PM Modi congratulated CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనుముల రేవంత్‌రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నుంచి అన్ని పార్టీల రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నారు. బెస్ట్ విషెస్ చెప్తూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు.
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని హామీ ఇస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు ప్రధాని మోడీ. తెలుగు, ఇంగ్లీష్‌లో ట్వీట్ చేశారు ప్రధాని మోడీ. తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి, మంత్రులకు అభినందనలు తెలియజేశారు. తెలంగాణలో ప్రజాసర్కార్ పని ఇప్పుడు మొదలైందని... బంగారు తెలంగాణ కలను సాకారం చేస్తామని చెప్పారు. తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఫొటోలు కూడా చేశారాయన.
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి... మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు కూడా శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులకు కూడా అభినందనలు చెప్పారాయన. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలని ఆకాంక్షిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఇక... టీడీపీ నేత నారా లోకేష్ కూడా రేవంత్‌రెడ్డి విషెస్ చెప్పారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
సినీ రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలియజేశారు. తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు కొత్త ప్రభుత్వంలోని సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, అత్యున్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా రేవంత్‌రెడ్డితో పాటు 11మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోగవర్నర్ తమిళిసై సమక్షంలో రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సీఎంగా భాద్యతలు చేపడుతూ సంతకం కూడా చేశారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేశారు. అలాగే ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, శ్రీధర్‌బాబు, పొంగులేటి, తుమ్మల, జూపల్లి, కొండా సురేఖ్, పొన్నం ప్రభాకర్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. 1994లో తొలిసారిగా దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు వరకు ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాజ్‌భవన్‌లోనే జరిగేది. 2004లో వైఎస్ రాజేశఖర్‌రెడ్డి కూడా ఎల్బీ స్టేడియంలోనే సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ ఇద్దరు దిగ్గజ ముఖ్యమంత్రుల్ని రేవంత్‌రెడ్డి అనుసరించి ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రస్థానం ప్రారంభించారు.