Best car dashcams 2025: భారతీయ రోడ్లపై, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో డ్రైవింగ్ అంటే నిజంగా ఓ పరీక్షే. పెద్ద నగరాల్లో భారీ ట్రాఫిక్, చిన్న పట్టణాల్లో హఠాత్తుగా అడ్డుపడే సవాళ్లు, హైవేలపై వేగంగా దూసుకొచ్చే వాహనాలు - ఇవన్నీ కలిసి డ్రైవర్లకు ప్రతిరోజూ కొత్త సవాళ్లు విసురుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో డ్యాష్‌క్యామ్ ఇప్పుడు లగ్జరీ కాదు, తప్పనిసరి సేఫ్టీ గాడ్జెట్‌గా మారింది.
కొత్త కారు కొనుగోలు చేసినా, పాత కారు వాడుతున్నా... ఆఫ్టర్‌మార్కెట్ యాక్సెసరీస్‌లో డ్యాష్‌క్యామ్ మొదటి స్థానంలో ఉంటుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు నిజం ఏంటో చూపించే నిశ్శబ్ద సాక్షిగా ఇది పని చేస్తుంది. 2025లో, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌లు అనేక డ్యాష్‌క్యామ్‌లను టెస్ట్ చేశారు. వాటిలో అన్ని విధాలా మెప్పించిన టాప్ 5 డ్యాష్‌క్యామ్‌లు ఇవే.
Dylect Sense 4K Max DC
డ్యాష్‌క్యామ్ మార్కెట్‌లోకి అడుగు పెట్టిన Dylect, తొలి ప్రయత్నంలో తీసుకొచ్చిన గాడ్జెట్ Sense 4K Max. ఇది డ్యూయల్ ఛానల్ డ్యాష్‌క్యామ్. ముందు కెమెరా 4K రిజల్యూషన్‌లో వీడియో రికార్డ్ చేస్తే, వెనుక కెమెరా 1080P రిజల్యూషన్‌లో పని చేస్తుంది. డే టైమ్‌తో పాటు నైట్ టైమ్‌లో కూడా ఫుటేజ్ చాలా క్లియర్‌గా ఉంటుంది. తక్కువ లైటింగ్‌లో కూడా నంబర్ ప్లేట్లు స్పష్టంగా కనిపించాయి. అయితే దీని మొబైల్ యాప్ కొత్తవారికి కొంచెం క్లిష్టంగా అనిపించవచ్చు. ఒకసారి అలవాటు అయితే మాత్రం ఫీచర్లు బాగా ఉపయోగపడతాయి. ధర ₹17,999.
Qubo Dashcam Pro 3K (Starvis 2)
2025లో ఎక్స్‌పర్ట్‌లను బాగా ఆకట్టుకున్న మరో డ్యాష్‌క్యామ్ Qubo Dashcam Pro 3K. Starvis 2 సెన్సర్‌తో ఇది మరింత స్థిరమైన వీడియో క్వాలిటీ ఇస్తుంది. ఎక్స్‌పర్ట్‌లు టెస్ట్ చేసినది సింగిల్ ఛానల్ మోడల్ అయినా, డ్యూయల్ ఛానల్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. 3K రిజల్యూషన్ వల్ల హై స్పీడ్ డ్రైవింగ్‌లో కూడా నంబర్ ప్లేట్లు, రోడ్డు వివరాలు స్పష్టంగా రికార్డ్ అవుతాయి. యాప్ ఇంటర్‌ఫేస్ చాలా సింపుల్‌గా ఉండటం దీని పెద్ద ప్లస్. ధర ₹13,990.
Pioneer VREC Z820DC
Pioneer నుంచి వచ్చిన ఈ Z820DC ఒక ప్రీమియం డ్యూయల్ ఛానల్ డ్యాష్‌క్యామ్. 4K వీడియో రికార్డింగ్‌తో పాటు AI ఆధారిత నైట్ విజన్, ADAS ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డ్రైవింగ్ సమయంలో లేన్ డిపార్చర్, ఫ్రంట్ కార్ వార్నింగ్ వంటి అలర్ట్స్ ఉపయోగపడతాయి. ZenVue యాప్‌లో మొదట్లో కొంచెం చిన్న సమస్యలు కనిపించినా, ఇప్పుడు అవి సరిచేసి ఉండే అవకాశం ఉంది. ధర ₹22,499.
Pioneer VREC H520DC
VREC H520DC ఒక కాంపాక్ట్ రూపంలో, కానీ గట్టి నిర్మాణంతో వచ్చిన డ్యూయల్ ఛానల్ డ్యాష్‌క్యామ్. పగలు, రాత్రి రెండింటిలోనూ ఇది నమ్మదగిన వీడియో ఫుటేజ్ అందించింది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్, మంచి బిల్డ్ క్వాలిటీ వల్ల బడ్జెట్ మోడళ్లతో పోలిస్తే ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. ధర ₹18,499.
Qubo Bike Cam Pro
కార్లకే కాకుండా బైకులు, స్కూటర్ల కోసం కూడా డ్యాష్‌క్యామ్ అవసరం పెరుగుతోంది. Qubo Bike Cam Pro ఒక హెల్మెట్ మౌంటెడ్ డ్యాష్‌క్యామ్. వీడియో క్వాలిటీ బాగుండటంతో పాటు వాతావరణానికి తట్టుకునే డిజైన్ ఉంది. మొబైల్ యాప్ ఆధారిత ఫీచర్లు దీనిని బైక్ రైడర్లకు బెస్ట్ ఆప్షన్‌గా నిలబెడతాయి. ధర ₹6,990.
మొత్తానికి, 2025లో ఎక్స్‌పర్ట్‌లు టెస్ట్ చేసిన ఈ డ్యాష్‌క్యామ్‌లు ఒక్కోటి ఒక్కో అవసరానికి సరిపోతాయి. రోజూ ట్రాఫిక్‌లో తిరిగేవాళ్లకు, హైవే డ్రైవింగ్ ఎక్కువగా చేసేవాళ్లకు, బైక్ రైడర్లకు.. ఇలా అందరికీ సరిపోతాయి. సరైన డ్యాష్‌క్యామ్ ఎంచుకుంటే అది కేవలం వీడియో రికార్డ్ చేయడమే కాదు, మీ భద్రతకు ఒక పెద్ద భరోసా ఇస్తుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.