Hyderabad Murder Case : ఇద్దరు లవర్స్. ప్రేమించుకున్నారు. ప్రేమలోనే హద్దులు దాటిపోయారు. అన్నీ చేసేసుకున్నారు. వీడియోలు కూడా తీసుకున్నారు. చివరికి తేడా వచ్చింది. అబ్బాయి పెళ్లి చేసుకోనని అంటాడు. అమ్మాయి బోరుమని ఏడుస్తుంది. ఇలాంటి క్రైమ్ స్టోరీలు రొటీన్ . అబ్బాయే అన్నీ చేసేసుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకోవాలని లేకపోతే వీడియోలు బయటపెడతానని బెదిరించడం... నీ పని ఇలా ఉందా..అని ఆ అమ్మాయి ప్రేమికుడ్ని మర్డర్ చేయించడం కొత్త క్రైమ్ ధ్రిల్లర్. నిజంగానే హైదరాబాద్‌లో జరిగింది.
నిజాంపేటలో విషాదం, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం, ఇద్దరు మృతి
మీర్‌పేట ప్రశాంతి హిల్స్‌లో నివాసం ఉండే శ్వేతారెడ్డికి సోషల్ మీడియాలో యాష్మకుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. శ్వేతా రెడ్డికి పెళ్లి కూడా అయింది. అయినప్పటికీ ఫన్ కోసమో.. లేకపోతే మరో అవసరం కోసమో కానీ యాష్మకుమార్‌తో ఎఫైర్ కొనసాగించింది. వివాహేతర బంధం ఏర్పర్చుకుంది. కుదరనప్పుడు న్యూడ్ కాల్స్ మాట్లాడుకునేవారు. అయితే యాష్మకుమార్ ... శ్వేతారెడ్డిని సిన్సియర్‌గా ప్రేమించాడు. తనను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ శ్వేతారెడ్డి మాత్రం అలా అనుకోలేదు. యాష్మకుమార్ తో కలిసి ఉండాలనే ఆలోచన చేయలేదు. పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు అదే చెప్పింది. అయితే యాష్మ కుమార్ మాత్రం శ్వేతారెడ్డిని మర్చిపోలేదు. పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. చివరికి పెళ్లికి ఒప్పుకోకపోతే న్యూడ్ కాల్స్ బయటపెడతానని కూడా హెచ్చరించాడు.
సీన్ కట్ చేస్తే ఓ రోజు రోడ్‌పై యాష్మ కుమార్ అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. రోడ్డు ప్రమాదం అని పోలీసులు అనుకున్నారు. అలాంటి సీన్ క్రియేట్ చేశారు. కానీై పోలీసులు అలాంటి కేసులు చాలా చూసి ఉన్నారు కాబట్టి తేడా కొట్టింది. వివరాలు బయటకు తీస్తే న్యూడ్ కాల్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వాటిని పట్టుకుని మిగతా కథ అంతా రివీల్ చేశారు. క్లైమాక్స్ ఏమిటంటే... యాష్మకుమార్ న్యూడ్ కాల్స్ బయటపెడతానని బెదిరించిన తర్వాత ... శ్వేతారెడ్డి ఆర్ఎక్స్ 100 సినిమా హీరోయిన్ టైప్‌లో ఆలోచించింది. స్నేహితుల్ని మాట్లాడింది. యాష్మకుమార్‌తో మత్తుగా మాట్లాడి పిలిపించింది. అందరూ కలిపి చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి వెళ్లిపోయారు. కానీ పోలీసులు తీగ లాగేసరికి దొరికిపోయారు. ఇప్పుడు శ్వేతారెడ్డితో పాటు ఇద్దరు మిత్రులు కూడా కటకటాల పాలయ్యారు.