సముద్ర తీరంలో ఇళ్లను నిర్మించడం ఎప్పటికైనా ప్రమాదమే. సముద్రం ఎప్పుడూ ఉన్న చోటే ఉండదు. భూకంపాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఎగిసిపడుతుంది. ఇక సునామీ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది మీకు తెలిసిందే. సముద్రం ముందుకొచ్చి అమాంతంగా ఇళ్లను మింగేస్తుంది. తాజాగా నార్త్ కరోలినాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
హట్టెరాస్ ద్వీపంలోని రోడంతేలో సముద్రం ఒక్కసారిగా ముందుకొచ్చింది. అలలు బలంగా తీరాన్ని తాకాయి. దీంతో సముద్ర తీరంలో ఉన్న ఓ ఇల్లు అందులో చిక్కుకుంది. లక్కీగా ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అది చెక్కతో నిర్మించిన ఇల్లు కావడంతో క్షణాల్లోనే అది సముద్ర అలల తాకిడికి కూలిపోయింది. ఆ తర్వాత అది సముద్ర అలల్లో కలిసిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కేప్ హటెరాస్ నేషనల్ సీషోర్‌కు చెందిన యూఎస్ నేషనల్ పార్క్ సర్వీస్ అధికారులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఒక రోజు వ్యవధిలోనే రెండు ఇళ్లు అలల్లో కలిసిపోయాయని తెలిపారు. ఇవి కాకుండా ఇంకా ఆ ప్రాంతంలో మరో 9 ఇళ్లు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సముద్రం ఇంకా ముందుకొస్తే భవిష్యత్తులో మరిన్ని ఇళ్లు ప్రమాదంలో చిక్కుకునే అవకాశాలున్నాయని తెలిపారు.
Also Read: హెలికాప్టర్‌ను కూల్చేసిన షార్క్, కిరణ్ బేడీని తిట్టిపోస్తున్న నెటిజన్స్, ఎందుకంటే..
అధికారులు పోస్టు చేసిన వీడియోలని ఇల్లు విలువ సుమారు రూ.2.95 కోట్లు ఉంటుందని అంచనా. అయితే, నెటిజనులు.. తీరానికి అంత దగ్గర్లో ఇల్లు కట్టేందుకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. పర్యవరణానికి కూడా అది ముప్పేనని వెల్లడిస్తున్నారు. US నేషనల్ పార్క్ సర్వీస్ డేటా ప్రకారం.. సముద్ర తీరం సుమారు 282 అడుగుల మేర కోతకు గురైంది. అందుకే ఆయా నివాసాలు అలల్లో కలిసిపోయాయి. అధికారులు పోస్ట్ చేసిన వీడియోను ఇక్కడ చూడండి.
Also Read: వీడియో - అపస్మారక స్థితిలో పైలట్, అనుభవం లేకున్నా సేఫ్‌గా ల్యాండ్ చేసిన ప్రయాణికుడు