విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఒప్పంద, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పారా మెడికల్ ఉద్యోగాల భర్తీకి విశాఖపట్నం జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. పోస్టులను అనుసరించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. సరైన అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 69
1. ఈసీజీ టెక్నీషియన్: 01 పోస్టు
2. స్పీచ్ థెరపిస్ట్: 02 పోస్టులు
3. ఫార్మాసిస్ట్: 01 పోస్టు
4. ఫిజియోథెరపిస్ట్: 02 పోస్టులు
5. ప్యాకింగ్ బాయ్స్: 02 పోస్టులు
6. డ్రెస్సర్స్: 01 పోస్టు
7. స్ట్రెచర్ బేరర్: 06 పోస్టులు
8. అనస్థీషియా టెక్నీషియన్: 13 పోస్టులు
9. ఈఈజీ టెక్నీషియన్: 01 పోస్టు
10. ఎంఎన్వో: 13 పోస్టులు
11. ఎఫ్ఎన్వో: 14 పోస్టులు
12. ఓటీ టెక్నీషియన్: 13 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, విశాఖపట్నం.
దరఖాస్తులకు చివరి తేదీ: 10.09.2022.
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 226 ఉద్యోగాలు, వివరాలు ఇలా!
తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (NLC) ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 226 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 207 టీచర్ పోస్టులు
AP DSC Notification: ఏపీలోని ఆదర్శ పాఠశాలలు, మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల సంస్థల్లోని వివిధ విభాగాల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిపార్ట్ మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా పీజీటీ, టీజీటీ, ఆర్ట్ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 17 వరకు ఫీజు చెల్లించి, ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
SSC - జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్ 2022
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 12న నోటిఫికేషన్ జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని 22 విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబరు 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫీజు చెల్లించడానికి ఆగస్టు 3 వరకు గడువు ఉంది. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు.
నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..