యాదాద్రి భువనగిరి జిల్లా మహిళలు పిల్లలు& దివ్యాంగులు& వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్‌ హెల్ప్‌లైన్‌లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌, కౌన్సెలర్, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్, కేస్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతోపాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు జూన్ 06 నుంచి జూన్ 17 వరకు సంబంధిత చిరునామాలో దరఖాస్తులు సమర్పించవచ్చు. స్థానిక జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగ ఎంపిక చేస్తారు.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 08


* ప్రాజెక్ట్ కోఆర్డినేటర్: 01


* కౌన్సెలర్: 01


* చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్: 03 


* కేస్ వర్కర్: 03 


అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతోపాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.


జీతం: నెలకు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌కు రూ.28,000; కౌన్సెలర్‌కు రూ.18,536; సీహెచ్‌ఎస్‌కు రూ.19,500; కేస్ వర్కర్‌కు రూ.15,000.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Office of the District Welfare Officer, WCDSC,
                                                                Integrated District Offices Complex, Room No.G-1,
                                                                Raigir, Yadadri Bhuvanagiri-508116.
ముఖ్యమైన తేదీలు..


➥ ఆఫ్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 06.06. 2023.


➥ ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17.06.2023.


Notification 


Website


Also Read:


ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) 2023-24 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 782 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


రైట్స్‌ లిమిటెడ్‌లో 20 గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు
గురుగావ్‌‌లోని రైట్స్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్స్‌ డిగ్రీ(సివిల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు గేట్‌ 2023 అర్హత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తు ప్రక్రియ జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 30 వ‌ర‌కు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..