Boost Fertility in Men : సంతానోత్పత్తి సమస్యలు అంటే కేవలం ఆడవారికే అనుకునేవారు ఇప్పటికీ ఉన్నారు. అయితే ఫెర్టిలిటీ ఇష్యూలు మగవారిలో కూడా ఉంటాయి. సంతానోత్పత్తిపై జీవనశైలి, ఆహారపు అలవాట్లు చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తాయట. అయితే ఫెర్టిలిటీ సమస్యలున్న మగవారు.. లేదా సంతానోత్పత్తి సమస్యలను దూరం చేసుకోవాలనుకునేవారు ఎలాంటి ఫుడ్​ తీసుకుంటే మంచిదో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 


శరీరానికి అందించే ఆహారం సంతానోత్పత్తిలో ముఖ్యపాత్రను పోషిస్తుంది. అందుకే ఫుడ్​పై ఫోకస్ పెట్టాలంటున్నారు నిపుణులు. తీసుకునే ఆహారం వల్ల స్పెర్మ్ నాణ్యతను పెంచుతుంది. దీని టెస్టోస్టెరాన్​ స్థాయిలను పెంచి.. ఫెర్టిలిటీ సమస్యలను దూరం చేస్తుందట. అయితే సంతానోత్పత్తి సమస్యలను దూరం చేసుకోవడంలో హెల్ప్ చేసే ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.  లింక్​ ఇదే


న్యూట్రిషన్స్ మగవారి సంతానోత్పత్తిపై ప్రభావాన్ని చూపిస్తాయని పలు పరిశోధనలు తేల్చాయి. పోషకాహార లోపం, అన్​ హెల్తీ ఫుడ్ స్పెర్మ్ ఉత్పత్తిని దెబ్బతీస్తాయట. అలాగే స్పెర్మ్ మూమెంట్స్​ని తగ్గిస్తాయి. ఫలితంగా ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుందట. దీనివల్ల స్పెర్మ్ డీఎన్​ఏ దెబ్బతింటుంది. అలాగే పోషకాలు అధికంగా ఉండే ఆహారం స్పెర్మ్ నాణ్యతను పెంచడంతో పాటు.. హార్మోన్ల నియంత్రణను మెరుగుపరుస్తుందట. ఇది పునరుత్పత్తి పనితీరును పెంచుతుంది. 


తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే



  • జింక్ అధికంగా ఉండే తీసుకోవాలట. దీనివల్ల టెస్టోస్టెరాన్ ఉత్పత్తి పెరిగి.. స్పెర్మ్ అభివృద్ధికి హెల్ప్ చేస్తుందట. అలాగే స్పెర్మ్ కౌంట్​తో పాటు చలనశీలత మెరుగవుతుందట. దీనికోసం లీన్ మీట్, గుమ్మడి గింజలు, శనగలు, గుడ్లు తీసుకోవాలట. 


 



  • విటమిన్ సి ఉండేలా చూసుకోవాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి.. స్పెర్మ్ దెబ్బతినకుండా చేస్తుంది. సిట్రస్ పండ్లు, స్ట్రాబెర్రీలు, బెల్ పెప్పర్స్, బ్రోకలీ వంటివి విటమిన్ సి కి మంచి ఫుడ్స్. 


 



  • విటమిన్ డి టెస్టోస్టెరాన్, స్పెర్మ నాణ్యతను పెంచుతాయి. సూర్యరశ్మి ద్వారా దీనిని పొందవచ్చు. అంతేకాకుండా సాల్మన్ చేపలు, పాలు, గుడ్లును కూడా డైట్​లో చేర్చుకోవాలి. అలాగే విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా మీకు హెల్ప్ చేస్తాయి. 


 



  • ఫోలేట్ స్పెర్మ్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అందుకే దీనిని డైట్​లో చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఆకు కూరలు, బీన్స్, కాయధాన్యాలు, తృణధాన్యాలు ఫోలేట్​కి బెస్ట్ ఆప్షన్స్.


 



  • ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ స్పెర్మ్ మూమెంట్స్​ని మెరుగుపరుస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవాలనుకుంటే సాల్మన్, వాల్​నట్స్, అవిసె గింజలు తీసుకుంటే మంచిది. 


లైఫ్ స్టైల్​లో మార్పులివే.. 



  • అధిక బరువు ఉంటే.. హార్మోన్లకు అంతరాయం కలుగుతుంది. స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యకరమైన బరువు ఫెర్టిలిటీ సమస్యలను దూరం చేస్తుంది. 


 



  • టెస్టోస్టెరాన్ స్థాయిలను మెరుగుపరచడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో వ్యాయామం మంచి ప్రయోజనాలు అందిస్తుంది. 


 



  • ధూమపానం స్పెర్మ్ క్వాలిటీని తగ్గిస్తుంది. స్పెర్మ్ కౌంట్ని కూడా తగ్గిస్తుంది. మైండ్​ఫుల్​నెస్, మెడిటేషన్, ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఇలా స్మోకింగ్​ని దూరం చేసుకోండి. 


 



  • హైడ్రేషన్ కూడా సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది కాబట్టి రోజు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగితే మంచిది. 



Also Read : పది సెకన్ల లిప్ కిస్​తో 80 మిలియన్ బ్యాక్టీరియా బదిలీ.. రోజుకు తొమ్మిదిసార్లు ముద్దు పెట్టుకుంటే జరిగేది అదే






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.