IDBI Ltd Recruitment: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఐడీబీఐ)- స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 9 నుంచి 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. విద్యార్హతలు, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.


వివరాలు..


➥ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 86.


పోస్టుల కేటాయింపు: యూఆర్(జనరల్)-36, ఎస్సీ-12, ఎస్టీ-08, ఓబీసీ-22, ఈడబ్ల్యూఎస్-08.


➥ మేనేజర్- గ్రేడ్ బి: 46 పోస్టులు


➥ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం)- గ్రేడ్ సి: 39 పోస్టులు


➥ డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం)- గ్రేడ్ డి: 01 పోస్టులు


విభాగాలవారీగా ఖాళీలు..
ఆడిట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్-04, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్-09, రిస్క్ మేనేజ్‌మెంట్-08, కార్పొరేట్ క్రెడిట్/రిటైల్ బ్యాంకింగ్-56, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్-05, సెక్యూరిటీ-04. 


అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగంలో సీఏ, ఎంబీఏ, సీఎఫ్‌ఏ, ఎఫ్‌ఆర్‌ఎం, ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్ణీత పని అనుభవం ఉండాలి. 


వయోపరిమితి (01.11.2023 నాటికి)..


➥ మేనేజర్ పోస్టులకు 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02.11.1988 - 01.11.1998 మధ్య జన్మించి ఉండాలి. 


➥ అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ పోస్టులకు 28-40 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02.11.1983 - 01.11.1995 మధ్య జన్మించి ఉండాలి. 


➥ డిప్యూటీ జనరల్ మేనేజర్‌ పోస్టులకు 35- 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02.11.1978 - 01.11.1988 మధ్య జన్మించి ఉండాలి. 


➥ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు చెందినవారికి 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.200 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.


జీతం: డిప్యూటీ జనరల్ మేనేజర్‌ పోస్టులకు రూ.76,010 - రూ.89,890, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ పోస్టులకు రూ.63,840 - రూ.78,230, మేనేజర్‌ పోస్టులకు రూ.48,170 - రూ.69,810 వరకు చెల్లిస్తారు.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 09.12.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.12.2023.


Notification


Online Application


Website


ALSO READ:


వైజాగ్‌ హిందుస్థాన్ షిప్‌యార్డులో 99 మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులు - అర్హతలివే
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా శాశ్వత, కాంట్రాక్ట్/ కాంట్రాక్ట్ అండ్‌ పార్ట్ టైమ్ ప్రాతిపదికన మొత్తం 99 పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...