యోగా గురు బాబా రామ్‌దేవ్ నేడు భారతదేశంలో ఫిట్‌నెస్, ఆయుర్వేదానికి గ్లోబల్ ఐకాన్‌గా మారారు. 59 ఏళ్ల వయసులో కూడా ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటారు. చాలా మంది యువకులను మించి పవర్‌ఫుల్‌గా కనిపిస్తారు. ఇటీవల ఒక కార్యక్రమంలో ఆయన తన ఆరోగ్యం, సక్సెస్, దినచర్య గురించి వివరించారు. సరళమైన జీవనశైలిని, యోగాను పాటించడం ద్వారా ఎవరైనా తీవ్రమైన వ్యాధుల బారి నుంచి కోలుకోవచ్చో ఆయన వివరించారు.
బ్రహ్మ ముహూర్తంలో మేల్కొలపడం ప్రాముఖ్యతబాబా రామ్‌దేవ్ తన రోజును బ్రహ్మ ముహూర్తంలో (ఉదయం 3 నుండి 4 గంటల మధ్య) ప్రారంభిస్తారు. ఉదయాన్నే త్వరగా మేల్కోవడం వల్ల శరీరం, మనస్సు రెండింటికీ కొత్త శక్తి లభిస్తుందని ఆయన నమ్ముతారు. మేల్కొన్న తర్వాత బాబా రాందేవ్ మొదట భూమాతకు, తన గురువులకు నమస్కరించి, ఆపై గోరువెచ్చని నీళ్లు తాగుతారు. ఇది మీ పొట్టను క్లీన్ చేస్తుంది. శరీరాన్ని రీయాక్టివ్ చేయడానికి సహాయపడుతుంది.
యోగా, ధ్యానం.. మీ రోజుకు పునాదిబాబా రామ్‌దేవ్ దినచర్యలో అత్యంత ముఖ్యమైన భాగం యోగా, ధ్యానం కోసం కొంత సమయం కేటాయించడం. ఆయన ప్రతిరోజూ ఒక గంట ధ్యానం చేస్తానని, ఇది మానసిక ప్రశాంతతకు, ఒత్తిడి నుండి ఉపశమనానికి అవసరమని చెబుతారు. ఆ తర్వాత ఆయన కపాలభాతి, అనులోమ్-విలోమ్, సూర్య నమస్కారం వంటి యోగాసనాలు క్రమం తప్పకుండా పాటిస్తారు. ఆయన ప్రకారం యోగా శరీరాన్ని సరళంగా మార్చడమే కాకుండా, డయాబెటిస్, ఊబకాయం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
సాత్విక, సహజ ఆహారంఆహారం విషయానికి వస్తే, బాబా రామ్‌దేవ్ సాత్విక ఆహారం తీసుకుంటారు. ఆయన తన ఆహారంలో తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, సహజ వనరుల నుండి లభించే ఆహార పదార్థాలను మాత్రమే చేర్చుకుంటారు. జంక్ ఫుడ్ శరీరానికి విషం లాంటిదని బాబా రాందేవ్ స్పష్టంగా చెప్పారు. శాకాహారం శరీరంలోని 3 ప్రధాన దోషాలైన వాత, పిత్త, కఫాల సమతుల్యతను కాపాడుతుందని, వ్యాధులను దూరంగా ఉంచుతుందని చెప్పారు.
బాబా రామ్‌దేవ్ సందేశం స్పష్టంగా ఉంది. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, ప్రకృతి వైపు ఫోకస్ చేయాలి. ఆయుర్వేదం, క్రమం తప్పకుండా యోగా, క్రమశిక్షణతో కూడిన ఆహారం సుదీర్ఘ, వ్యాధి రహిత జీవితానికి కారణం అవుతుంది. ఈ అలవాట్లను పాటించడం ద్వారా మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, మానసికంగా దృఢంగా మారతారు. చేసే పనిలో విజయాన్ని సాధించవచ్చు అన్నారు.