Women's Tears Power : మా అమ్మ ఏడిస్తే చూడలేను.. మా సిస్టర్​ని ఏడిపించడం ఇష్టం కానీ.. తను నిజంగా ఏడిస్తే మాత్రం అస్సలు తట్టుకోలేను. మా ఆవిడైతే.. ఏడుపుతోనే అన్ని సాధించుకుంటాదని మగవారు పలు స్టేట్​మెంట్స్ చేస్తారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే.. అమ్మాయిల ఏడుపును చూసి వారిలో కలిగే జాలి, దయ, ప్రేమ వల్ల ఇలా కంట్రోల్​లో ఉంటున్నామనుకుంటారు. కానీ వారి కోపాన్ని కంట్రోల్​ చేసే పవర్ అమ్మాయిల కన్నీళ్లకు ఉందని వారికి తెలియదు.


పవర్ అంతా కన్నీళ్లదే..


అమ్మాయిల కన్నీళ్లకే అబ్బాయిలను కంట్రోల్ చేసే పవర్ ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. వారిని కేవలం చూసినందుకే కాకుండా.. కన్నీటి స్మెల్​ వారిపై ప్రభావం చూపిస్తుందట. మహిళల కన్నీళ్లోని రసాయనాలు పురుషులలోని దూకుడును తగ్గిస్తాయని పేర్కొంది. సైకలాజికల్ గేమ్, మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ వల్ల అమ్మాయిల కన్నీళ్ల వాసనకు.. అబ్బాయిల మెదడు రియాక్టవుతుందని తెలిపింది. 


కోపం కంట్రోల్ అయిపోతుందట


ఇజ్రాయెల్, యూఎస్​లోని న్యూరోబయాలజిస్ట్​ల అధ్యయనం ప్రకారం స్త్రీల కన్నీళ్లలోని రసాయనాలు పురుషులలో దూకుడు, కోపాన్ని తగ్గించి.. వారిని కంట్రోల్ చేస్తాయి. వారు ఎలుకలపై ప్రయోగాత్మకంగా చేసిన అధ్యయనం దీనికి సాక్ష్యంగా నిలిచింది. ల్యాబ్​లో సైకలాజికల్ గేమ్, మాగ్నెటిక్ రిసొనెన్స్ ఇమేజింగ్ స్కాన్​ల్లో వచ్చిన ఫలితాలు శాస్త్రీయ ఆధారంగా నిలిచాయి. అయితే కన్నీళ్ల వాసనే కాకుండా.. కన్నీళ్లను చూసి సానుభూతి చూపించడం వల్ల తెలియకుండానే కోపం కంట్రోల్ అవుతుందని కూడా తెలిపింది. కేవలం ఈ అధ్యయమే కాదు గత రెండు దశాబ్ధాలుగా బహుళ అధ్యయనాలు దీనిని నిర్థారించాయి. 


44 శాతం కోపం తగ్గిపోయింది..


కొత్త అధ్యయనంలో భాగంగా.. ఇద్దరు పురుషులపై ఆమె స్నేహితురాలి కన్నీళ్లు ఎలాంటి ప్రభావాన్ని చూపించాయో పరిశీలించారు. ఆమె కన్నీళ్లు వారిలో 44 శాతం కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించినట్లు గుర్తించారు. మానవ మెదడులోని వాసన సంబంధిత గ్రాహకాలు.. కన్నీళ్ల మోతాదును బట్టి ప్రతి స్పందిస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కన్నీళ్ల సాంద్రత ఎక్కువ ఉంటే గ్రాహకాల ప్రతిస్పందన అదే రీతిలో ఉంటుందని తెలిపారు. 


సైంటిఫిక్ రీజన్


కన్నీళ్లను పసిగట్టడం వల్ల వాసన, దూకుడుకు సంబంధించి.. మెదడులోని కణాల మధ్య ఫంక్షనల్ కనెక్టివిటీ పెరుగుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందుకేనేమో అమ్మాయి ఏడిస్తే అబ్బాయి తెలికుండానే సైలెంట్ అయిపోతారు. ఇన్నాళ్లు ఇదేదో సానుభూతి అనుకున్నాము కానీ.. దాని వెనుక ఓ సైంటిఫిక్ రీజన్​ కూడా ఉందనేది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అబ్బాయిలు ఏడ్చేది రేర్​.. మరి అబ్బాయిల కన్నీళ్లకు అంత పవర్ ఉందో లేదో అనేది శాస్త్రవేత్తలే చెప్పాలి. అధ్యయనాలే నిరూపించాలి.


Also Read : మీకు తెలుసా? మందు తాగే వారికంటే తాగనివారికే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువట!















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.