Healthy Braekfast for Kids : చాలామంది తల్లులకు ఉండే కంప్లైంట్ ఏంటంటే.. మా పిల్లాడికి ఏది పెడుతున్నా తినట్లేదు అని. అయితే మీకు అలాంటి చిచ్చుర పిడుగులే ఉంటే మీరు ఈ రెసిపీ కచ్చితంగా ట్రై చేయండి. మీరు వారితో మంచి పోషకాలతో నిండిన ఫుడ్ ఇచ్చిన వారు అవుతారు. అంజీర్, బాదం ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే అయినా.. పిల్లలు వాటిని నేరుగా తినడానికి ఇష్టపడరు. మరికొందరు కిడ్స్ పాలు తాగడానికి ఇష్టపడరు. అలాంటి వారికోసం మీరు అంజీర్ బాద్ మిల్క్ షేక్ రెడీ చేయవచ్చు. 


ఈ మిల్క్​ షేక్ ఆరోగ్యానికి చాలా మంచిది. పోషకాలతో నిండిన ఈ మిల్క్​షేక్ వారికి మంచి రుచిని అందించడమే కాకుండా.. మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. చలికాలంలో వారికి మంచి ఇమ్యూనిటీని అందిస్తుంది. రోజంతా వరు చురుగ్గా ఉండేలా చేయడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. అయితే ఇది కేవలం చిన్నపిల్లలకే కాదు. పెద్దవారు కూడా ఉదయాన్నే దీని తాగి.. హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు


అంజీర్ - 2 కప్పులు


బాదం పప్పులు - 10


అరటిపండు - 1


పాలు - 2 కప్పులు


తేనె - రుచికి తగినంత


తయారీ విధానం


ముందుగా అంజీర్​ తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అరటి పండును కూడా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లెండర్​ తీసుకుని దానిలో అంజీర్, బాదం, అరటిపండ్లు వేసి బాగా బ్లెండ్ చేయాలి. దానిలో తేనే వెసి మరో బాగా మెత్తాగా అయ్యేలా బ్లెండ్ చేయాలి. మనం చేసుకునేది మిల్క్​ షేక్​గా కాబట్టి దానిలో పాలు వేసి అంజీర్, అరటిపండు, బాదం ముక్కలుగా లేకుండా బాగా మెత్తగా క్రీమీ రూపం వచ్చేవరకు బ్లెండ్ చేయాలి. దీనిని ఓ గ్లాస్​లోకి తీసుకుని.. డ్రై ఫ్రూట్స్​తో గార్నిష్ చేయవచ్చు. అంతే హెల్తీ, టేస్టీ అంజీర్ బాదం మిల్క్ షేక్ రెడీ. దీనిని తయారు చేయడం చాలా సులభం. దీనిని హాయిగా లాగించేయవచ్చు.


ఉదయాన్నే జిమ్ లేదా ఆఫీస్​కి వెళ్లేవారికి కూడా ఇది చాలా మంచి ఎంపిక. ఇది మీరు రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. పెద్దల్లో కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. పిల్లలకు కూడా బాదం, అంజీర్ చాలా మంచివి. ఇవి వారిలో జ్ఞాపకశక్తిని పెంచుతాయి. దీనిని కేవలం మార్నింగ్​ డ్రింక్​గానే కాదు.. డిన్నర్​లో స్వీట్​ డిజెర్ట్​గా కూడా తీసుకోవచ్చు. ఈ మిల్క్​ షేక్​పై ఇంట్లో ఉండే ఐస్​క్రీమ్ స్కూప్ ఒకటి వేయండి. అంతే మీరు చక్కటి డిజెర్ట్​ను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలికీ అందించవచ్చు. 


Also Read : మీకు మధుమేహముంటే.. మీ డైట్​లో వీటిని కచ్చితంగా తీసుకోండి









గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.