August 15 celebrations in the 90s : ఇప్పుడంటే ఇలా ఉంది కానీ.. మా రోజుల్లో అయితే అబ్బో... అనని 90's కిడ్స్ ఉండరు. ఎందుకంటే ఆరోజులు నిజంగానే అంత స్పెషల్ మరి. ఇప్పుడు ఏ స్పెషల్ డే అయినా రెడీ అవ్వడం.. ఓ సెల్ఫీ తీసుకుని దానిని సోషల్ మీడియాలో అప్​లోడ్ చేయడం. కానీ అప్పుడు మెమరబుల్ మూమెంట్స్​ అన్ని మనసులో చెరగని ముద్రగా నిలిచిపోయేవి. అలా సెలబ్రేట్ చేసుకునే మూమెంట్స్​లో ఆగస్టు 15 కూడా ఒకటి. 


కాంపిటేషన్స్..


ఆగస్టు 15 వస్తుందంటే.. ఆ సందండి ఆగస్టు మొదటి వారం నుంచే మొదలయ్యేది. స్కూల్​కి వెళ్లే స్టూడెంట్స్​కి పలు కాంపిటేషన్స్ నిర్వహించేవారు. రన్నింగ్, లాంగ్ జంప్, డ్యాన్సింగ్, సింగింగ్, జీకె, స్టోరీలు రాయడం వంటి ఎన్నో కాంపిటేషన్స్ జరిగేవి. చదువుతో పాటు.. వీటన్నింటికై కొంత సమయం కేటాయించేవారు. ఇప్పుడంటే స్కూల్స్​లో చదువు.. చదువు మాత్రమే అని అంటున్నారు కానీ.. అప్పట్లో గేమ్స్​కి ప్రత్యేక సమయం కేటాయించేవారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ఓ మూడు రోజుల ముందు కాంపిటేషన్స్ అన్ని ముగిసిపోయేవి. 


అతి పెద్ద కాంపిటేషన్ అదే


ఇవేకాకుండా ఇండిపెండెన్స్​ డే కోసం ప్రత్యేక గీతాలు నేర్పించేవారు. ఎన్​సీసీ చేసేవారు. ఇవన్నీ 15వ తారీఖున ప్రజెంట్ చేసేవారు. అయితే అసలు మజా ఎక్కడుండేది అంటే స్కూల్​ని డెకరేట్ చేసుకోవడంలో. ఒకరి క్లాస్​ రూమ్​ కంటే మా క్లాస్ రూమ్​ బాగుండాలనే అతి పెద్ద కాంపిటేషన్ జరిగేది. దానికోసం స్టూడెంట్స్ డబ్బులు కూడా కలెక్ట్ చేసుకునేవారు. ఇది స్టూడెంట్స్​ నుంచి బలవంతం చేయడం కాదు.. చిన్ననాటి నుంచే ఐక్యతగా ఉంటూ తమ క్లాస్​ రూమ్​ని అందంగా తీర్చిదిద్దుకోవడాన్ని సూచిస్తుంది.


డెకరేషన్ టాస్క్​


అలాగే డెకరేషన్​కి తెచ్చిన రిబ్బన్స్, బెలూన్స్​ని అంటించండం మరో పెద్ద టాస్క్. ఇప్పటివారు ఏదైనా అతికించాలంటే గ్లూ కోసం చూస్తారు. అప్పుడు మైదా పిండినే గ్లూగా వాడేవారు. ఆగస్టు 14 మధ్యాహ్నం నుంచి క్లాస్​లు ఏమి జరిగేవి కాదు. ఓన్లీ క్లాస్​ రూమ్​ని డెకరేట్ చేసుకోవడమే పిల్లలకు పెద్ద టాస్క్​ అయిపోయిది. ఇక్కడితో అయిపోయిందనుకోకండి. అసలు హడావుడి ఇంటికెళ్లాక మొదలవుతుంది. ఆగస్టు 15 ఉదయాన్నే లేచి రెడీ అయ్యేందుకు ముందురోజు సాయంత్రం నుంచే పిల్లలు, పెద్దలు సిద్ధమయ్యేవారు. 


ఇంట్లో హడావుడి


జెండా పండుగకి.. వేసుకువెళ్లాల్సిన యూనిఫారమ్ ఐరన్ చేసి ఉందా? షూస్ నీట్​గా ఉన్నాయా? రేపు ఉదయం త్వరగా లేవాలంటే ఈరోజు త్వరగా పడుకోవాలి.. అమ్మా అల్లారం పెట్టి నన్ను ఉదయాన్నే త్వరగా లేపు అని చెప్పి.. వెళ్లి పడుకోవడంతో ఆ రోజు ముగిసేది. ఉదయం లేచిన తర్వాత తలస్నానం చేసి.. యూనిఫామ్ వేసుకుని.. అందంగా రెడీ అయ్యి.. దాదాపు 7 గంటలకు వెళ్లి.. అన్ని క్లాస్​రూమ్స్​ తిరిగేసేవారు. దాని తర్వాత అందరూ ఫ్లాగ్ కార్డ్స్​ని తమ జేబుకి పిన్స్​తో పెట్టుకునేవారు. అప్పుడు అసలైన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యేవి.



అలా ముగిసేది..


ఇప్పుడంటే ఇండోర్​లో ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కానీ.. అప్పట్లో ప్రతి స్కూల్​కి గ్రౌండ్ ఉండేది. గ్రౌండ్​లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఎండలో.. ప్రిన్సిపల్, టీచర్స్, ముఖ్య అతిథుల స్పీచ్​లు విని.. ఫ్రెండ్స్​పై కామెంట్స్​ చేసుకుంటూ జెండా పండుగను చేసుకునేవారు. అతి ప్రధానంగా.. ఆరోజు స్కూల్​లో పంచే లడ్డూ, మిక్చర్​, చాక్లెట్ల కోసం విద్యార్థులందరూ ఎదురు చూసేవారు. ఆ ప్యాకెట్స్​ తీసుకుని ఇంటికి వెళ్లేసరికి.. టీవిలో దేశ భక్తి సినిమాలు వేసేవారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జై, ఖడ్గం, దిల్​ సే. ఈ సినిమాలు లేకుండా ఆగస్టు 15 కానీ, జనవరి 26 కానీ వెళ్లేది కాదు. ఈ సినిమాలను ఫ్యామిలీ అంతా కలిసి చూసి.. హాయిగా రోజుని గడిపేవారు. ఇవన్నీ ప్రతి 90's కిడ్స్ లైఫ్​లో కాస్త అటుగానో ఇటుగానో జరిగేవి. కానీ ఎమోషన్స్​ మాత్రం అంతా ఒక్కటే. 

Also Read : స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు 2024.. వాట్సాప్, ఫేస్​బుక్​, ఇన్​స్టాలో షేర్ చేసుకునేందుకు బెస్ట్ కోట్స్ ఇవే