చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) 2023-24 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 782 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


వివరాలు..


* యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు  


మొత్తం ఖాళీలు: 782


* ఫ్రెషర్స్: 252


➥ కార్పెంటర్: 40


➥ ఎలక్ట్రీషియన్: 20


➥ ఫిట్టర్: 54


➥ మెషినిస్ట్: 30


➥ పెయింటర్: 38


➥ వెల్డర్: 62


➥ ఎంఎల్‌టీ రేడియాలజీ: 04


➥ ఎంఎల్‌టీ పాథాలజీ: 04


* ఎక్స్-ఐటీఐ: 530


➥ కార్పెంటర్: 50


➥ ఎలక్ట్రీషియన్: 102


➥ ఫిట్టర్: 113


➥ మెషినిస్ట్: 41


➥ పెయింటర్: 49


➥ వెల్డర్: 165


➥ పీఏఎస్‌ఏఏ: 10


అర్హత: ట్రేడును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో పదోవ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ, పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 30.06.2023 నాటికి 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


స్టైపెండ్: నెలకు రూ.6000 నుంచి రూ.7000.


ముఖ్యమైన తేదీలు..


⏩ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.05.2023.


⏩ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.06.2023.


Notification


Website


Also Read:


సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!
పూణేలోని సీమెన్స్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫ్రెషర్స్‌తోపాటు, అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు పూణేలోని కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.
నోటిఫికేషన్, ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..


నాగ్‌పుర్‌ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు, వివరాలు ఇలా!
నాగ్‌పుర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌) రెగ్యులర్, డిప్యూటేషన్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ(గ్రూప్-ఎ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎంఎస్‌, ఎండీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు దరఖాస్తులను గూగుల్‌ ఫాం ద్వారా సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఖాళీలను భర్తీచేస్తారు. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!
టాటా స్టీల్‌ సంస్థ అస్పైరింగ్‌ ఇంజినీర్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంటెట్/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కాగ్నిటివ్‌, టెక్నికల్‌ టెస్ట్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..