Best Investment for Girl Child : మీకు కూతురు ఉంటే 15 సంవత్సరాలు ఇలా పెట్టుబడి పెట్టండి.. ఎలాంటి ట్యాక్స్ లేకుండా కోటి పొందొచ్చు, పూర్తి వివరాలివే
మీరు మీ పాప కోసం కోటీ రూపాయలు సేవ్ చేయాలనుకుంటే.. మీ కుమార్తె భవిష్యత్తు కోసం ఓ మంచి ప్లేస్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాంటి ప్లేస్ ఏంటి? ఎలా సేవ్ చేస్తే ఆమె పెళ్లి సమయానికి కోటి రూపాయలు జమ చేయొచ్చు.
మీరు పాప కోసం కోటీ రూపాయలు జమ చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న సుకన్య సమృద్ధి యోజన పథకం బెస్ట్ ఆప్షన్. ఇది చిన్న పొదుపు పథకం. బాలికల కోసమే ప్రత్యేకంగా దీనిని ప్రారంభించారు. మీకు పాప పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల వరకు ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
ఈ పథకంలో వడ్డీ PPF కంటే ఎక్కువ. ఇది పూర్తిగా పన్ను రహితం కూడా. ఇది మీ పొదుపును సురక్షితంగా ఉంచడమే కాకుండా పెంచుతుంది. కుమార్తె పుట్టిన వెంటనే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. అలాగే ప్రతి సంవత్సరం దానిలో 1.5 లక్షల రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది.
ఈ మొత్తాన్ని 15 సంవత్సరాల పాటు జమ చేయాలి. ఆ తర్వాత 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత.. ప్రస్తుత వడ్డీ రేటు 8.2 శాతం ప్రకారం.. మెచ్యూరిటీ సమయంలో మీకు దాదాపు 70 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు అందుతుంది. ఈ మొత్తాన్ని మీరు మీ కుమార్తె భవిష్యత్తు కోసం ఉపయోగించడానికి హెల్ప్ అవుతుంది.
సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి.. వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం మూడు కూడా పన్ను రహితమే. ఈ సౌకర్యం మీకు చాలా తక్కువ పథకాల్లో లభిస్తుంది. ఈ పథకంలో మీరు సంవత్సరానికి కనీసం 250 రూపాయలు నుంచి 1.5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
పెట్టుబడి కాలం 15 సంవత్సరాలు. కానీ ఖాతా 21 సంవత్సరాల వరకు నడుస్తుంది. అయితే 15 సంవత్సరాల తర్వాత మీరు ఇందులో పెట్టుబడి పెట్టలేరు. డిపాజిట్ చేసిన మొత్తానికి మాత్రమే వడ్డీ లభిస్తుంది. మీరు కావాలనుకుంటే.. మీ కుమార్తెకు 18 సంవత్సరాలు వచ్చినప్పుడు కొన్ని షరతులతో కొంత డబ్బును కూడా తీసుకోవచ్చు. మీరు ఈ ఖాతాను ఏదైనా పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో తెరవవచ్చు.