Fashionable Outfits for Women: సంక్రాంతి సమయంలో కోడి పందాలు, పిండి వంటలు, పతంగులతో పాటు.. డ్రెస్‌లు కూడా అంతే ఫేమస్. అసలే ఈ పండుగను కొందరు మూడు రోజులు చేసుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు లేదా ప్రధానమైన పండుగ సంక్రాంతికి మీరు బ్యూటీఫుల్ అవుట్‌ఫిట్స్ వేసుకోవచ్చు. అయితే మీరు ట్రెండీ, ట్రెడీషనల్గా కనిపించేందుకు మీరు ఎలాంటి డ్రెస్‌లు ఎంచుకోవాలనే దానిపై మీకు అనుమానం ఉంటే.. ఇది మీకోసమే.
ఈ కాలంలో ట్రెడీషనల్ను ట్రెండీతో మిక్స్ చేయడం ఓ ఫ్యాషన్. ఇవి మీకు కంఫర్ట్నివ్వడంతో పాటు.. సాంప్రదాయ లుక్‌ని మీకు ఇస్తాయి. అయితే అమ్మాయిలు సంక్రాంతి 2024 సమయంలో మీరు ట్రెండీగా, ట్రెడీషనల్గా కలిసేందుకు మీరు ఎలాంటి డ్రెస్‌లు, ఎలాంటి రంగుల్లో ఎంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
డిజైనర్ లెహంగాలు
లెహంగాలు మీకు ఎంత నిండుదనాన్ని ఇస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు గాగ్రాలు ఎలాగో.. ఇప్పుడు లెహంగాలు అలాంటివి అనమాట. ఏ పండుగకైనా, ఫ్యామిలీ పార్టీకైనా ఇవి ఇట్టే సెట్ అయిపోతాయి. మీరు ఈ లెహంగాలను.. లంగా, ఓణిగా కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ సంక్రాంతికి లెహంగాలు పర్ఫెక్ట్ ఎంపిక. ట్రెండ్‌కు తగ్గట్లు లెహంగాలు డిజైన్ చేసుకుని మీ ఔట్ఫిట్ లుక్ డిసైడ్ చేసుకోవచ్చు. ఎరుపు, నీలం, ఆకుపచ్చ, బ్లాక్, మెరూన్ రంగుల మంచి లుక్‌ని ఇస్తాయి.
చీర
మీరు సంప్రదాయంగా కనిపించాలన్నా.. ట్రెండీగా కనిపించాలన్నా మీ దుస్తుల ఎంపికల్లో చీర మొదటి ఆప్షన్‌గా పెట్టుకోవచ్చు. మీరు ఎంచుకునే బ్లౌజ్‌ని బట్టి మీరు సంప్రదాయంగా, ట్రెండీగా కూడా కనిపిస్తారు. కాబట్టి మీరు స్లీవ్ లెస్ బ్లౌజ్ ఎంచుకున్నా, ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నా అవి మీ మొత్తం లుక్‌ని మార్చేస్తాయి. మీరు ఎంచుకునే బ్లౌజ్ డిజైన్ బట్టి ఏ కలర్ చీరలైనా ఎంచుకోవచ్చు. పండుగ సమయంలో ఎరుపు, పసుపు, డార్క్ పింక్, గ్రీన్ కలర్ ఎంచుకోవచ్చు.
అనార్కలీ
ఏ పండుగకైనా అనార్కలీ డ్రెస్‌లు బాగా సెట్ అవుతాయి. సౌకర్యంగా ఉండాలనుకుంటే మీరు అనార్కలీ డ్రెస్‌లు ఎంచుకోవచ్చు. ఈ సమయంలో మీరు గోల్డెన్ కలర్, రెడ్ కలర్ అనార్కలీ డ్రెస్‌లు ఎంచుకోవచ్చు. మీ లుక్‌ని మరింత ఎలివేట్ చేసుకునేందుకు బ్రోకేడ్ లేదా బెనారెస్ దుపట్టాలు జత చేసుకోవచ్చు.
షరారా
నార్త్ నుంచి సౌత్‌కి వచ్చిన ట్రెడీషనల్ డ్రెస్‌లలో షరారా ఒకటి. డైలీ రోటీన్ నుంచి.. ప్రత్యేక రోజుల వరకు ఇది ట్రెండీ, ట్రెడీషనల్ లుక్‌ను తీసుకువస్తుంది. అంతేకాకుండా రెట్రో వైబ్స్ ఇస్తుంది. డీప్ హ్యూడ్ షరారా సెట్లు ట్రెండ్‌కి తగ్గట్లు ఉంటాయి. బోట్ నెక్‌లు, డీప్ కట్ ఆర్మ్ హోల్స్, షార్ట్ కుర్తాలు, భారీ ఫ్లేర్స్ ఫెస్టివ్ లుక్ అందిస్తాయి.
పలాజో సెట్లు..
పండుగ సమయంలో ఎలాంటి హంగులు లేకుండా.. సింపుల్‌గా, అందంగా కనిపించాలంటే మీరు పలాజో సెట్లు ఎంచుకోవచ్చు. ఆధునిక స్లిమ్ స్ట్రాప్స్, సున్నితమైన నెక్లైన్ కలిగిన డ్రెస్‌లు మీకు మంచిగా సెట్ అవుతాయి. మల్టీ కలర్, గ్రీన్, రెడ్, పింక్ కలర్ డ్రెస్‌లు బాగా సెట్ అవుతాయి.
Also Read : భోగి స్పెషల్ చక్కెర పొంగలి.. నైవేద్యంగా పెట్టాలంటే ఈ రెసిపీని ఫాలో అయిపోండి