చలికాలం వచ్చిందంటే పొడి చర్మం, స్కాల్ఫ్ సమస్య చికాకు, దురదకి దారితీస్తుంది. వాటి నుంచి బయటపడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. జిడ్డు చర్మం, పొడి చర్మం, అనారోగ్యకరమైన చర్మ పరిస్థితులు ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. తల విషయంలో ఎక్కువ మంది ఎదుర్కొనే సాధారణ సమస్య చుండ్రు. ఇది వచ్చిందంటే వదిలించుకోవడం కాస్త కష్టమే.
అసలు చుండ్రు అంటే ఏంటి?
ఇది మలాసెజియా అనే ఫంగస్ వల్ల వచ్చే స్కాల్ఫ్ సమస్య. వేసవి, వర్షాకాలంలో సాధారణంగా అందరినీ ఇబ్బంది పెడుతుంది. కానీ కొంతమందికి మాత్రం శీతాకాలంలో కూడా చుండ్రు సమస్య వస్తుంది. అందుకు కారణం చల్లని గాలి జుట్టు, తలపై ఉన్న తేమని తొలగిస్తుంది. ఇది పొడిగా, పొరలుగా ఉంటుంది. చుండ్రుని వదిలించుకోవడానికి మార్కెట్లో దొరికే షాంపూలు, నూనెలకి బదులు వంటింట్లో దొరికే వాటితోనే పరిష్కరించుకోవచ్చు.
బేకింగ్ సోడా
బేకింగ్ సోడా జుట్టుకి బాగా పని చేస్తుంది. దీన్ని తడి జుట్టుకి అప్లై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు అలాగే ఉంచిన తర్వాత జుట్టుని నీటితో బాగా కడగాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకి చుండ్రు సమస్య పోతుంది.
నిమ్మరసం, పెరుగు
ఒక గిన్నెలో నిమ్మరసం, పెరుగు కలుపుకోవాలి. దీన్ని తలకి పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి. 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకున్న తర్వాత దాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు పొందుతారు.
వేపాకుల పేస్ట్
వేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఆయుర్వేద మూలికల్లో వేపకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వేపాకుల చూర్ణం తలకి అప్లై చేసుకోవాలి. కనీసం 10 నిమిషాల పాటు దాన్ని ఆరబెట్టుకోవాలి. తర్వాత జుట్టుని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
ఆపిల్ సిడర్ వెనిగర్, నీళ్ళు
నీరు, ఆపిల్ సిడర్ వెనిగర్ సమపాళ్ళలో తీసుకోవాలి. జుట్టు కడిగిన తర్వాత దీన్ని అప్లై చేసుకోవాలి. కొద్ది సేపు ఆరనిచ్చిన తర్వాత మళ్ళీ తలని నీటితో శుభ్రం చేసుకుని మెత్తని టవల్ తో తుడుచుకోవాలి.
సాల్మన్ చేపలు
సాల్మన్, ట్యూనా వంటి చేపలు ఆరోగ్యకరమైనవి. ఈ చేపల్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలని ప్రోత్సాహిస్తుంది.
గుడ్డు
గుడ్డులో జింక్, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కాల్ఫ్, జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తాయి. నేరుగా గుడ్డు జుట్టుకి అప్లై చేసుకుంటారు. కొంతమంది. ఇలా చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది. అయితే గుడ్డు పెట్టుకున్న తర్వాత తప్పనిసరిగా షాంపూ చెయ్యాలి. లేదంటే దాని వాసన ఇబ్బంది పెడుతుంది.
అవకాడో
స్కాల్ఫ్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఆరోగ్యకరమైన కొవ్వులు అందించే సహజ మూలం అవకాడో. ఇవి తినడం వల్ల జుట్టుకి మేలు జరుగుతుంది.
నట్స్
ఆరోగ్యకరమైన కొవ్వులు, జింక్, ఇతర విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహకరిస్తాయి.
అరటిపండ్లు
అరటి పండులో జింక్, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కాల్ఫ్ ని రక్షించడంలో,, ఆరోగ్యకరమైన జుట్టుని ప్రోత్సహించడంలో సహాయపడతాయి.
ఆలివ్ నూనె
ఆలివ్ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని నేరుగా తలకి కూడా రాసుకోవచ్చు. వంటలకి ఉపయోగించుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: మోమోస్ తినడం ఆరోగ్యానికి హానికరమా? డయాబెటిస్ వచ్చే ఛాన్సు పెరుగుతుందా?