Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ కోసం వెతికిన అమర్‌ అలసిపోయి ఇంట్లో వాళ్లను అడుగుతాడు. ఎవ్వరూ చూడలేదని చెప్తారు. ఇంతలో రాథోడ్‌ వచ్చి ఏమైంది సార్‌ అని అడగ్గానే.. భాగీ కనిపించడం లేదని అమర్‌ చెప్తాడు.

Continues below advertisement

మను: చంభా అది అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్లిపోయినట్టు ఉంది.

రాథోడ్‌: ఇప్పుడెలా సార్‌.. అయినా రాత్రి నేను వెళ్తుంటే.. చాలా ఎమోషనల్‌ గా మాట్లాడింది సార్‌..

Continues below advertisement

అంటూ రాత్రి తాను వెళ్లిపోతుంటే.. ఏం జరిగిందనేది చెప్తాడు రాథోడ్‌. రాథోడ్‌ బయటకు వెళ్లగానే భాగీ వెళ్లి రాథోడ్‌ను పిలుస్తుంది. దగ్గరకు వెళ్లుతుంది.

రాథోడ్‌: ఏంటి మిస్సమ్మ ఏమైనా పనుందా..?

భాగీ: రాథోడ్‌ వెళ్తున్నావా..?

రాథోడ్: అవును వెళ్తున్నాను ఎందుకు అంత స్పెషల్‌గా అడుగుతున్నావు మిస్సమ్మ

భాగీ: రేపు పొద్దున్నే వస్తావు కదా..? పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్తావు కదా..? ఆయన్ని ఆఫీసుకు తీసుకెళ్లి తీసుకొస్తావు కదా..? రేపు ఆయన పక్కనే ఉంటావు కదా..? పిల్లలకు ఏం కావాలో చూసుకుంటావు కదా..

రాథోడ్: ఏంటి మిస్సమ్మ ఎందుకు అలా కొత్తగా అడుగుతున్నావు.. ఇవన్నీ నేను రోజు చేసే పనులే కదా..?

భాగీ: రేపటి నుంచి కూడా ఈ పనులన్నీ చేయాలని చెప్తున్నాను..

రాథోడ్: భలే దానివి మిస్సమ్మ నాకేమైనా మతిమరుపు అనుకుంటున్నావా..? అయినా నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇవన్నీ నా పనులు నా బాధ్యత సరేనా..?

భాగీ: థాంక్స్‌ రాథోడ్‌ నువ్వు ఇలాగే బాధ్యతగా ఉండాలి. ఆయన్ని పిల్లలను ఇంటిని కాపాడుతూ ఉండాలి

రాథోడ్: ఏంటి మిస్సమ్మ నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా..? అదే మీ నాన్న గారి ఇంటికి ఓ నాలుగు రోజులు ఉండి వద్దామని వెళ్తున్నావా..?

భాగీ: అవును రాథోడ్‌ వెళ్లిపోవాలని అనుకుంటున్నాను

రాథోడ్: నేను ఊరికే నాలుగు రోజులు అన్నాను మిస్సమ్మ.. మీరు రెండు రోజుల్లోనే తిరిగి రండి..  మా బుజ్జి ఆరు మేడం గారిని మేము చూడకుండా ఉండలేము కదా..? ఆరు మేడం కూడా మమ్మల్ని చూడకుండా ఉండలేదు అనుకోండి.. ఏమంటారు ఆరు మేడం.. ఏమైంది మిస్సమ్మ పాప ఎందుకో ఇవాళ చాలా డల్లుగా ఉంది

భాగీ: (మనసులో) మేము వెళ్లిపోతున్నట్టు తనకు కూడా అర్థం అయినట్టు ఉంది.

రాథోడ్: ఎందుకైనా మంచిది రేపు ఒకసారి హాస్పిటల్‌కు తీసుకెళ్దాం..

భాగీ: అది నేను చూసుకుంటాను రాథోడ్‌ ఇంకో విషయం మనోహరి గురించి ఆయనకు నువ్వు కానీ నాన్న కానీ చెప్పొద్దు

రాథోడ్: అదేంటి మిస్సమ్మ అలా అంటావు.. ఆ రాక్షసి గురించి సార్‌ తో అంతా చెప్పాలి అనుకున్నాం కదా..? నువ్వు కూడా సరే అన్నావు కదా..?

భాగీ: ఇప్పుడు వద్దు అంటున్నాను రాథోడ్‌.. టైం వచ్చినప్పుడు ఆయనకు నేనే చెప్తాను. నా మాట కాదని మీరు ఆయనతో చెప్పారంటే నా మీద ఒట్టే

రాథోడ్: ఏంటి మిస్సమ్మ ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు..

భాగీ: నేను తిరిగి  వచ్చే వరకు మీరు తొందరపడొద్దు

రాథోడ్: మీరు రెండు రోజుల్లో తిరిగి వస్తా అంటున్నారు కదా ఎందుకు అప్పగింతల్లో చెప్పినట్టు చెప్తున్నారు

భాగీ: (మనసులో) లేదు రాథోడ్‌ ఏడు సంవత్సరాల వరకు నేను వెనక్కి రాను… అప్పటి వరకు అజ్ఞాతంలో ఉంటాను

రాథోడ్: మిస్సమ్మ ఈరోజు ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నావు

భాగీ: నేను చెప్పేది అంతా గుర్తు పెట్టుకో రాథోడ్‌ ఏదీ మర్చిపోకు

రాథోడ్: అయ్యో రెండు మూడు రోజులకు ఇన్ని జాగ్రత్తలు చెప్పాలా..? ఇంతకీ మీరు ఊరు వెళ్తున్నట్టు సార్‌కు చెప్పావా లేదా..?

భాగీ: లేదు చెప్పలేదు.. ( మనసులో చెప్పను కూడా)

రాథోడ్: సరే మిస్సమ్మ నాకు లేట్‌ అవుతుంది నేను వెళ్తాను

అంటూ వెళ్లిపోయిన విషయం గుర్తు చేసుకుని అంతా అమర్‌కు చెప్తాడు. దీంతో అమర్‌ ఎమోషనల్‌ అవుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!