శరీరం అందంగా కనిపించాలన్న మంచి ఆకృతిలో ఉండాలన్న చాలా ముఖ్యమైన ప్రోటీన్ కొల్లాజెన్. శరీరానికి కావలసినంత కొల్లాజెన్ అందితే చర్మం మెరిసిపోతుంది. ఇది జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది. ఇది కనుక తగ్గితే చర్మం సాగిపోవడం, ముడుచుకు పోయినట్టు ఉండటం, నిర్జీవంగా కనిపిస్తుంది. వయస్సు మీద పడుతున్న కొద్ది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. చర్మమే కాదు జుట్టు కూడా రాలిపోతుంది, వెంట్రుకలు సన్నగా మారిపోవడం జరుగుతుంది. అందుకే చాలా మంది కొల్లాజెన్ సప్లిమెంట్స్ కోసం క్యాప్సిల్స్ వాడుతూ ఉంటారు. మందుల ద్వారా కొల్లాజెన్ పెంచుకోవడం కంటే నేచురల్ గా ఫుడ్ తీసుకుని దాని ఉత్పత్తి చేసుకోవడం మంచిదని అంటున్నారు పోషకాహార నిపుణులు. మాంసాహారంలో కొల్లాజెన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మటన్, చికెన్, కోడి గుడ్లు వంటి ఆహారాన్ని డైట్లో భాగం చేసుకోవాలి. కానీ కొంతమంది పరిశోధకులు మాంసాహారం కంటే శాఖాహారంలోనే కొల్లాజెన్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. 


విటమిన్ సి, ప్రోటీన్ రిచ్ ఫుడ్, కాలానుగుణంగా వచ్చే పండ్లు తినడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి కూరగాయలు తినే అలవాటు ఉంటే చాలా మంచిది. వాటి నుంచి కొల్లాజెన్ ఉత్పత్తి బాగా ఉంటుంది. మరి ముఖ్యంగా పుట్టగొడుగుల నుంచి ఈ ప్రోటీన్ ఎక్కువగా వస్తుంది. శరీరానికి సరిపడినంత కొల్లాజెన్ అందితే చర్మం కాంతివంతంగా ఉండటమే కాక కీళ్ళు, కండరాలు, ఎముకలు ధృడంగా మారేలా చేస్తుంది. వీటితో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ గా వచ్చే అలర్జీలను తగ్గించడం, ఆందోళనను తగ్గించడం, నిద్ర బాగా పట్టేలా చెయ్యడంటో పాటు వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా చూస్తుంది.  మార్కెట్లో కొల్లాజెన్ పౌడర్, క్యాప్సూల్స్, లిక్విడ్ రూపంలో లభిస్తుంది. బీన్స్, కోడి గుడ్లు, చేపలు, చికెన్ స్కిన్ వంటి పదార్థాలలో కొల్లాజెన్ అధికంగా లభిస్తుంది. 


కొల్లాజెన్ సప్లిమెంట్స్ ని ఇతర సప్లిమెంట్స్ తో కలిపి వేసుకోవడం వల్ల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల స్కిన్ అలర్జీలు, జుట్టు రాలే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొల్లాజిన్ సప్లిమెంట్స్ కాకుండా మీరు ఇతర వ్యాధులకి మందులు వేసుకుంటున్నట్టయితే వైద్యులని సంప్రదించి వాడుకోవడం మంచిది. ఎందుకంటే కొల్లాజెన్ సప్లిమెంట్స్, విటమిన్, మినరల్స్ కోసం కలిపి మందులు వాడుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. మద్యపానం, ధూమపానం వంటివి చెయ్యడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందుకే వాటికి దూరంగా ఉండటం మంచిది. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: పిల్లల విషయంలో మీరు ఈ తప్పులు చేస్తున్నారా? అలా చేస్తే మీరు చాలా నష్టపోతారు


Also Read: ‘పొమాటో’ మొక్కకు కాసిన ‘బ్రిమాటో’ కూరగాయ ఇదిగో, వండుకుని తింటే ఆ రుచే వేరు