హైదరాబాద్‌లో ఉంటున్న సగం మంది మహిళలు అంటే దాదాపుగా 51 శాతం మంది స్థూలకాయం లేదా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వమే చెబుతోంది. తెలంగాణకు ( Telangana ) సంబంధించి డేటాబేస్‌ను బలోపేతం చేసేందుకు ప్రణాళికా శాఖ ఓ నివేదికను ప్రచురించింది. ఆ నివేదిను  ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు విడుదల చేశారు. ఇందులో హైదరాబాద్ ( Hyderabad Women ) మహిళల అధిక బరువు సమస్యను గుర్తించారు. కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ 2019-20కి విడుదల చేసిన నివేదిక ప్రకారం ఒక్కో మహిళ బాడీ మాస్ ఇండెక్స్‌లో ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా ఉన్నట్లుగా తేల్చారు. మొత్తంగా 51 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే తెలంగాణ మొత్తంగా చూస్తే ఈ సమస్య కేవలం 30.1 శాతం మాత్రమే. అంటే హైదరాబాద్ లో ఉంటున్న మహిళలు మాత్రమే ఎక్కువ బరువు సమస్య బారిన పడుతున్నారన్నమాట.  


తాటి ముంజలు తింటే వేసవి సమస్యలేవీ దరి చేరవు, రోజుకు రెండు తిన్నా చాలు


కుమురం భీం జిల్లాలో 14 శాతం మంది మహిళలు మాత్రమే అధిక బరువుతో బాధపడుతున్నారు. బీఎంఐలో అధిక బరువు (BMI ≥ 25.0 kg/m2) తెలంగాణ మొత్తం  30.1 శాతంగా ఉంది.  తెలంగాణలో 18.8 శాతం మంది మహిళలు వారి బీఎమ్‌ఐ లెవల్స్ ఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉన్నాయి. అంటే యాభై ఒక్క శాతం మందికి ఎక్కువగా.. 18.8 శాతం మందికి తక్కువగా ఉన్నాయన్నమాట. మిగిలిన వారికి మాత్రం ఆరోగ్య పరంగా ఎంత బీఎమ్ఐ లెవల్స్ ఉండాలో అంతే ఉన్నాయి.  


గర్భస్రావం అయితే ఆ లోపం భార్యది మాత్రమే కాదు, ఈ కారణాలు మీకు తెలుసా !


కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ మహిళలు .. తెలంగాణ మొత్తం సగటుతో పోలిస్తే ఎంతో విద్యాధికులు. హైదరాబాద్‌లో ఉన్న మహిళలో 83.6 శాతం మంది అక్షరాస్యత కలిగినవారు. తెలంగాణ మొత్తం ఈ శాతం 66.6శాతం మాత్రమే. తెలంగాణలో నమోదవుతున్న జననాల్లో అరవై శాతం సిజేరియన్ . కరీంనగర్‌లో అయితే ఏకంగా 82 శాతం జననాలు సిజేరియన్ ద్వారా జరుగుతున్నాయి. ప్రభుత్వం నార్మల్ డెలివరీకి ప్రోత్సహిస్తున్నప్పటికీ ప్రైవేటు ఆస్పత్రులు సిజేరియన్‌కే మొగ్గు చూపుతూండటంతో.. పెద్దగా ఫలితం ఉండటం లేదని తెలుస్తోంది.