Paracetamol Warnings and Precautions : దాదాపు ప్రతి ఇంట్లో పారాసెట​మాల్​ అనేది ఉంటుంది. శరీరంలో చిన్న మార్పు వచ్చినా ముందుగా అడుగు వెళ్లేది పారాసెటమాల్​ వైపే. అంతటి మార్క్ సెట్​ చేసింది పారాసెటమాల్. సగటు వ్యక్తి సంవత్సరానికి సుమారు 70 పారాసెటమాల్ మాత్రలను తీసుకుంటారని అంచనా. పైగా దీని ధర కూడా అందరికీ అందుబాటులో ఉండడంతో దీనికి విపరీతమైన వినియోగం ఉంది. అయితే ఈ పారాసెటమాల్​తో ఆరోగ్యం బాగుపడినా.. కానీ గుండెకు సమస్యలు వస్తాయంటోంది తాజా అధ్యయనం. తక్కువ మోతాదులో కుడా పారాసెటమాల్​ని రెగ్యూలర్​గా తీసుకుంటే.. గుండెకు హాని కలుగుతుందంటున్నారు శాస్త్రవేత్తలు.


ఏడు రోజులు ట్రయల్ చేశారట..


డేవిస్​లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పారసెటమాల్​పై ఓ అధ్యయనం చేశారు. సురక్షితమైనదిగా పరిగణించే పారసెటమాల్​ (ఎసిటమైనోఫెన్​)ను క్రమంగా తీసుకోవడం వల్ల గుండె లోపల అనేక సిగ్నలింగ్​ మార్గాలను మార్చడానికి కారణమవుతుందని వారు ఈ అధ్యయనంలో కనుగొన్నారు. ఈ పరిశోధనలో భాగంగా ఎలుకలపై ఈ పారాసెటమాల్​ను ప్రయోగించగా.. వాటి గుండె కణజాలంలో ప్రోటీన్లు మారినట్లు పరిశోధకులు కనుగొన్నారు. దీనిలో పారాసెటమాల్​ ఇచ్చిన ఎలుకలపై ఏడు రోజులు ట్రయల్ చేసిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించినట్లు వారు తెలిపారు. 


సిగ్నలింగ్​పై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది..


గుండె సిగ్నలింగ్ మార్గాలపై పారాసెటమాల్​ ప్రభావం చూపించడంపై శాస్త్రవేత్తలు షాకింగ్ విషయాన్ని తెలిపారు. పారాసెటమాల్ రెండు లేదా మూడు మార్గాలపై ప్రభావం చూపిస్తుందనుకున్నామని.. కానీ 20కి పైగా విభిన్న సిగ్నలింగ్ మార్గాలను ప్రభావితం చేయడం తమని షాకింగ్​కి గురించేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ సమయంలో ఎసిటమైనోఫెన్​ను తక్కువ మోతాదులోనే తీసుకున్నామని వెల్లడించారు. ఈ విషయాన్ని కాలిఫోర్నియాలోని లాంగ్​ బీచ్​లో జరిగిన అమెరికన్ ఫిజియాలజీ సమ్మిట్​లో దీనిని ప్రదర్శించారు. 



రోజుకు ఎన్ని మెడిసన్స్ తీసుకోవచ్చంటే..


పారాసెటమాల్ వినియోగం దీర్ఘకాలికంగా అధిక మోతాదులో వినియోగిస్తే ఆక్సీకరణ ఒత్తిడి లేదా టాక్సిన్స్ ఏర్పడి... గుండె సమస్యలను తీవ్రం చేస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 500mg టాబ్లెట్స్​ను పెద్దలు 24 గంటల్లో నాలుగు సార్లు తీసుకోవచ్చని.. మోతాదుల మధ్య కనీసం 4 గంటలు గ్యాప్ ఉండాలని సూచిస్తున్నారు. రోజులో 8 కంటే ఎక్కువ మాత్రలు తీసుకోవద్దని కూడా చెప్తున్నారు. 


పారాసెటమాల్ మాత్రలు, క్యాప్సూల్స్, సిరప్, పౌడర్​ వంటి వివిధ రూపాల్లో అందుబాటులో ఉంటుంది. ఒక టాబ్లెట్ 500mg లేదా 1g వస్తుంటే.. సిరప్​ 120mg, 250mg, 500mg, 5mlలో అందుబాటులో ఉంటుంది. మీరు సిరప్ లేదా పౌడర్ రూపంలో దీనిని తీసుకుంటే.. ఎంత మోతాదులో దీనిని తీసుకోవాలనే విషయంలో కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి. మీ బరువు 50 కేజీల కంటే తక్కువ అయితే వైద్యుల సూచనల మేరకు మాత్రమే మాత్రలు తీసుకోవాలి. ముఖ్యంగా గరిష్ట మోతాదును అడిగి తెలుసుకోవాలి. 


Also Read : ప్రెగ్నెన్సీ సమయంలో పిల్లిని తిన్న తల్లి.. నక్క​ పోలికలతో జన్మించిన పిల్లాడు, పిల్లే దీనికి కారణమా?









గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.