జ్ఞాపకశక్తిని పెంపొందించే ఆహారం ఏది అనగానే వాల్ నట్స్ పేరు ఎక్కువ మంది చెబుతారు. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందించే పోషకాహారం ఇది. చర్మం, జుట్టు నుంచి మొత్తం ఆరోగ్యాన్ని ఇవ్వడంలో వాల్ నట్స్ ముందు ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. అసంతృప్త కొవ్వులు అందించే గొప్ప మూలం. గుండెకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మమెదడుని ప్రశాంతంగా ఉంచుతుంది. రోజుకి రెండు వాల్ నట్స్ నానబెట్టుకుని తింటే చాలా మంచిది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం ఒమేగా 3, ఒమేగా 6 అసంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే అద్భుతమైన పదార్థం. ఈ రెండు కొవ్వు ఆమ్లాలు సరైన మొత్తంలో వినియోగించినప్పుడు చర్మం వాపు, ముడతలు వంటి ఇతర సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
రక్తశుద్ధి: ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి టాక్సిన్స్ ను ఫ్లష్ చేయడంలో సహాయపడతాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ని తటస్థీకరిస్తాయి. మొటిమలు, వాటి వల్ల వచ్చే సమస్యలను తొలగించడంలో సహకరిస్తాయి.
స్కిన్ మాయిశ్చరైజింగ్: చర్మాన్ని తేమగా ఉంచడంలో వాల్ నట్స్ చక్కగా పని చేస్తాయి. విటమిన్ ఇ, బి5తో నిండి ఉంటాయి. ఇది లోపలి నుంచి ఆరోగ్యంగా హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. రంధ్రాలు మూసుకుపోవడాన్ని నివారిస్తుంది.
డార్క్ సర్కిల్స్: కళ్ళ చుట్టూ ఏర్పడే డార్క్ సర్కిల్స్ పోగొట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎక్కువ సమయం స్క్రీన్ ముందు కూర్చోవడం వల్ల ఈ సమస్య అధికంగా ఉంటుంది. దీని వల్ల కళ్ళు అలిసిపోవడం మాత్రమే కాదు కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చేలా చేస్తుంది. ఈ నల్లటి వలయాలను తగ్గించి చర్మాన్ని రిఫ్రెషింగ్ గా చేయడంలో వాల్ నట్స్ పని చేస్తాయి.
గ్లోయింగ్ స్కిన్: వాల్ నట్స్ లో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని హైడ్రేట్, హెల్తీగా ఉంచడంలో సహాయపడటయి. డార్క్ ప్యాచ్, పిగ్మెంటేషన్ ఏర్పడటాన్ని మరింత తగ్గిస్తాయి. దాని వల్ల చర్మం లోపల నుంచి మెరుస్తూ ఉంటుంది.
రోజుకి 4-5 వాల్ నట్స్ తీసుకుంటే మీ చర్మం మెరుపు సంతరించుకుంటుంది. అయితే ఏదైనా మితంగా తీసుకోవాలి. శరీర అవసరాన్ని బట్టి వాల్ నట్స్ తీసుకుంటే మంచిది. అది కూడా వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.
చర్మానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. వీటిని నానబెట్టుకుని తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. గుండెకి మేలు చేస్తుంది. కొవ్వుని కరిగించి ఆరోగ్యకరంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుండె పోటు ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించేస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: వేడి వేడి పానీయాలు తాగుతున్నారా? జాగ్రత్త ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది