మీ మొహం మెరిసిపోతూ ఉందంటే చర్మం ఆరోగ్యకరంగా ఉందని అర్థం. అప్పుడే నిగనిగలాడుతూ కాంతివంతంగా కనిపిస్తారు. హైడ్రేట్ గా ఉంటూ, సరైన పోషక విలువలు తీసుకుంటూ, సంరక్షణ చర్యలు తీసుకున్నారంటే చర్మం చక్కగా మెరిసిపోతుంది. మొహం సహజమైన కాంతిని మిస్ అయ్యిందంటే మీరు అనారోగ్యవంతమైన చర్మాన్ని కలిగి ఉన్నారనేందుకు సంకేతం. దీని వల్ల ఫేస్ నిస్తేజంగా పొడి బారిపోయినట్టుగా కనిపిస్తుంది. చర్మానికి సహజమైన మెరుపు ఇవ్వాలని అనుకుంటే ఈ మార్గాలు అనుసరించి చూడండి.
హైడ్రేట్: చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. అప్పుడే స్కిన్ ప్రకాశవంతంగా, బొద్దుగా కనిపిస్తుంది. సహజమైన మెరుపుని ఇస్తుంది.
ఆరోగ్యకరమైన ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. బెర్రీలు, బచ్చలికూర, గింజలు వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు చర్మాన్ని దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన మెరుపుని అందిస్తాయి.
స్కిన్ కేర్ రొటీన్: క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ వంటి చర్మ సంరక్షణ దినచర్యను పాటించాలి. చర్మాన్ని శుభ్రంగా ఉంచాలి. పోషణ అందించేందుకు చర్మ రకానికి తగిన ఉత్పత్తులు ఉపయోగించాలి.
ఎక్స్ ఫోలియేట్: మృత చర్మ కణాలు తొలగించేందుకు, రంధ్రాలు అన్ లాగ్ చేసేందుకు చర్మాన్ని క్రమం తప్పకుండా ఎక్స్ ఫోలియేట్ చేయాలి. చర్మ సంరక్షణ ఉత్పత్తులని అప్పుడే చక్కగా స్కిన్ గ్రహిస్తుంది. మృదువైన, ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తుంది. మృత కణాలు తొలగించకుండా వదిలేస్తే చర్మం మీద మొటిమలు ఏర్పడతాయి. అవి గడ్డలు లేదా మచ్చలుగా మారి నొప్పి కలిగించడం చేస్తాయి. మొహాన్ని అందవిహీనంగా మార్చేస్తాయి. వారానికి కనీసం ఒకటి లేదా రెండు సార్లు ఎక్స్ ఫోలియేట్ చేయడం మంచిది.
ఫేస్ మసాజ్: రక్త ప్రసారం మెరుగుపరిచేందుకు చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపుని అందించేందుకు ముఖానికి మసాజ్ చేసుకోవాలి. వృత్తాకార కదలికలతో సున్నితంగా మసాజ్ చేసుకోవడం మంచిది. ఫేస్ రోలర్ లేదా చేతివేళ్ళను ఉపయోగించి మసాజ్ చేసుకోవచ్చు. ఇది ఫేస్ కి రిలాక్స్ ఇస్తుంది. చర్మ రకానికి సరిపడా ఫోమ్, జెల్, క్రీమ్ లేదా లోషన్ ఏదైనా ఎంచుకుని తడిగా ఉన్న ముఖం మీద సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ఫ్రెష్ అనుభూతి కలుగుతుంది.
సహజమైన మేకప్: వర్షాకాలంలో మేకప్ ఎక్కువగా వినియోగించకపోవడమే మంచిది. హెవీకా కాకుండా ఫీచర్ ని మెరుగుపరిచే సహజమైన మేకప్ లుక్ ని ఎంచుకోవాలి. కాంతివంతమైన మెరుపు కోసం మొహం మీద లేత రంగులు కలిగిన మాయిశ్చరైజర్, బ్లష్, టచప్ ఇచ్చుకోవడం మంచిది. బయట నుంచి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మేకప్ తీసేసి పడుకోవాలి. మేకప్ రిమూవర్ లేదా క్లెన్సింగ్ ఆయిల్ ని ఉపయోగించి ముఖం నుంచి మేకప్ ని తొలగించుకోవచ్చు.
టోనర్: ముఖానికి కాటన్ ప్యాడ్ తో టోనర్ ని అప్లై చేసుకోవాలి. టోనర్లు చర్మం pH స్థాయిలని సమతుల్యం చేస్తాయి. సీరమ్, మాయిశ్చరైజర్ లని బాగా గ్రహించేలా చేసేందుకు చర్మాన్ని సిద్ధం చేస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పెరుగు తినకూడదా?
Join Us on Telegram:https://t.me/abpdesamofficial