ఎవరికైనా అతిగా కోపం వస్తే అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? అంటూ తిట్లు మొదలుపెడతారు. ఇప్పుడు ఆ తిట్టును మార్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది గడ్డి ప్లేట్లలోనే తింటున్నారు. గడ్డితో తయారు చేసిన ప్లేట్లు ఇప్పుడు ఎన్నో అమ్మకానికి వస్తున్నాయి. ఈ గడ్డి ప్లేట్ల తయారీ చాలా లాభదాయకం కూడా. గడ్డితో ప్లేట్ల తయారు చేయాలన్న ఆలోచన కేరళకు చెందిన ఇద్దరు సోదరులకు వచ్చింది. ప్రస్తుతం బయట దొరికే డిస్పోజబుల్ ప్లేట్లు ఎక్కువగా ఫైబర్, పాలిథిన్ పొరలతో ఉన్నవి. ఇవి చెత్తకుండీలో చేరి ఆవులు వంటి వాటి పొట్టలోకి చేరుతున్నాయి. దీనివల్ల అవి అనారోగ్యం పాలవుతున్నాయి. అందుకే వాటి బదులు గడ్డి ప్లేట్లను తయారు చేస్తే మూగజీవులు వాటినీ తిన్నా కూడా ఎలాంటి సమస్య ఉండదనేది వేరే ఆలోచన. వీరు కేరళ రాష్ట్రానికి చెందినవారు.


పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసమే ఈ అన్నదమ్ములిద్దరూ గడ్డి ప్లేట్లను తయారు చేయడం మొదలుపెట్టారు. సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్నప్పుడు, కొండలపైకి ట్రెక్కింగ్‌కి వెళ్ళినప్పుడు కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్ధాలు వారికి కనిపిస్తూనే ఉన్నాయి. అందుకే తన వంతుగా పర్యావరణానికి ఏదో ఒక మేలు చేయాలని ఇలా గడ్డి ప్లేట్లను తయారు చేయడం మొదలుపెట్టారు. తమ సంస్థకు క్వాడ్రాట్ అనే పేరు పెట్టుకున్నారు. ఈ ప్లేట్ల తయారీకి తవుడు, పొట్టు, గడ్డి ఉపయోగించారు. ఇవన్నీ కూడా పశువులు తినేవే. మీరు అనుకోగానే గడ్డి ప్లేటులు తయారవ్వలేదు. ఎన్నో ప్రయోగాలు చేశాక వీటికి ఒక రూపం వచ్చింది. దాదాపు రెండేళ్ల పాటు ప్రయోగాలతోనే సరిపోయింది.  చిట్ట చివరకు గడ్డి ప్లేట్ రెడీ అయి బయటికి వచ్చింది. 


వీరు గడ్డిని తవుడు, పొట్టు వంటి సేకరించడం కోసం రైతులు, రైస్ మిల్లుల యజమానులతో డీల్ మాట్లాడుకున్నారు. వారి దగ్గర నుంచి గడ్డిని, తవుడును, పొట్టును సేకరించి తెచ్చుకుంటారు. ఆ మూడింటిని కలిపి మెత్తగా పొడిచేసి, అది ఉష్ణోగ్రత వద్ద ప్లేటు ఆకారంలో మౌల్డ్ చేస్తారు కూడా. అవి నాని పోకుండా గంట వరకు చక్కగా ఉంటాయి. కాబట్టి వీటిని వాడడం వల్ల ఆహారం లో ఎలాంటి మార్పులు రావు. వీటిని తిన్నాక బయటపడేసినా కూడా నీరు తగిలి మెత్తగా మారిపోతాయి. పశువులు తిన్నా కూడా వారి వాటి పొట్టలో చక్కగా జీర్ణం అయిపోతాయి. ఇప్పుడు ఈ గడ్డి ప్లేట్లు కేరళ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలకు చేరుతున్నాయి. అలాగే కెనడా, మెక్సికో, యూకే, యూఎస్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. నెలకు కనీసం పాతికవేల ప్లేట్లు అమ్ముడు అవుతాయని చెబుతున్నారు.


Also read: కొర్రలతో ఇడ్లీ ఇలా చేశారంటే ఎంతో ఆరోగ్యం, పిల్లలు కూడా తినేస్తారు



Also read: నిద్రలోనే కార్టియాక్ అరెస్టు, ఇలా ప్రజలు నిద్రలోనే ఎందుకు చనిపోతారు?




























































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.