కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టి ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఓ కొత్త వైరల్ జ్వరం ఉనికిని వైద్యులు నిర్ధారించారు. సాధారణంగా ఆ వైరల్ ఫీవర్ జంతువుల్లో మాత్రమే కనిపించేది. ఇప్పుడది మనుషులకు సోకుతుంది. ఇది ప్రాణాంతకం కాకపోయినా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఈ వైరల్ ఫీవర్ పేరు ‘రిఫ్ట్ వ్యాలీ ఫీవర్’. ఇది అంటువ్యాధి కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫీవర్ పశువులు, మేకలు, ఒంటెలు ఇలాంటి జంతువుల్లో కనిపిస్తుంది.
ఏంటీ జ్వరం?
రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ వైరస్ వల్ల కలుగుతుంది. ఈ వైరస్ జంతువుల్లోనే కనిపిస్తుంది. దోమలు ఆ జంతువులపై వాలి తిరిగి మనుషులపై వాలినప్పుడు వ్యాప్తి చెందుతుంది. RCF అని పిలిచే వైరస్ వల్ల ఈ జ్వరం వస్తుంది. ఇది జంతువు రక్తంలో ఉంటుంది. ఆ రక్తాన్ని దోమలు పీల్చి వైరస్ వ్యాప్తి చెందేలా చేస్తుంది. అంతేకాదు ఆ వైరస్ కు గురైన కోళ్లు, గొర్రె, మేక మాంసాన్ని తిన్నప్పుడు కూడా దాని బారిన పడే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఇంకా ఎన్ని రకాలుగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఆఫ్రికాలో అధికంగా ఈ జ్వరం కనిపిస్తుంది. ఈ జ్వరం కారణంగా సంభవించే మరణాలు తక్కువే. వచ్చాక వారం రోజుల పాటూ లక్షణాలు కొనసాగుతాయి. ప్రత్యేకంగా ఈ జ్వరానికి మందుల్లేవు. ఈ వైరల్ ఫీవర్ సోకిన వారిలో చాలా మంది ఇంటి దగ్గరే కోలుకుంటారు. మరీ తీవ్రంగా మారితే ఒకరో ఇద్దరో ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. రక్త పరీక్ష ద్వారానే ఈ జ్వరం వచ్చిందో లేదో పరీక్షిస్తారు.
లక్షణాలు ఎలా ఉంటాయి?
రిఫ్ట్ వ్యాలీ వైరస్ శరీరంలో చేరాక లక్షణాలు రెండు నుంచి ఆరు రోజుల్లోపు బయటపడతాయి. వైరస్ మొదట్లో సాధారణ లక్షణాలను చూపిస్తుంది.
1. మైకంగా ఉండడం
2. నడుము నొప్పి
3. కండరాలు నొప్పి పెట్టడం
4. జ్వరం
5. నీరసం
పైన చెప్పిన లక్షణాలు మాత్రమే మొదట బయటపడతాయి. పరిస్థితి ముదిరితే మాత్రం కింద చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి.
1. చూపు మసకబారడం
2. మలంలో రక్తం కనిపించడం
3. ముక్కు నుంచి రక్తం కారడం
4. రక్తపు వాంతులు
5. మెదడులో వాపు రావడం
6. జ్వరం
జ్వరం వస్తే తేలికగా తీసుకోవద్దు. పైన లక్షణాలు ఏమాత్రం కనిపించినా వైద్యుడిని సంప్రదించాలి.
Also read: నిమ్మకాయ ధర పెరిగిందిగా, దాని బదులు ఇవి తినండి, ఎంతో ఆరోగ్యం కూడా
Also read: గర్భం ధరించకుండా వేయించుకునే లూప్ ఎంత కాలం తరువాత మార్చాలి?