సు చేసిన అగస్త్యుడికి కాకులు తపోభంగం కలిగించాయి. దీంతో ఆగ్రహించిన మహాముని ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించకూడదని శాపం ఇచ్చాడు. ఫలితంగా యాగంటి ఆలయం సమీపంలో కాకులే కనిపించవు. అయితే కాకి శని దేవుడి వాహనం... అందుకే కాకుల్ని నిషేధించిన ప్రాంతంలో తానుండను అన్నాడ శనీశ్వరుడు. అందుకే ఆ ప్రాంతంలో కాకులు కనిపించవు.  


వెయ్యినూతుల కోన లక్ష్మీనరసింహస్వామి


వైఎస్‌ఆర్‌ జిల్లా పెండ్లిమర్రి మండలం చిన్న దాసరపల్లెలో ఉండే  ఈ ఆలయంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే సకల శుభాలూ కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలో కూడా కాకులూ, గద్దలూ సంచరించకపోవడం వెనక ఆసక్తికర కథనం చెబుతారు. శ్రీరాముడు సీతా సమేతంగా వచ్చి సేదతీరుతున్న సమయంలో కాకాసురుడు అనే రాక్షసుడు సీతాదేవికి నిద్రాభంగం చేశాడట. ఆగ్రహించిన రాముడు కాకాసురుడిపై బ్రహ్మాస్త్రం సంధించాడు. దానిని తప్పించుకునేందుకు దేవతలను శరణువేడినా ఫలితం లేకపోయింది. అప్పుడు శ్రీరాముడు..ఈ క్షేత్రం చుట్టూ ఓ గీత గీసి లోపలికి ప్రవేశించవద్దని చెప్పాడని..అందుకే ఈ నృసింహ క్షేత్రంలో కాకులు కనిపించవని చెబుతారు.  


Also Read: నరకం అంటే ఏంటి - ఇక్కడకు ఎవరెళతారు!


ఈ రెండు నారసింహస్వామి క్షేత్రాలతో పాటూ కాకులు కనిపించని మరికొన్ని ఆలయాలున్నాయి..


​కోటప్పకొండ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఉన్న త్రికోటేశ్వరుని ఆలయం సమీపంలో కూడా కాకులు కనిపించవు. పురాణాల ప్రకారం ఈ కొండపై ఉన్న 3 శిఖరాలను త్రిమూర్తులుగా పరిగణిస్తారు..అందుకే త్రికూటం అని పేరొచ్చింది. పరమేశ్వరుడి భక్తురాలు స్వామివారికి నిత్యం ప్రసాదం తీసుకొచ్చి పెట్టేది. ఓ రోజు కుండలో పెరుగుతీసుకొస్తూ మెట్లపై కూర్చుంది...ఆ సమయంలో ఆ పెరుగును ఓ కాకి నేలపాలు చేసింది. విచారంలో ఉన్న ఆ భక్తురాలిని కరుణించి వృద్ధుడి రూపంలో వచ్చిన పరమేశ్వరుడు..ఇకపై ఆ కొండపై కాకులు వాలవని వరమిచ్చాడట.  


​జగన్నాథ ఆలయం


ఒడిశా రాష్ట్రం పూరీ జగన్నాథ ఆలయంలో కాకులే కాదు పక్షులు కూడా ఎగరదు. ఈ ఆలయ ప్రాంగణంలో పక్షులు ఎగరకపోవడం ఓ మిస్టరీగా మారింది. దీంతో పాటూ జగన్నాథుడి ఆలయంలో చాలా మిస్టరీలున్నాయి. ఆలయంపై ఉన్న  సుదర్శన చక్రం మీరు ఎటువైపు  చూసినా అది మీ వైపే తిరిగినట్టు కనిపిస్తుంది. ఈ గోపురం నీడ కూడా కనిపించదు. గోపురంపై ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో వీస్తుంది.