బేబీ షాంపూల వల్ల పిల్లలు ఏడవకుండా తలస్నానం చేసుకుంటారు. కళ్లల్లో పడినా మండకపోవడం వీటి ప్రత్యేకత. అవి పిల్లలకు స్నానం చేయించడానికి తప్ప మరెందుకు పనికిరావనుకుంటున్నారా? వాటితో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. 


ఫ్లోర్ క్లీనింగ్‌కు...
లామినేట్ ఫ్లోర్లను, వాల్ పేపర్ వేసి ఉన్న గోడలపై పడిన మరకలను క్లీన్ చేయాలంటే బేబీ షాంపూ బాగా పనిచేస్తుంది. ఇందులో హానికర రసాయనాలు ఉండవు కనుక ఫోర్లు, వాల్ పేపర్లు పాడవ్వవు. రెండు మూడు చుక్కల బేబీ షాంపూతో మరకలను తుడిస్తే సులువుగా పోతాయి. 


జిప్‌ ఇరుక్కుపోయినా...
జిప్ డ్రెస్‌లో ఇరుక్కుపోవడం చాలా మంచికి అనుభవంలోకి వచ్చేదే. జిప్పర్లో జిప్ ఇరుక్కుపోతే ఒక చుక్క బేబీ షాంపూని జిప్పర్ కు పూయాలి. అప్పుడు జిప్‌ను లాగితే అది సాధారణంగా పనిచేస్తుంది. 


లెదర్ ఫర్నిచర్‌కు...
లెదర్ ఫర్నిచర్ క్లీన్ చేయాలంటే తక్కువ రసాయనాలు కలిగిన క్లీనర్లు అవసరం. బేబీ షాంపూ లెదర్‌ను చక్కగా శుభ్రపరుస్తుంది. లెదర్ వస్తువులపై మరకలు పడితే బేబీ షాంపూలో ముంచిన వస్త్రంతో తుడిస్తే శుభ్రపడిపోతాయి. 


జ్యువెలరీకి..
కాస్ట్యూమ్ జ్యువెలరీ శుభ్రపరిచేందుకు కూడా బేబీ షాంపూని ఉపయోగించవచ్చు. నీళ్లలో ఒక చుక్క బేబీ షాంపూని కలిపి ఆ నీళ్లలో వస్త్రాన్ని ముంచి జ్యువెలరీ క్లీన్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 


తామరకు చెక్...
బేబీ షాంపూ శిశువు జుట్టునే కాదు, మన చర్మాన్ని కూడా శుభ్రపరుస్తుంది. తామర ఉన్న వారు బేబీ షాంపూతో తరచూ క్లీన్ చేసుకుంటుంటే త్వరగా మానిపోయే అవకాశం ఉంది. 



Also Read: కొత్త ఏడాదిలో ధనవంతులవ్వాలని ఆశపడుతున్నారా? ఇంట్లో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి...
Also Read: టీ ప్రేమికులందరికీ ఓ ప్రశ్న... రోజూ మీరు తాగే టీ మిమ్మల్ని లావుగా చేస్తోందని తెలుసా?





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.