Healthy Diet : మధుమేహమున్నవారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే.. అది ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది. అయితే కొన్ని ఫుడ్స్​ని వండుకోకుండా కూడా తన డైట్​లో చేర్చుకోవచ్చు. అవి మీకు రుచిని పెంచడంతో పాటు.. పోషక విలువలను పెంచుతాయి. వీటిని వండుకునే కాకుండా మీరు నేరుగా కూడా తీసుకోవచ్చు. అయితే ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే.. ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఆలివ్ ఆయిల్


మధుమేహమున్నవారు తమ డైట్​లో ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండిన ఆహారం తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్​లో మొక్కల ఆధారిత కొవ్వు ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన.. మోనోఅన్​శాచురేటెడ్ కొవ్వులతో నిండి ఉంటుంది. అయితే దీనిలో ఎక్స్​ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తక్కువ ప్రాసెస్ రకం. దీనిలో గుండెకు మేలు చేసే కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని వంటల్లో కాకుండా సలాడ్స్​లో కలిపి తీసుకుంటే మరింత మంచిది. ఎందుకంటే వేడి చేయడం వల్ల దానిలోని లక్షణాలు కోల్పోయే ప్రమాదముంది. 


ఆకు కూరలు 


విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లకు ఆకుకూరలు పవర్​హౌస్​లాంటివి. ఇవి చాలావరకు మధుమేహం ఉన్నవారికి అనుకూలంగా ఉంటాయి. వీటిని సరిగ్గా ఉడికించి.. సరైన క్వాంటిటీలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నోప్రయోజనాలు చేకూరుతాయి. బచ్చలికూర, క్యాబేజీ, బ్రోకలీ, పాలకూర వంటి వాటిని వండనవసరంలేకుండా సలాడ్స్​లో కలిపి నేరుగా తీసుకోవచ్చు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి.. ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూర్చుతాయి. 


పనీర్


వెజ్ అయినా నాన్ వెజ్ అయినా.. ప్రోటీన్ కోసం పనీర్ తీసుకోవచ్చు. పైగా అధిక ప్రోటీన్ కలిగిన ఫుడ్స్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు గొప్పగా హెల్ప్ చేస్తాయి. ఆకలిని కంట్రోల్​లో ఉంచుతాయి.పైగా దీనిని కూడా తినాలంటే వండాల్సిన, ఉడికించాల్సిన అవసరం లేదు. వీటిని కూడా సలాడ్స్​లో కలిపి తీసుకోవచ్చు. ఇది మీ సలాడ్​కి మంచి ఫ్రెష్​నెస్ ఇస్తుంది. అయితే మీ శరీరానికి ఏ పనీర్ సరిపోతుందో.. అనేది వైద్యులు, ఆహార నిపుణుల సలహా మేరకు ఎంచుకోండి. 


బీన్స్, మొలకలు


స్ట్రౌట్స్ కూడా మీ శరీరానికి మంచి ప్రోటీన్​ అందిస్తాయి. వాటిలో ఫైబర్​ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కరె స్థాయిలను అదుపులో ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు తీసుకునే ఫుడ్స్​లో మొలకలు, బీన్స్ కలిపి తీసుకోవచ్చు. లేదంటే మీ రోజును స్ప్రౌట్స్​తో స్టార్ట్ చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. సలాడ్స్​లో కలిపి తీసుకుంటే పోషక విలువలు కూడా పెరుగుతాయి. కొందరు పాలతో చేసిన ఉత్పత్తులు తీసుకోరు. అలాంటి వారు పనీర్​కి బదులుగా వీటిని తీసుకోవచ్చు. 


నట్స్.. 


బాదం, వాల్​నట్స్, పల్లీలు, నువ్వులు, గుమ్మడిగింజలు వంటి నట్స్​ను మీ డైట్​లో కలిపి తీసుకోవచ్చు. ఇవి పూర్తిగా శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలతో సమృద్ధిగా నిండి ఉంటాయి. కాబట్టి వీటిని సలాడ్స్​గా లేదా సాయంత్రం స్నాక్​గా కూడా తీసుకోవచ్చు. పైగా మీకు కాస్త క్రంచీ ఫీలింగ్​ని ఇస్తాయి. కాబట్టి వీటిని రెగ్యూలర్​గా మీ డైట్​లో చేర్చుకోవచ్చు. 


పైన చెప్పిన అన్ని ఫుడ్స్ మధుమేహమున్నవారికే కాదు.. ఆరోగ్యప్రయోజనాల కోసం ఎవరైనా తీసుకోవచ్చు. అయితే వీటిని మోతాదుకు మించి కాకుండా.. లిమిట్​గా తీసుకుంటే మంచి ప్రయోజనాలు అందుతాయి. వీటిని వండుకునే తినాల్సిన అవసరం లేదు కాబట్టి.. వాటిని మీ సలాడ్స్​లోకి తీసుకోవచ్చు. 


Also Read : పిల్లల్లో స్పైనల్ స్ట్రోక్ వస్తుందా? ఇది కూడా బ్రెయిన్ స్ట్రోక్​లాంటిదేనా?








గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.