Daily Stretches for Back Pain : చదువు, ఉద్యోగం ఇలా ఇతర కారణాల చాలామంది శారీరకంగా యాక్టివిటీ ఉండదు. పైగా ఎక్కువసేపు కూర్చోవాల్సి ఉంటుంది. చిన్నవయసులో ఇది అంతగా ఇబ్బంది పెట్టకపోయినా.. వయసు పెరిగే కొద్ది.. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వివిధ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా నడుము నొప్పి సమస్య ఎక్కువ అవుతుంది. దీనివల్ల సరిగ్గా కూర్చోలేరు, పడుకోలేరు.. అబ్బో ఒకటా.. రెండా.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

Continues below advertisement


నిపుణుల ప్రకారం నాలుగు గంటల కంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నెముకపై తీవ్రమైన ప్రెజర్ పడుతుందని.. దీనివల్ల బ్యాక్ సమస్యలు వస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల ఈ సమస్య తీవ్రమవుతుందని చెప్తున్నారు. అందుకే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని.. దానివల్ల ఈ నడుమునొప్పిని తగ్గించుకునే వీలు ఉంటుందని చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.


డెడ్ హ్యాంగ్స్


డెడ్ హ్యాంగ్స్ చేయడం వల్ల మీ వెన్నెముక డీకంప్రెస్ చేస్తుంది. అలాగే హిప్స్ అన్​లాక్ అవుతాయి. భుజాలు కూడా వదులు అవుతాయి. దీనివల్ల ఒక రిలీఫ్ వస్తుంది. మళ్లీ మీ నడుము, బ్యాక్ అంతా రీసెట్ అవుతుంది. కాబట్టి డెడ్ హ్యాంగ్స్ మీ వ్యాయామంలో భాగం చేసుకోవాలంటున్నారు. దీనివల్ల మొబిలిటీ కూడా పెరుగుతుందని చెప్తున్నారు. 


డెడ్ లిఫ్ట్స్ 


నడుమునొప్పితో ఇబ్బందిపడేవారు, బ్యాక్ మజిల్స్ వీక్​గా ఉండేవారు కచ్చితంగా చేయాల్సిన వర్క్​అవుట్​లో డెడ్​లిఫ్ట్స్ మరొకటి. మీ బ్యాక్​ని స్ట్రాంగ్ చేసి నడుము నొప్పిని దూరం చేసుకోవడానికి వారానికి రెండుసార్లు అయినా డెడ్ లిఫ్ట్ చేయాలని సూచిస్తున్నారు. ఇది నడుమునొప్పిని దూరం చేయడమే కాకుండా.. వెన్నెముకను, మొత్తం బ్యాక్ మజిల్స్​ని స్ట్రాంగ్ చేస్తుంది. 


బాలాసనం


బాలాసనం కూడా నడుమునొప్పి నుంచి మంచి ఉపశమనం ఇస్తుంది. ఇది లోయర్ బ్యాక్ మజిల్స్​ని రిలివ్ చేసి.. నడుము, మెడ, భుజాలపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి దీనిని వ్యాయామం చేసేముందు లేదా చేసిన తర్వాత.. రాత్రుళ్లు పడుకునే ముందు కూడా మీరు ఈ ఆసనాన్ని ట్రై చేయవచ్చు. 


భుజంగాసన


దీనిని కోబ్రా పోజ్ అని కూడా అంటారు. ఈ స్ట్రెచ్ కూడా నడుమునొప్పి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే వెన్నెముకకు ఉపశమనాన్ని అందిస్తుంది. మీరు ఈ ఆసనం చేస్తున్నప్పుడే రిలీఫ్​ని పొందగలుగుతారు కాబట్టి.. దీనిని కూడా మీ రొటీన్​లో భాగం చేసుకోండి. వ్యాయామం చేసినా చేయకున్నా వీటిని ఇంట్లో కూడా ట్రై చేయవచ్చు. 


బ్రిడ్జ్ పోజ్ 


ఈ స్ట్రెచ్ కూడా నడుమునొప్పిని తగ్గించి.. బ్యాక్ మజిల్స్​ని స్ట్రాంగ్ చేస్తుంది. లోయర్ బ్యాక్ పెయిన్​తో ఇబ్బంది పడేవారు కచ్చితంగా ఈ ఆసనం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు పొందుతారు.


కూర్చోనేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు


ఎలాగో ఎక్కువసేపు కూర్చోవడం తప్పదని తెలిసినప్పుడు.. నడుమునొప్పి రాకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. మీరు కూర్చొన్నప్పుడు మీ భంగిమ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. భంగిమ మారినప్పుడల్లా దానిని రీసెట్ చేసుకోవాలి. రోజులో కనీసం 30 నిమిషాలు నడిచేలా చూసుకోండి. అలాగే ప్రతి 45 నిమిషాలకు ఓసారి లేచి పది నిమిషాలు వాక్ చేయండి. ఇవి కూడా మీకు నడుము నొప్పి నుంచి ఉపశమనం ఇస్తాయి. 


వీటన్నింటినీ రెగ్యులర్​గా ఫాలో అయితే కచ్చితంగా బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. పరిస్థితి మరీ సీరియస్​గా ఉంటే కచ్చితంగా వైద్యుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. 



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.