బ్రెజిల్‌లో ఓ బాలుడు రెండు అంగాలతో జన్మించాడు. ఆ బాలుడికి రెండేళ్ల వయస్సు రాగానే వైద్యులు ఒక అంగాన్ని పూర్తిగా తొలగించారు. అయితే, వైద్యులు రెండిట్లో చిన్న అంగాన్ని తొలగించడానికి బదులుగా పెద్ద అంగాన్ని కట్ చేసి తీసేశారు. అయితే, ఇదేదో పొరపాటున చేసిన పనికాదు. ఇందుకు ఒక కారణం ఉంది. పీడియాట్రిక్ యూరాలజీ జర్నల్‌లో నివేదించిన వివరాలు ప్రకారం.. 


ఇదో అరుదైన సమస్య: పిల్లలు రెండు అంగాలతో జన్మించడమనేది అరుదైన సమస్య. దీన్ని ‘కంప్లీట్ డిఫాలియా’ లేదా ‘టోటల్ డిఫాలియా’ అని అంటారు. డిఫాలస్ లేదా డూప్లికేషన్ అనేది యూరోజెనిటల్ సమస్యల వల్ల ఏర్పడుతుంది. మగ శిశువుల్లో ఈ సమస్య ఏర్పడినట్లయితే రెండు పురుషాంగాలు ఏర్పడతాయి. ప్రతి ఐదు మిలియన్లలో ఒకరికి మాత్రమే ఇది ఏర్పడుతుంది. ప్రపంచంలో మొదటి కేసు 1609లో నమోదైంది. ఆ తర్వాత దాదాపు 100కు పైగా కేసులు నమోదయ్యాయి. గ్లాన్స్ డూప్లికేషన్, బిఫిడ్ డిఫాలియా, పెనిస్ డూప్లికేషన్ వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఇది కేవలం పురుషుల్లోనే కాదు, మహిళల్లో కూడా ఏర్పడుతుంది. ఈ సమస్య కలిగిన అమ్మాయిలకు రెండు యోనిలు ఉంటాయి. 


బ్రెజిల్ బాలుడు ఈ సమస్యతోనే బాధపడ్డాడు. అయితే చిన్న వయస్సులోనే దాన్ని తొలగించడం ప్రమాదకరమని భావించిన వైద్యులు.. బాలుడికి రెండేళ్లు వచ్చిన తర్వాత సర్జరీ చేశారు. ఆ బాలుడి రెండు అంగాలు వేర్వేరు సైజుల్లో ఉన్నాయి. వైద్యులు తొలుత చిన్నగా ఉన్న అంగాన్నే తొలగించాలని అనుకున్నారు. కానీ, ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నారు. బాలుడు ఎక్కువగా కుడివైపు ఉన్న చిన్న అంగం నుంచే మూత్రం పోస్తున్నాడని తల్లి చెప్పడంతో వైద్యులు పెద్ద అంగాన్ని తొలగించారు.


Also Read: మగాళ్లు జాగ్రత్త! మొబైల్ అతిగా వాడితే ‘అది’ మటాష్, షాకింగ్ న్యూస్ చెప్పిన నిపుణులు


మొత్తానికి వైద్యులు విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. బాలుడికి ఎడమ వైపు ఉన్న పెద్ద అంగాన్ని పూర్తిగా తొలగించారు. ఇటీవల ఉజ్జెకిస్తాన్‌‌కు చెందిన ఓ బాలుడు కూడా రెండు పురుషాంగాలతో జన్మించాడు. అతడి కూడా వయస్సు వచ్చిన తర్వాతే అంగాన్ని తొలగించారు. ఏడేళ్ల వయస్సు వచ్చిన తర్వాత సర్జరీ చేసి పూర్తిగా రెండో అంగాన్ని తీసేశారు. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగానే ఉన్నాడు. 


Also Read: వైద్య చిహ్నంలో పాములు దేన్ని సూచిస్తాయి? ‘అపోలో’ కొడుకును ఎందుకు చంపారు?


గతేడాది ఇరాక్‌లో మరో బాలుడు ఏకంగా మూడు పురుషాంగాలతో జన్మించాడు. అయితే, వాటిలో ఏ పురుషాంగం సక్రమంగా పనిచేయలేదు. కేవలం ఒకదానికి మాత్రమే గ్రంథి (హెడ్) ఉంది. అయితే, పుట్టిన వెంటనే ఈ సమస్య బయటపడలేదు. మూడు నెలల తర్వాత ఆ పసివాడి తల్లిదండ్రులు బిడ్డ పరిస్థితిని తెలుసుకుని వైద్యులను సంప్రదించారు. దీంతో వైద్యులు సర్జరీ ద్వారా ఆ సమస్యను పరిష్కరించారు.