వంకాయ మొక్కకు వంకాయే కాస్తుంది, టమాటో మొక్కకు టమాటోనే కాస్తుంది. ఈ రకం సాగు అందరికీ తెలిసిందే. వ్యవసాయ శాస్త్రవేత్తలు రోజురోజుకు కొత్త వంగడాలను సృష్టించే పనిలో ఉన్నారు. జన్యు ఇంజినీరింగ్ నుంచి గ్రాఫ్టింగ్, హైడ్రోపోనిక్ టెక్నాలజీ వరకు వ్యవసాయ పరిశ్రమ చాలా వేగంగా ఎదుగుతోంది. కొత్త పద్దతులలో కొత్త కూరగాయలు పండించే ప్రక్రియ ఎప్పట్నించో సాగుతోంది.  అలా పండించిన కొత్త కూరగాయలే పొమాటో, బ్రిమాటో. ఈ రెండూ త్వరలో మనం తినే అవకాశం కూడా ఉంది. 


ఏంటి పొమాటో...
బంగాళాదుంప (పొటాటో), టమాటో కలిపి పొమాటో అనే కొత్త కూరగాయను పండించారు. దీన్ని గ్రాఫ్టింగ్ పద్ధతిని ఉపయోగించి పెంచారు. వాస్తవానికి ఈ సాంకేతికత 1977వ సంవత్సరంలో జర్మనీలోనే అభివృద్ధి చేశారు. ఇలా రెండు లేదా మూడు కూరగాయలను కలిపి పండించవచ్చు. ఈ సాంకేతికతను వారాణాసిలో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ కూడా స్థానికంగా అభివృద్ధి చేసింది. దాని సాయంతో రెండు కూరగాయలను కలిపి సంకర జాతి కూరగాయలను పండించడం మొదలుపెట్టారు.  గతేడాదే ఈ పొమాటోను పండించారు. 


బ్రిమాటో...
పొమాటోను పండించాక మరో కూరగాయను కూడా చేర్చి కొత్త కూరగాయను పండించేందుకు ప్రయత్నించారు. అలా పుట్టుకొచ్చిందే ‘బ్రిమాటో’. పొమాటో మొక్కకే గ్రాఫింగ్ పద్ధతిలో ఈ బ్రిమాటో పెరిగేలా చేశారు. ఇందులో నల్ల వంకాయను ఉపయోగించారు. వంకాయను ఆంగ్లంలో బ్రింజాల్ అంటారు కాబట్టి ఈ కొత్త కూరగాయకి బ్రిమాటో అని నామకరణం చేశారు. దీన్ని తిట్టే ఈ మూడు కూరగాయలు కలిపి తిన్న రుచి వస్తుంది. కొన్నిసార్లు ఒకేమొక్కకు టమోటాలు, బంగాళాదుంపలు కూడా కాస్తాయి. అదే బ్రిమాటో మొక్కకైతే వంకాయల ఆకారం టమోటాల్లా కనిపిస్తుంది. ఒక్కో మొక్క రెండు కిలోల టమోటాలు, 600 గ్రాముల బంగాళాదుంపలను ఇస్తాయి. 


గ్రాఫ్టింగ్ సులువే...
గ్రాఫ్టింగ్ పద్ధతిని ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. చాలా సులువుగా ఉంటుంది. కాకపోతే ఎంచుకున్న కూరగాయలు రెండూ ఒకే కుటుంబానికి చెందినవై ఉండాలి. బంగాళాదుంపలు, టమోటాలు మొక్కలు ‘సోలనేసి’ అనే మొక్కల కుటుంబానికి చెందినవి. రెండు మొక్కల కాండాలు గ్రాఫ్టింగ్ పద్ధతిలో కోత కోసి, రెండింటినీ జతచేసి పెంచాలి. ఒకదానికొకకటి పోషణను ఇచ్చిపుచ్చుకుంటాయి. అలాగే గుణాలను పంచుకుంటాయి. అందుకే ఒకే మొక్కకుల టమోటాలు, బంగాళాదుంపలు, వంకాయలు కాసినా, వాటి ఆకారాలు, రంగులు ఒక్కోసారి మారుతూ ఉంటాయి. అంటే టమోటా ఆకారంలో వంకాయ, వంకాయ రంగులో బంగాళాదుంప పండే అవకాశం ఉంది. 


Also read: Vasthu Tips: భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువవుతున్నాయా? అయితే ఇంట్లో ఈ మార్పు చేయండి


Also read: ప్రపంచంపై దాడికి సిద్ధంగా ఉన్న మరో వైరస్ మహమ్మారి ‘మార్బర్గ్’, ఇది కూడా ఎబోలా లాంటిదే, ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే