Ayurvedic Lifestyle Tips : ఆయుర్వేదం అనేది ఓ ప్రాచీన వైద్య శాస్త్రం. మెడిసన్​తో క్యూర్​ చేయలేని ఎన్నో సమస్యలను ఆయుర్వేదం నయం చేస్తుందని చెప్తారు. అందుకే ఇప్పటికీ ఇండియాలో ఆయుర్వేదం చికిత్సకు ప్రత్యేక స్థానం ఉంది. సహజంగానే చికిత్సను అందిస్తూ అందానికి, ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు మంచి ఫలితాలు ఇస్తుంది. అలాంటి ఆయుర్వేదం చెప్తోన్న 6 ఎఫెక్టివ్ సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆయుర్వేదం ప్రకారం ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకునేవరకు మీరు కేవలం 6 సూత్రాలు ఫాలో అయితే ఆరోగ్యంతో పాటు అందానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. పైగా వీటిని చేయడానికి ఎక్కువ సమయం కూడా అవసరం ఉండదు. రోజూ మొత్తంలో మీరు 6 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. ఇంతకీ ఆ ఆరు అలవాట్లు ఏంటి? వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. 

నిద్రలేచిన వెంటనే.. 

ఉదయం నిద్ర లేచిన వెంటనే కాపర్​ గ్లాస్​లోని నీటిని తాగాలి. అయితే దీనికోసం మీరు రాత్రి పడుకునే ముందే కాపర్ గ్లాస్​లో నీరు వేసి మూత పెట్టుకోవాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే దానిలోని నీటిని తాగాలి. దీనివల్ల మెరుగైన జీర్ణక్రియ మీ సొంతమవుతుంది. అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. వాత, పిత్త, కఫ దోషాలను బ్యాలెన్స్ చేస్తుంది. ముఖ్యంగా కఫం తగ్గుతుంది. 

బ్రష్ చేసుకునేప్పుడు.. 

బ్రష్ చేసినప్పుడు అందరూ కచ్చితంగా నాలుకను శుభ్రం చేసుకుంటారు. నాలుక బద్ధతో కచ్చితంగా టంగ్ క్లీన్ చేసుకోవాలి. ఇది కాపర్​ది అయితే మరింత మంచిది. పాచి అనేది నాలుకపై నుంచి పూర్తిగా తొలగిపోయేలా సున్నితంగా క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా టేస్టీ బడ్స్ యాక్టివేట్ అవుతాయి. నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. 

నాస్య (ముక్కులో నూనె వేయడం)

ఆయుర్వేదం ప్రకారం నాస్య చేస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. 1 లేదా 2 చుక్కల నూనెను వేడి చేసి దానిని ముక్కులోని రెండు రంధ్రాల్లో వేయాలి. నువ్వుల నూనె వేస్తే మంచిది. ఇది సైనస్ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే మైండ్​ని క్లియర్​ చేస్తుంది. అలెర్జీ వంటి సమస్యలు దూరమవుతాయి. వాత సమస్యలు కంట్రోల్​లో ఉంటాయి. 

బొడ్డుకు నెయ్యి.. 

రాత్రుళ్లు పడుకునే ముందు కొన్ని చుక్కల గోరువెచ్చని నెయ్యిని లేదా ఆముదం నూనెను తీసుకుని బొడ్డుకు అప్లై చేయాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. చర్మం మృదువుగా మారుతుంది. నరాలు రిలాక్స్ అయి స్ట్రెస్​ని దూరం చేసి మంచి నిద్రను అందిస్తాయి.

వాసన చూడడం

అవును మీకు నచ్చిన హెర్బ్​ని వాసన చూస్తే చాలా మంచిదని ఆయుర్వేదం చెప్తుంది. లవంగాలు, యాలకులు, తులసి, రోజా పూలు ఇలా మీకు నచ్చిన ఏదైనా హెర్బ్.. సహజంగా దొరికే వాటిని ఎంచుకోవాలి. వాటిని ఓ సెకండ్​ పాటు డీప్​గా లోపలికి గాలి పీల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ సెన్సెస్​ అన్ని యాక్టివ్ అవుతాయట. ఇది మైండ్​కి చాలా మేలు చేస్తుంది. 

కూలింగ్ స్ప్లాష్..

చల్లని నీటిని కళ్లపై గట్టిగా విసురుకోవాలి. కళ్లు బ్లింక్ చేస్తూ.. చల్లని నీటిని కళ్లపై గట్టిగా స్ప్లాష్ చేయాలి. ఇలా 10 నుంచి 15 సార్లు చేస్తే అలసిపోయిన కళ్లుసైతం ఫ్రెష్​గా అవుతాయి. పిత్త సమస్యలను దూరమవుతాయి. స్క్రీన్ ఎక్కువగా చూసేవారు దీనిని రెగ్యులర్​గా ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.