అల్లం వెల్లుల్లి సూప్ తాగేందుకు బాగోదేమో అనుకుంటారు చాలా మంది, కానీ ఈ రెండింటితో చేసే సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి నూనెలో వేపుతుంటేనే మంచి సువాసన వస్తుంది. వెజ్ కర్రీలు, నాన్ వెజ్ కర్రీలు, బిర్యానీ రెసిపీలకు మంచి రుచిని ఇవ్వడంలో అల్లం వెల్లుల్లి పేస్టు ముందుంటుంది. ఈ రెండు జతకడితే రోగినిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. శ్వాసకోశ సమస్యలు కొందరిలో వేధిస్తాయి. వారు అల్లం వెల్లుల్లి సూప్ తాగడం వల్ల వారిలో మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మహిళలు వారానికోసారైనా ఈ సూప్ ను తాగితే చాలా మంచిది. రుతుస్రావం సమయంలో కలిగే నొప్పిని తగ్గిస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కనుక, గుండె ఆరోగ్యానికి చాలా మేలు. ఇందులోని యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటితో సమర్థంగా పోరాడతాయి. ముఖ్యంగా వెల్లుల్లిలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. బరువు తగ్గేందుకు ఈ సూప్ చాలా ఉపయోగపడుతుంది. 

కావాల్సిన పదార్థాలువెల్లుల్లి రెబ్బలు - ఎనిమిదిఅల్లం - చిన్న ముక్కక్యారెట్ తరుగు - రెండు టీ స్పూన్లుమిరియాల పొడి - పావు టీస్పూనుకొత్తిమీర తరుగు - మూడు టీ స్పూనులునీరు - సరిపడినన్నిఉప్పు - మీ రుచికి సరిపడా కార్న్ ఫ్లోర్ - ఒక టీస్పూనునెయ్యి - ఒక టీస్పూను

తయారీ ఇలా1. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. 2. నెయ్యి వేడెక్కాక దంచిన వెల్లుల్లి, అల్లం వేసి వేయించాలి. 3. తరువాత క్యారెట్ తరుగు కూడా వేసి కాసేపు వేయించాలి. 4. క్యారెట్ తరుగు కాస్త మెత్తగా మగ్గేవరకు ఉడికించాలి. 5. మిరియాల పొడి, కాస్త ఉప్పు కూడా వేసి మరిగించాలి. 6. ఈ లోపు రెండు కప్పుల నీళ్లలో కార్న్ ఫ్లోర్ కలిపి ఆ నీళ్లను కళాయిలోని మిశ్రమంలో వేయాలి. 7. మూడు నిమిషాల పాటూ ఉడికించి పైన కొత్తి మీర చల్లి దించేయాలి. గోరు వెచ్చగా ఈ సూప్ ను మూడు రోజులకోసారి తాగితే చాలా మంచిది. రోగినిరోధక శక్తి పెరుగుతుంది. 

Also read: ఈ బొమ్మలో మొత్తం ఎన్ని జంతువులున్నాయో కనిపెట్టండి చూద్దాం

Also read: ఇంట్లో పనీర్ సరిగా తయారుచేయలేకపోతున్నారా? ఇదిగో ఇలా చేస్తే బయట కొనే పనీర్‌లాగే ఉంటుంది

Also read: వ్యాపిస్తున్న BA.4 వేరియంట్, ఈ రెండు లక్షణాలను సీరియస్‌గా తీసుకోవాల్సిందే