వంటింట్లో కొన్ని రకాల పనులు నిత్యం చేస్తుంటారు. అందుకే వాటిని వంటింటి అలవాట్లు అంటాం. కొన్నిరకాల వంటింటి అలవాట్లు మాత్రం దీర్ఘకాలంగా అనుసరించడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది. చాలా మందికి రుబ్బు లేదా పిండి కలిపాక ఉప్పు సరిపోయిందో లేదో చూడటానికి కాస్త రుచి చూస్తారు. ఇది వారంతో చాలా సార్లు జరిగే ప్రక్రియ. కానీ ఆ పచ్చి రుబ్బు లేదా పిండిని తినడం మంచిది కాదంటున్నారు ఆరోగ్యనిపుణులు. దానివల్ల సాల్మోనెల్లా అనే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందట. అంతేకాదు మాంసాహారం, కూరగాయలు కోసేందుకు వేర్చేరు చాపింగ్ బోర్డులు కూడా ఉపయోగించాలి. కానీ చాలా మంది అదే బోర్డు మీద కోస్తారు. దీనివల్ల మాంసాహారం దానికి అతుక్కుని ఉండిపోతుంది. అక్కడ వైరస్ లు, బ్యాక్టిరియాలు చేసే చేరుతాయి. అవన్నీ సూక్ష్మ రూపంలోనే ఉంటాయి కాబట్టి మన కళ్లు కూడా గుర్తించలేవు. కూరగాయలు కోశాక వాటికి అతుక్కుని మన పొట్టలోకే చేరుతాయి. కాబట్టి మాంసాహారం, శాకాహారం రెండింటికి వేర్చేరే చాపింగ్ బోర్డులు చాలా అవసరం. ఇంకా ఇలాంటి అలవట్లు కొన్ని ఉన్నాయి.
ఒకే స్పాంజి వాడడం
నెలల తరబడి గిన్నెలు తోమడానికి ఒకే స్పాంజిని ఉపయోగిస్తారు చాలామంది. చాలా గిన్నెలు తోమాక ఆ స్పాంజికి బ్యాక్టిరియా, హానికరమైన జెర్మ్ లు అతుక్కుంటాయి. కాబట్టి రోజుల తరబడి వాటిని వాడడం మంచికాదు. రెండు వారాలు లేదా మూడు వారాలకోసారి మార్చడం ఉత్తమం.
కిచెన్ ప్లాట్‌ఫారాన్ని వాడడంకిచెన్ కౌంటర్ పై చపాతీలు ఒత్తడం, కూరగాయలు కోయడం వంటివి చేస్తుంటారు. అది మంచి పద్ధతి కాదు. అక్కడ ఓసారి వస్త్రంతో తుడిచేసి ఈ పనులు చేస్తుంటారు. కానీ సూక్ష్మక్రిములు కంటికి కనిపించనంత చిన్నవి. అక్కడ చపాతీలు ఒత్తడం వంటివి చేయడం వల్ల ఆ క్రిములు వాటితో పాటూ మన నోట్లోకే చేరుతాయి. కాబట్టి ఈ పనులు మానివేయడం ఉత్తమం.
జూట్ బ్యాగులు శుభ్రం లేక
చాలా మంది పర్యావరణ హానికలిగించే ప్లాస్టిక్ బ్యాగులను వదిలేసి, జూట్ బ్యాగులు, పేపర్ బ్యాగులు వాడడం మొదలుపెట్టారు. ఇది మంచి పద్దతే. కానీ జూట్ బ్యాగులు కొన్ని రోజులు వాడాక సూక్ష్మక్రిములు ఆవాసంగా మారుతాయి. కానీ వాటిని నెలల తరబడి ఎవరూ ఉతకరు. అలానే వాడుతున్నారు. కూరగాయలు తెచ్చేందుకు వీటినే ఉపయోగిస్తున్నారు. కాబట్టి వాటిని వారానికోసారైనా శుభ్రం చేయడం అవసరం.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.