సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. దీంతో ఆయన అభిమానులు సందడి చేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది. తమిళనాడులోని దాదాపు అన్ని థియేటర్లలో ఈ మూవీని రిలీజ్ చేశారు. అంతేకాదు, కొన్ని సంస్థలు అక్కడి ఉద్యోగులకు సెలవులు కూడా ఇవ్వడం గమనార్హం. మరి, ప్రజలు అన్ని అంచనాలు పెట్టుకున్న ‘జైలర్’ మూవీ ఎలా ఉంది? బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలుస్తుందా? లేదా నిరుత్సాహపరిచిందా? ఉదయాన్నే ఈ షోస్ చూసిన ప్రేక్షకులు.. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా మూవీపై తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు.
దర్శకుడు నెల్సన్ దిలీప్ హీరో విజయ్‌తో తీసిన ‘బీస్ట్’ మూవీ నిరాశపరిచినా.. అంతకు ముందు ఆయన నయనతారతో తీసిన తీసిన ‘కో కో కోకిల’, శివకార్తికేయన్ బ్లా్క్‌బస్టర్ మూవీ ‘వరుణ్ డాక్టర్’ మూవీస్ వల్ల మంచి అంచనాలే ఉన్నాయి. రజనీకాంత్‌తో సినిమా కాబట్టి.. ఆయన ఈసారి జాగ్రత్తగానే మూవీని హ్యాండిల్ చేసి ఉండవచ్చని అనుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులకు నచ్చింది. తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీకి మంచి అంచనాలే ఉన్నాయి. మరి, ఈ దీనిపై ప్రేక్షకులు ఇచ్చిన రివ్యూ ఇది.
ఫస్ట్ ఆఫ్ ఓకే.. సెకండాఫ్ బాలేదా?
ఈ మూవీ చూసిన ప్రేక్షకులు ఫస్టాఫ్ బాగుందని, సెకండ్ ఆఫ్ మాత్రం అస్సలు బాగోలేదని రివ్యూ ఇస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. మూవీ మొత్తంగా బాగుందని, ఫ్యాన్స్‌కు పండగేనని అంటున్నారు. ముఖ్యంగా అనిరుద్ బీజీఎం అదిరిపోయిందట. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్స్ భలే థ్రిల్లింగ్‌గా ఉన్నట్లు చెబుతున్నారు. డార్క్ కామెడీని ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుందని అంటున్నారు. హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పిల్లలతో వెళ్లకపోవడమే బెటర్ అంటున్నారు. ఇంకా ఎవరెవరు ఏమంటున్నారో కింది ట్వీట్లలో చూడండి.
కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. నయనతార 'కో కో కోకిల', శివ కార్తికేయన్ 'వరుణ్ డాక్టర్', తమిళ స్టార్ హీరో విజయ్ 'బీస్ట్' సినిమాల ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. రజనీకి 169వ చిత్రమిది.'జైలర్' సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, హిందీ నటుడు జాకీ ష్రాఫ్, కన్నడ అగ్ర కథానాయకుడు శివ రాజ్ కుమార్, తెలుగు నటుడు సునీల్ ప్రధాన పాత్రలు పోషించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత రమ్య కృష్ణతో కలిసి రజనీ నటించారు. వినాయకన్, మర్నా మీనన్, తమన్నా, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్, కిషోర్, బిల్లీ మురళీ, కరాటే కార్తీ, మిథున్, అర్షద్, మారిముత్తు, రిత్విక్, శరవణన్, అరంతంగి నిషా, మహానంది శంకర్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్ కన్నన్, కూర్పు : ఆర్. నిర్మల్, కళ : డాక్టర్ కిరణ్, యాక్షన్: స్టన్ శివ.
Also Read : 'సలార్' నటీనటులకు హోంబలే ఆ కండిషన్ పెట్టిందా? - ఆ ఒక్కటీ లీక్ కాకూడదని!