Cockfight  has a long history :  సంక్రాంతి అనగానే కోడిపందాలు గుర్తుకొస్తాయి. సరదా కోసం కొందరు... బెట్టింగ్ లతో కొందరు  కోడిపందాలను కాస్తారు. కోడి పందాలను చూసేందుకు, పందాలను కాసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్తారు ఉభయ గోదావరి ప్రాంతాలకు. రాజుల కాలంలో కూడా కోడిపందాలకు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. కోడి పందాలను కాసి రాజ్యాలను పోగొట్టుకున్న వారు లేకపోలేదు.  ఈ పందేలపై నిషేదం విధించిన కూడా కొనసాగుతూనే ఉన్నాయి. 


కోడి పందేలకు ఎంతో చరిత్ర 


 కోడి పందేలు ఇప్పుడు మొదలైనవి కావు. కొన్ని వేల ఏళ్లుగా ఇక్కడ సంక్రాంతికి పందేలు నిర్వహించడం ఆనవాయితీ. తమిళనాడులో జల్లికట్టు మాదిరిగానే ఇక్కడ కూడా కోడిపందేలు నిర్వహించడం ఒక ఆనవాయితీగా మారింది. మనదేశంలో 6 వేల ఏళ్ల కిందటే కోడిపందేలు మొదలయ్యాయి. పదహారవ శతాబ్దంలోనే కోడిపందేలు మొదలయ్యాయి. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. కాక్‌ఆఫ్‌దిగేమ్‌ అనే బుక్ లో ఇలాంటి పందేల గురించి వివరించారు. ఇక మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కోడి పందేలపై టోర్నీలు నిర్వహిస్తుంటారు. గతంలో కోడిపందేల విషయంలో యుద్ధాలు కూడా జరిగాయి. పల్నాటి చరిత్రతో పాటు బొబ్బిలి యుద్ధంలోనూ కోడిపందేలకు సంబంధించిన అంశాలున్నాయి.


సామ్రాజ్యాల విస్తరణలో కోడిపందేలదీ కీలక పాత్ర 


ఆంద్రప్రదేశ్ లోని పల్నాడు, విజయనగరం ప్రాంతాల్లోని అనేకమంది రాజులు, సామంతరాజులు కోడిపందాల్లో రాజ్యాలను పోగొట్టుకున్నవారు లేకపోలేదు. కోడిపందాల్లో పాల్గొని ఆర్ధికంగా దెబ్బతినడంతోనలగామ రాజు కు మలిదేవాదులకు మధ్య యుద్ధం జరిగి నలగామ రాజులు ఓడిపోవడం జరిగింది.మలిదేవాదుల రాజులకు గురువు బ్రహ్మ నాయుడు రాజులకు యుద్ధం చోటుచేసుకున్నది. వీళ్ల మధ్య యుద్ధం జరిగడం వీళ్ల కు అండగా కోస్తా తీర ప్రాంతం లోని రాజ్యాలు అన్నీ పాల్గొన్నాయి. అందరూ దెబ్బ తినడంతో ఆ సమయం లో కాకతీయులు  మిగిలిన రాజ్యాలను ఓడించి తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. కాకతీయులు ఈ రాజ్యాలపై యుద్దాలు చేసి సామ్రాజ్యాలను విస్తరించుకున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆంధ్రలోని అనేక మంది రాజులు కోడిపందాలు కాసి ఆర్థికంగా దెబ్బ తిండంతో పల్నాడు, కోస్తా తీర ప్రాంతాలల్లో రాజులను స్వాధీనం చేసుకొని కాకతీయ సామ్రాజ్యం విస్తరించడానికి సులువైందని హిస్టరీ ప్రొఫెసర్ దయాకర్ అభిప్రాయపడ్డారు.


ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేలు సంప్రదాయం
 
కోడి పందేలను చాలా మంది తమ ప్రతిష్టగా భావిస్తారు. అందులో తమ కోడి ఓడిపోతే తమ పరువు పోయిందన్నట్లుగా భావిస్తారు. కోడి వీరోచితంగా పోరాడుతుంటే తమ పౌరుషానికి చిహ్నంగా భావించే చాలా మంది పందెంరాయుళ్లు ఉన్నారు గోదావరి జిల్లాల్లో. పందేలు ఒకవైపు జరుగుతుంటే మరోవైపు వాటిపై బెట్టింగ్ కాసే వాళ్లు చాలా మంది ఉంటారు. సంక్రాంతి వచ్చిందంటే గోదావరి జిల్లాల్లో మొదలయ్యే పండుగ కోడిపందేలే. దాదాపు కోట్ల రూపాయల్లో పందేలు జరుగుతుంటాయి.  . సరదా కోసం కోడి పందాలు ఆడవారు కొందరైతే.. జూదం కోసం మరికొందరు. సరదాను పక్కనపెడితే పందెంరాయుళ్ల హవా మాములుగా ఉండదు. కోడిపందాల్లో లాభం పొందిన వారికంటే ఆస్తులు పోగొట్టుకున్నవారే ఎక్కువ.  ఆస్తులు , అంతస్తులే  కాదు. బికారిగా మారిన వారు కూడా ఉన్నారు.