Home Tips: ఇంట్లో బొద్దింకలు, పురుగులు వేధిస్తున్నాయా? ఇలా చేయండి దెబ్బకి పారిపోతాయి

ఇంట్లో ఏ పురుగు పుట్రా చేరకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే

Continues below advertisement

ప్రతి ఇంటి ఇల్లాలి ఎదుర్కొనే సమస్య ఇదే. ఇంట్లో చిన్న బొద్దింకలు, సాలీళ్లు, పురుగులు చేరుతూ ఉంటాయి. ఒకసారి తరిమినా మళ్లీమళ్లీ వస్తూనే ఉంటాయి. బొద్దింకల గురించైతే చెప్పక్కర్లేదు. ఒక్కటి చేరిందా వందల కొద్దీ పుట్టుకొస్తాయి. ఏదైనా మూల దొరికితే చాలు సాలీడు గూడు కట్టేస్తుంది. ఇలాంటి పురుగుల వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులూ అధికమవుతాయి. వీటిని బయటికి పంపాలంటే కొన్ని చిట్కాలు ఇవిగో..

Continues below advertisement

1. నీళ్లల్లో నిమ్మరసం కలిసి తరచూ ఇంట్లో బొద్దింకలు, సాలీడు తిరిగే ప్రదేశాలలో చల్లుతూ ఉండండి. వాటికి ఆ వాసన నచ్చదు. 
2. వెనిగర్ ను నీళ్లలో కలిపి స్ప్రే చేసినా కూడా సాలె పురుగులు పారిపోతాయి. 
3. పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి, నీళ్లలో కలిపి రసంలా చేయాలి. ఆ రసాన్ని బాటిల్ వేసి ఇంట్లో పురుగులు చేరే చోట చల్లతూ ఉండాలి. 
4. సాలెపురుగుల కన్నా బొద్దింకలతోనే అధిక సమస్య. ఎన్నోరోగాలకు కూడా కారణం అవుతాయి. కిచెన్ ప్లాట్ ఫామ్ మీద ఇవి అధికంగా తిరగుతూ ఉంటాయి. కాబట్టి ఒక వస్త్రంలో కిరోసిన్ ముంచి ఆ ప్లాట్ ఫామ్ ను తుడవండి ఆ వాసన ఉన్నంత కాలం అటువైపు ఒక్క బొద్దింక కూడా రాదు. 
5. లవంగాల వాసన బొద్దింకలకు అలెర్జీ. వాటిని అల్మారాల్లో, ఇంటి మూలల్లో, ర్యాక్‌లలో ఉంచితే మంచిది. ఆహారం కోసం అవి తిరిగే ప్రదేశాల్లో వీటిని ఉంచాలి. అలా చేయడం వల్ల ఆహారం దొరక్క బొద్దింకలు బయటికి వెళ్లిపోతాయి. 
6.బోరిక్ పొడి కూడా బొద్దింకలపై బాగా పనిచేస్తుంది. ఆ పొడిని బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో చల్లితే ఆ వాసనకు ఇంట్లోంచి వెళ్లిపోతాయి. 
7. చక్కెర, బోరిక్ యాసిడ్ కలిపి మిశ్రమంలా చేయాలి. వాటిని బొద్దింకలు తిరిగే చోట చల్లాలి. ఇలా చేసినా బొద్దింకల బెడద వదిలించుకోవచ్చు. 

తరచూ ఇంటిని శుభ్రం చేసుకోవడం అత్యవసరం. లేకుండా పురుగుల బెడద మరింత పెరుగుతుంది. ముఖ్యంగా వంటింట్లోనే ఈ పురుగులు అధికంగా చేరుతాయి. కాబట్టి దాన్ని తరచూ క్లీన్ చేసుకోవాలి. పైన చెప్పిన పద్ధతుల్లో పురుగులను సులభంగా బయటికి పంపించవచ్చు. 

Also read: వాటిని రోజుకు గుప్పెడు తింటే చాలు చర్మం మెరవడం ఖాయం, బ్యూటీ పార్లర్ అవసరమే లేదు

Also read: తలనొప్పిని తక్కువగా తీసుకోవద్దు, అది ఆ భయంకరమైన వ్యాధి సంకేతం కావచ్చు

Also read: మనం చనిపోయే ముందు మెదడులో ఏం జరుగుతుంది? తెలుసుకునేందుకు బ్రెయిన్‌ను మ్యాప్ చేసిన శాస్త్రవేత్తలు

Continues below advertisement