Tinselling Relationship : ముందు తరం సీరయస్ రిలేషన్ షిప్​కి ప్రాధన్యతనిస్తే.. ఈ తరం ఉన్నంత కాలం హ్యాపీగా.. ఎలాంటి గిల్ట్​ లేకుండా ఎంజాయ్ చేయాలనుకుంటుంది. దానిలో భాగంగానే తెరపైకి కొత్త కొత్త రిలేషన్స్ తీసుకొస్తుంది. డేటింగ్ యాప్స్, లవ్ ప్రపోజల్స్ దాటి.. రిలేషన్​ షిప్​కి కొత్త అర్థాన్ని చెప్తూ.. కొత్త దారులు వెతుక్కుంటూ.. న్యూ జనరేషన్​ కొత్త రిలేషన్​ షిప్స్​ని తెరపైకి తీసుకొస్తుంది. దానిలోనే భాగంగానే ఆ మధ్య సిట్యూయేషన్ షిప్ అని తీసుకొచ్చింది. ఇప్పుడు హాలిడే డేటింగ్​ని తీసుకొచ్చింది. దీనినే టిన్సెల్లింగ్ అని కూడా అంటున్నారు.


బౌండరీలున్నాయా?


టిన్సెల్లింగ్ అంటే అర్థమేమిటి? ఈ కొత్త డేటింగ్ ట్రెండ్​ ఏమి సూచిస్తుంది? దీనిలో బౌండరీలు ఉన్నాయా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే టిన్సెల్లింగ్ అనే కొత్త డేటింగ్ ట్రెండ్​.. ఎప్పుడూ ప్రేమ, ఆప్యాయత అనేది ప్రామాణికమైనది కాదని సూచిస్తుంది. ఈ ట్రెండ్​లో భాగంగా జంటలు తమ నిజమైన ఎమోషన్స్, రిలేషిప్​ విషయాలను సెలవుల్లో వ్యక్తం చేయరనమాట. 


నో మోర్ డిస్కషన్స్


మీ రిలేషన్​ని టిన్సెల్​ చేస్తే.. న్యూ ఇయర్ వచ్చే వరకు.. లేదంటే మంచి సమయం దొరికే వరకు మీ రిలేషన్​ గురించి స్నేహితులు, కుటుంబ సభ్యులతో చర్చించరు. దీనిలో భాగంగా ఫ్యామిలీకి, మీకు ఇబ్బంది కలిగించే టాపిక్స్​ని తాత్కాలికంగా నిలిపివేస్తారనమాట. అంటే కొత్త సంవత్సరం వరకు తమ సమస్యలు చర్చించకుండా హ్యాపీగా న్యూ ఇయర్​లోకి ఎంట్రీ ఇచ్చేందుకు దీనిని చాలా మంది ఎంచుకుంటున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 


డివోర్స్ మంథ్


ఈ సమయంలో పార్టనర్స్​ తమ కుటంబ సభ్యులు, స్నేహితుల మధ్య క్రిస్మస్​ను, న్యూ ఇయర్​ను ఆనందంగా గడుపుతుంటారు. ఇది ఐక్యతను సూచిస్తుంది. ఎందుకంటే విదేశాల్లో క్రిస్మస్​ సమయంలో ఎక్కువ మంది ఫ్యామిలీతో టైమ్ స్పెండ్​ చేసి.. పార్టనర్స్​ గురించి చర్చించి తెలియకుండానే ఎక్కువగా విడిపోతున్నారు. అందుకే యూఎస్​లో జనవరికి డివోర్స్ మంథ్ అనే పేరు ఉంది. దీనిని తప్పించుకునేందుకే ఒకరి ఫ్యామిలీ ప్రైవసీని మరొకరు గౌరవించుకుంటూ హాలీడే డేటింగ్ చేస్తున్నారు. 


రెడ్​ ఫ్లాగ్స్..


టిన్​సెల్లింగ్ రిలేషన్ షిప్​లో.. మీ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా మరిచిపోయి.. వారి వారి ఫ్యామిలీతో కలిసి ఉల్లాసంగా, సంతోషంగా గడుపుతారు. మీ మధ్య విడిపోయేంత గొడవ ఉన్నా.. దానిని మాత్రం ఇంట్లో వారితో చర్చించకుండా వాయిదా వేస్తారు. లేదంటే పూర్తిగా దానిని వదిలేస్తారు. ఈ స్పేస్​ వల్ల ఇద్దరికి కాస్త అర్థం చేసుకునే సమయం దొరుకుతుందని నిపుణులు అంటున్నారు. 


స్పేస్ మంచిదేనా? 


అయితే ఈ స్పేస్​ వల్ల సమస్యలు దూరమవుతాయని అనుకోలేము. కొన్నిసార్లు ఇది పరిస్థితిని ఇంకా దారుణం చేస్తుంది. ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండడం ఇష్టంలేక పోవడం వల్ల వివాదాలు మరింత చెలరేగే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి పరిష్కారంగా మీరు ఇరువురి ఫ్యామిలో కలిసి ఫెస్టివల్​ను ఏ గొడవలు లేకుండా స్పెండ్ చేసి.. ఆ తర్వాత మీ నిర్ణయం కోసం చర్చించుకుంటే మంచిది అంటున్నారు. 


Also Read : అమ్మాయిల కన్నీళ్లకు అబ్బాయిలను కంట్రోల్ చేసేంత పవర్ ఉందా?