Harmful Effects of Chicken : పిల్లల నుంచి పెద్దలవరకు చాలామంది చికెన్‌ను ఇష్టంగా తింటారు. దానిలోని పోషకాలు, ప్రోటీన్ కోసం కూడా తమ డైట్లో దీనిని చేర్చుకుంటారు. నోటికి రుచిగా ఉండే చికెన్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే దీనిని కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండేవారు తినకపోవడమే మంచిదని చెప్తున్నారు. ఇంతకీ ఆ ఆరోగ్య సమస్యలు ఏంటి? దానిని తినడం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్
శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేవారు కూడా చికెన్‌కు, ముఖ్యంగా చికెన్ స్కిన్‌కు దూరంగా ఉండాలని చెప్తున్నారు. చికెన్ స్కిన్‌లోని ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ పెంచి గుండె సమస్యలను పెంచుతాయట. కుటుంబంలో హార్ట్ సమస్యలు ఉన్నవారు కూడా దీనికి దూరంగా ఉంటే మంచిది.
కిడ్నీ సమస్యలు
చికెన్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీనిని తినడం వల్ల వాటిపై మరింత ఒత్తిడి పడుతుందట. క్రానిక్ కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవారు దీనికి దూరంగా ఉండడం లేదా లిమిటెడ్‌గా తీసుకోవడమే మంచిదని చెప్తున్నారు.
యూరిక్ యాసిడ్..
శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే అది కీళ్లను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మీరు ఇప్పటికే ఈ పరిస్థితితో ఇబ్బంది పడుతుంటే కచ్చితంగా చికెన్‌కు దూరంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే చికెన్‌లో ప్యూరిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెంచుతాయి. ముఖ్యంగా లివర్, చికెన్ స్కిన్ తింటే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఆర్థ్రరైటిస్, కీళ్ల సమస్యలు ఉన్నవారు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి దానికి దూరంగా ఉండాలంటున్నారు.
చర్మ సమస్యలు
చికెన్ తినడం వల్ల స్కిన్ సెన్సిటివిటీ ఉండేవారికి పింపుల్స్ వస్తాయి. తామర వంటి చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా బాయిలర్ చికెన్ తిన్నప్పుడు ఇవి రెట్టింపు అయ్యే అవకాశముంది. ఆర్గానికి చికెన్ ఇబ్బంది కలిగించదని చెప్తున్నారు.
అలెర్జీలు
చికెన్‌తో మీకు అలెర్జీలు, సెన్సిటివిటీ ఉంటే దానిని తినకపోవడమే మంచిదని చెప్తున్నారు. లేదంటే ర్యాష్, జీర్ణ సమస్యలు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశముందని చెప్తున్నారు.
ఇవే కాకుండా మహిళలు ఎవరైతే హార్మోనల్ సమస్యలు, PCOS సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు దీనికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. గ్యాస్ట్రిక్, జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా మానేస్తే లేదా తగ్గించి తీసుకుంటే మంచిది. లేదంటే మలబద్ధకం, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ సమస్యలు రావొచ్చు. మీరు ఎలాంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా వైద్యుల సహాయం, సలహాలు తీసుకుంటే మంచిది.