ఆహారంలో ఉప్పు మరీ ఎక్కువ కాకుండా, అలా అని మరీ తగ్గించకుండా సమపాళ్లలో తింటేనే ఆరోగ్యం నిలకడగా ఉండేది. ఉప్పు తగ్గినా పెద్దగా వచ్చే సమస్యలు ఉండవు కానీ, పెరిగితే మాత్రం ప్రాణాంతక సమస్యలు వచ్చి పడతాయి. అధిక సోడియం కంటెంట్ ఉన్న ఆహారాలను తగ్గించడమే కాదు, కూరల్లో, బిర్యానీల్లో ఉప్పును తగ్గించడం కూడా చాలా అవసరం.


మనకెంత ఉప్పు అవసరం?
మనం తినే చాలా పదార్థాల్లో సహజంగానే సోడియం ఉంటుంది. అదనంగా చేర్చడం వల్ల మరింత ఎక్కువవుతుంది. గుడ్లు, కూరగాయలలో ఎంత కొంత సోడియం నిక్షిప్తమై ఉంటుంది. అందుకు రోజుకు ఒక వ్యక్తి అదనంగా రెండు గ్రాముల కన్నా ఎక్కువ సోడియాన్ని తీసుకోకూడదు. కానీ ప్రతి ఒక్కరు రోజువారీ ఆహారంలో అదనంగా చాలా మేరకు ఉప్పుని తింటున్నారు. ఉప్పుని తగ్గించడం వల్ల శరీరంలో నీరు, ఖనిజాల సమతుల్యత చెడకుండా ఉంటుంది. కండరాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. శరీరానికి శక్తి అందుతుంది. 


ఉప్పు పెరిగితే...
అధిక సోడియం ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యంపై చాలా దెబ్బ పడుతుంది. ఇది రక్తంలో సోడియం స్థాయిలను పెంచుతుంది. నీటిని రక్త ప్రవాహంలోకి కలిసేలా చేస్తుంది. దీని వల్ల రక్తం మరింతగా పలుచబడిపోయి, పరిమాణం పెరిగిపోతుంది. ఇలా జరగడం వల్ల హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సరైన సమయంలో చికిత్స చేసుకోకపోతే ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు రావచ్చు. 


1. హార్ట్ ఫెయిల్యూర్
2. కిడ్నీ ఫెయిల్యూర్
3. అంధత్వం
4. గుండె పోటు
5. బ్రెయిన్ స్ట్రోక్
6. కాలేయం దెబ్బతినడం


ఇవన్నీ దీర్ఘకాలికంగా ఉప్పు అధికంగా తినడం వల్ల కలిగే అవకాశం ఉంది. అయితే పూర్తిగా ఉప్పు తినకపోయినా కొన్ని ఆరోగ్యసమస్యలు రావచ్చు. కాబట్టి తక్కువ సోడియం కంటెంట్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. హైబీపీ, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారు ఉప్పును బాగా తగ్గించాలి. ఇలా చేయడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. శరీరంలోని ద్రవాలు అధికంగా బయటికిపోవు. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత బావుంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఉప్పు ఎక్కువైతే అలసట, నీరసం పెరుగుతుంది. 


ఏం తినాలి?
మీరు ఇంట్లో వండుకునే అన్ని వంటకాల్లో ఉప్పును తక్కువగా వేసుకోవాలి. ఉప్పు లేని ఆహారాలు, సహజసిద్ధంగా దొరికే పదార్థాలను తినాలి. 


1. కొవ్వు తక్కువగా ఉండే ఆహారాలు
2. పండ్లు
3. కూరగాయలు
4. పప్పుధాన్యాలు
5. బీన్స్



Also read: గర్భస్రావం అయితే ఆ లోపం భార్యది మాత్రమే కాదు, ఈ కారణాలు మీకు తెలుసా !


Also read: వేసవిలో పెట్టే ఆవకాయలు, ఊరగాయలతో ఆరోగ్యానికి ఎంతో మేలు