ఆ ఊరు మొత్తం 14 ఏళ్ల బాలుడిని చూసి వణికిపోతుంది. అతడు బయట తిరుగుతున్నాడని తెలిస్తే చాలు.. ఇంట్లోనే కూర్చుంటున్నారు. దీంతో పోలీసులు ఆ బాలుడిని ఆ ఊర్లోకి రాకుండా బ్యాన్ చేశారు. ఇంతకీ అతడంటే ఎందుకంత భయం? కోర్టు ఆ టీనేజర్‌ను ఎందుకు ఊరిలోకి అడుగు పెట్టొద్దని ఆదేశించింది?


సాధారణంగా మనం ఊర్లోకి జంతువు వచ్చిందంటే వణికిపోతాం. లేదా కరుడుగట్టిన నేరగాడో, మాఫియా డానో, రౌడీలను చూసి భయపడతాం. కానీ, 14 ఏళ్ల టీనేజర్‌కు బెదిరిపోవడం ఏమిటీ సిల్లీగా అని అనుకుంటున్నారా? అయితే, ఆ బాలుడు మీరు ఊహించినంత మంచోడు కాదు. ‘నా పేరు శివ’ సినిమాలో టీనేజర్ల టైపు. అతడిని అలాగే వదిలేస్తే తమ ప్రాణాలకే ప్రమాదమని ఆ పట్టణ ప్రజలంతా పోలీసులకు మొరపెట్టుకున్నారు. అయితే, టీనేజర్ కావడంతో పోలీసులు కూడా అతడికి భయం చెప్పలేకపోయారు. చివరికి కోర్టు సాయం తీసుకున్నారు. 


అతడి పేరు కిల్యాన్ ఎవాన్స్. వయస్సు 14 ఏళ్లు. యూకేలోని  కిడ్డెర్‌మిన్‌స్టర్‌లో గల వోర్సెస్టర్‌షైర్ పట్టణంలో నివసిస్తున్నాడు. అతడి ప్రవర్తన చూసి ఆ పట్టణ ప్రజలంతా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అతడు అసాంఘిక పనులకు పాల్పడుతున్నాడని, తమని చంపేస్తామని బెదిరిస్తున్నాడని ఆ ఊరి ప్రజలంతా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో పోలీసులు చాలాసార్లు ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని వార్నింగ్ ఇచ్చి పంపేశారు. పిల్లాడే కదా అని తేలిగ్గా తీసుకున్నారు. 


అయితే, అతడు స్థానిక వ్యాపారులను, ప్రజలను భయపెట్డం మానుకోలేదు. డబ్బులివ్వాలంటూ వాళ్లను బెదిరించేవాడు. దీంతో పోలీసులు కోర్టు సాయంతో అతడిపై ‘క్రిమినల్ బిహేవియర్ ఆర్డర్ (CBO)’ను అమలు చేశారు. ఈ ఆదేశాల ప్రకారం.. ఆ బాలుడు ఇక ఆ పట్టణంలో కనిపించకూడదు. 2025 మే నెల వరకు ఈ అతడు ఆ ఊరిలోకి అడుగుపెట్టడానికి వీల్లేదు. అలాగే అతడు బహిరం ప్రదేశాల్లో ముగ్గురు కంటే ఎక్కువ మంది వ్యక్తులతో కలిసి కనిపించకూడదు. ఒక వేళ రూల్స్ తప్పితే.. భారీ జరిమానా లేదా కఠిన కారాగార శిక్ష విధించే అవకాశాలున్నాయి. యూకేలో ఇలాంటి ఆదేశాలను అమలు చేయడం చాలా అరుదు. అయితే, వేరే మార్గం లేకపోవడంతో ఆ బాలుడిపై ఈ నిషేదాన్ని విధించారట. 


Also Read: కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు సెక్స్ చేయాలట! నిపుణులు ఏం చెప్పారో చూడండి
Also Read: తగ్గేదేలే, కొత్త పెళ్లికొడుకు అత్యాశ ఫలితం, 20 రోజులుగా అంగస్తంభన, ఇక జీవితాంతం అంతేనట!