ఆప్టికల్ ఇల్యూషన్... మన కళ్లు మనల్నే మోసం చేసే చిత్రం. కళ్లకు కణికట్టు చూపే బొమ్మ. వీటితో కాసేపు కాలక్షేపం చేస్తే చాలు మెదడు చురుగ్గా పనిచేస్తుంది, కంటిచూపు పదును తేలుతుంది. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలకు డిమాండ్ ఎక్కువ. సోషల్ మీడియాలో వీటిదే హవా. ఇలా ఒక చిత్రం పోస్టు చేస్తే అలా వైరల్ అయిపోతుంది. అలాంటి ఒక ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రమే ఇది. ఇందులో అందరికీ పెద్దగా ఏనుగు కనిపిస్తుంది. కానీ ఈ చిత్రంలో అనేక జంతువులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో తెలియాలంటే చిత్రాన్ని నిశితంగా పరిశీలించాలి. మీ వంతు ప్రయత్నం చేయండి. మీ వల్ల కాకపోతేనే చివరికి జవాబును చూడండి.
ఇవి కనిపించేస్తాయి
ఆ ఒక్క బొమ్మలో మీకు అయిదు జంతువులు సులువుగా కనిపించేస్తాయి. ఏనుగులో దాగున్న గాడిద, గాడిదలో దాగున్న కుక్క, కుక్కలో దాగున్న పిల్లి, పిల్లిలో దాగున్న ఎలుక ఇలా ఈ అయిదు జంతువులు సులువుగా దొరికేస్తాయి. మిగతా జంతువులను పట్టుకునేందుకు మాత్రం కాస్త కష్టపడాలి. ఏనుగు బాడీలో చూస్తే మరికొన్ని జంతువులు దొరికేస్తాయి.
మొత్తం ఎన్ని జంతువులు?
ఈ బొమ్మలో మొత్తం పదహారు జంతువులు ఉన్నాయి. ఏనుగు తొండం ఆకారంలో డాల్ఫిన్ దాగుంది. అలాగే చెవుల స్థానంలో తాబేలు ఉంది. కళ్ల రూపంలో చేప కనిపిస్తుంది. తోక రూపంలో పాము, గాడిద చెవుల్లాగా కోడిపెట్ట దాక్కుని ఉంది. ఇంకా కొన్ని జంతువులు మరింత నిశితంగా చూస్తేనే కనిపిస్తాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఎవరు చిత్రికరించారో తెలియదు కానీ చాలా వైరల్ అయింది.
మెదడుకు మేత
ఆప్టికల్ ఇల్యూషన్ వంటి చిత్రాలు సెలవు రోజుల్లో మంచి టైమ్ పాస్ లా ఉంటాయి. మెదడుకు మేతగా పనికొస్తాయి. వీటిని తదేకంగా చూడడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది. మెదడులోని కొన్ని భాగాలు చురుగ్గా పనిచేస్తాయి. పిల్లలకు కూడా వీటిని అలవాటు చేస్తే మంచిది.
Also read: ఇంట్లో పనీర్ సరిగా తయారుచేయలేకపోతున్నారా? ఇదిగో ఇలా చేస్తే బయట కొనే పనీర్‌లాగే ఉంటుంది