Christmas 2023 : క్రిస్మస్ సమయంలో చాలా మంది బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే మీరు మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌కి గిఫ్ట్ ఇచ్చే ప్లాన్‌లో ఉన్నారా? అయితే మీకు ఏ గిఫ్ట్ కొనాలనేదానిపై క్లారిటీ లేదా అయితే ఇది మీకోసమే. ఇక్కడున్న గిఫ్ట్ ఐడియాలు మీ బడ్జెట్లోనే ఉంటాయి. పైగా వీటిని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ కూడా రిజెక్ట్ చేయలేరు. మరి ఈ గిఫ్ట్ ఐడియాలపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి. నచ్చినవారికి వీటిని బహుమతిగా అందించేయండి.
స్వెటర్లు
మీరు క్రిస్మస్ సమయంలో ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మీరు మంచి స్వెటర్లు గిఫ్ట్ ఇవ్వొచ్చు. చలికాలంలో స్వెటర్లు సౌకర్యవంతగా, హాయిగా ఉంచుతాయి. దీనిని కచ్చితంగా ఎవరూ నో చెప్పకుండా తీసుకుంటారు. పైగా వాటిని ధరించిన ప్రతిసారి మిమ్మల్ని వారు గుర్తుంచేసుకుంటారు. మీరు వారికి ఒక వార్మ్ హగ్ ఇచ్చినట్లు ఫీలవుతారు. కాబట్టి వింటర్లో క్రిస్మస్ గిఫ్ట్‌గా మీరు స్వెటర్లు ఇవ్వొచ్చు. మంచి డిజైన్లు సెలక్ట్ చేసి.. మీకు నచ్చినవారికి బహుమతిగా ఇవ్వండి. స్వెటర్ వేసుకోని వారి కోసం హూడీలు తీసుకోవచ్చు. వీటిని ఏ కాలంలోనైనా స్టైల్ కోసం వాడుకోవచ్చు.
స్కార్ఫ్స్
చలికాలంలో స్క్రార్ఫ్స్ ఫ్యాషన్‌బుల్‌గా ఉంటాయి. అంతేకాకుండా చలి నుంచి రక్షిస్తాయి. వీటిని ఏ దుస్తులతోనైనా పెయిర్ చేయవచ్చు. ఈ స్కార్ఫ్స్ను వివిధ రకాలుగా స్టైల్ చేయవచ్చు. కాబట్టి మీరు స్వెటర్లు ఇవ్వలేని నేపథ్యంలో స్కార్ఫ్స్ను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఇవి కేవలం మహిళలకే అనుకుంటున్నారేమో.. యూనిసెక్స్ స్కార్ఫ్స్ కొని జెంట్స్‌కి కూడా గిఫ్ట్ చేయవచ్చు.
క్యాండిల్స్
క్యాండిల్స్ అంటే ఏదో నార్మల్‌గా ఉండేవి కొనివ్వడం కాదు.. కొన్ని క్యాండిల్స్ మంచి సువాసన ఇస్తూ.. ప్రశాంతతను, రిలాక్స్‌ను అందిస్తాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి. మీరు వాటిని ఇతరులకు గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఇవి వారి మూడ్‌ని లిఫ్ట్ చేస్తాయి. తమకున్న ఒత్తిడిని దూరం చేసి.. ప్రశాంతతను అందిస్తాయి. ఈ ఉరుకుల పరుగుల కాలంలో ఒత్తిడిని తగ్గించేవి ఏవైనా మనసుకు హత్తుకుంటాయి. వీటికోసం మీరు లావెండర్, గులాబీ వంటి అనేక సువాసన గల క్యాండిల్స్ ఎంచుకోవచ్చు. ఇలాంటి ఫ్లేవర్స్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి.
పెయింట్స్
మీ ఫ్రెండ్స్ ఇంటి రంగుకు.. వారి ఆలోచన, భావాలకు తగ్గట్లుగా ఏదైనా ఆర్ట్ లేదా పెయింట్ దొరికితే వాటిని ఎంచుకోండి. ఇవి వారి ఇంటి అందాన్ని పెంచడంతో పాటు.. మొత్తం రూమ్ లుక్‌నే మార్చేస్తాయి. కానీ ఫ్రేమ్స్ లేదా పెయింటిగ్స్ ఎంచుకునేప్పుడు మీరు కచ్చితంగా వారి ఇంటిని.. ఇంట్లోని పరిసరాలు.. గోడ రంగును దృష్టిలో ఉంచుకుని సెలక్ట్ చేయండి. లేదంటే మీరు ఎంత మంచిది కొన్నా.. అది డిజాస్టర్ అయ్యే ప్రమాదముంది.
డెయిరీ లేదా ప్లానర్స్
క్రిస్మస్ సమయం న్యూ ఇయర్‌కి దగ్గరగా ఉంటుంది. అయితే మీరు మీ మిత్రులు, కుటుంబసభ్యుల కోసం మంచి డెయిరీ లేదా ప్లానర్ ఇవ్వొచ్చు. ఇది వారి రోజూవారీ పనులను గుర్తు చేసేందుకు, చేసిన పనులు గురించి తలచుకునేందుకు మంచి బహుమతి అవుతుంది. వాటిని గిఫ్ట్‌గా ఇస్తూ.. కచ్చితంగా ఆ రోజుకి సంబంధించి ఏదొక రెండు లైన్లు అయినా రాయమని చెప్పండి. అవి మీకోసం కాదు.. ఏదొక వారు ఈ డెయిరీ చూసి చాలా జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవాకాశం దొరుకుతుంది.
శాంటా కాస్ట్యూమ్
మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి శాంటా కాస్ట్యూమ్స్ కొనండి. మీ మిత్రుల ఇళ్లల్లో కూడా ఎవరైనా పిల్లలు ఉంటే వారికి ఇది కొని ఇవ్వండి. పిల్లలు శాంటా కాస్ట్యూమ్‌లో మస్త్ క్యూట్‌గా ఉంటారు. పైగా శాంటా కాస్ట్యూమ్స్ చాలా స్మూత్‌గా ఉంటాయి కాబట్టి పిల్లలకు కుడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. శాంటా అంటే నవ్వులు పంచేవారు. మనకి ప్యూర్ స్మైల్ ఇచ్చే పిల్లలకు ఇలాంటి క్యూట్ లిటిల్ శాంటాకు విషెస్ చెప్పేయవచ్చు.
Also Read : సరిగ్గా నిద్రపోవట్లేదా? అయితే ఈ ప్రాణాంతక వ్యాధులు తప్పవు