బయటకు కనిపించే అందం కాదు, మనసు చూడాలని ఎన్నో సినిమాల్లోనూ, సినీ కవితల్లోనూ వింటూనే ఉన్నాం. కానీ బయటికి కనిపించే అందమే... ఒక వ్యక్తికి ఎంతో లాభం తెచ్చిపెడుతుందని చెబుతోంది ఒక అధ్యయనం. అందంగా ఉన్న అబ్బాయి, అమ్మాయిలు ఇతరులతో పోలిస్తే కెరియర్లో చాలా వేగంగా దూసుకెళ్లే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతోంది ఈ అధ్యయనం. ఈ పరిశోధనను దాదాపు 30 ఏళ్ల పాటు నిర్వహించారు. సాధారణంగా ఉండే అబ్బాయిలతో పోలిస్తే అందంగా ఉండే అబ్బాయిలు 20 శాతం అధికంగా ఎక్కువ సంపాదించే అవకాశం ఉందని ఈ అధ్యయనం తేల్చింది. ముఖం అందంగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నారని ఎదుటివారికి సులువుగా అర్థం అవుతుందని, అందుకే వారికి అవకాశాలు ఎక్కువగా వస్తాయని కూడా అధ్యయనం ఉంటుంది.
ఇంటర్వ్యూలలో మంచి స్కోర్ సాధించడంతో పాటు, అందంగా కూడా ఉంటే అది వారికి కచ్చితంగా ప్లస్ పాయింట్ అని నిర్ధారించింది అధ్యయనం. అందం అనేది ప్రతి ఉద్యోగంలోనూ కనీస పాత్రను పోషిస్తుందని, ఉద్యోగాలు తెచ్చిపెట్టడంలో సాయపడుతోందని కూడా అధ్యయనం చెబుతోంది. అయితే అందం ఒక్కటే కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లలేదని, తెలివితేటలు, చదువు, టాలెంట్ కూడా ఉండాలని... అవన్నీ ఉంటేనే అందం ప్లస్ పాయింట్‌గా మారుతుందని వివరిస్తోంది.
ఇంటర్వ్యూలకు పిలిచే పద్ధతిలో కూడా అందంగా ఉన్న వారికి మొదటి పిలుపు వస్తుందని ఒక పరిశోధన కర్త వివరిస్తున్నారు. అందం అనేది ఎదుటివారి కళ్ళను తద్వారా మెదడును ప్రభావితం చేస్తుందని, సానుకూల భావాన్ని పెంచుతుందని, అందుకే అలాంటి వారు త్వరగా ఉద్యోగాలను సంపాదిస్తారని వివరిస్తుంది అధ్యయనం. అందం అనేది ఎంతోమందిలో పత్యేకంగా నిలిచేలా చేస్తుందని కూడా అధ్యయనకర్తలు చెబుతున్నారు.
అందంతో పాటూ ఆత్మవిశ్వాసం కూడా చాలా ముఖ్యం. మాటల్లో ఆత్మ విశ్వాసం కనిపిస్తూ ఉంటే అది కూడా వారి కెరీర్‌కు ఎంతో మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. పెదాలకు లిప్ స్టిక్ వేసుకుంటే సరిపోదు, ఆ పెదాలపై చిన్న చిరునవ్వు ఎప్పుడూ ఉండాలి. ఇది సహజమైన అందాన్ని ఇస్తుంది. అందం అంటే తెల్లగా ఉండడమే అనుకునే వాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ నల్లగా ఉండి ఆకర్షణీయంగా ఉండే వారు కూడా ఎంతో మంది ఉన్నారు. చర్మం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత అందంగా కనిపిస్తారు. ఎంతో మంది నలుపు రంగులో ఉన్న మోడల్స్ ఉన్నారు.
Also read: పచ్చి ఉల్లిపాయను తింటున్నారా? ఈ సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఉంది
Also read: కాల్చిన వెల్లుల్లిని అప్పుడప్పుడు తింటే క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు
Also read: బ్రౌన్ బ్రెడ్ తినడం మంచిదేనా? ఇది తింటే సైడ్ ఎఫెక్టులు ఏమైనా ఉన్నాయా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.