ఝార్ఖండ్‌లోని జాదుగూడ మైన్స్‌లో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింది గ్రూప్ ఎ, బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు రూ.500 దరఖాస్తు ఫీజుగా చెల్లించి, ఆఫ్‌లైన్ విధానంలో ఆగస్టు 18లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 


వివరాలు..


* మొత్తం పోస్టుల సంఖ్య: 122.


➥గ్రూప్-ఎ: 44 పోస్టులు


➥ గ్రూప్-బి: 78 పోస్టులు


పోస్టులు..


1) జనరల్ మేనేజర్


2) డిప్యూటీ జనరల్ మేనేజర్


3) అడిషనల్‌ మేనేజర్


4) అసిస్టెంట్ మేనేజర్


5) డిప్యూటీ మేనేజర్


6) చీఫ్ సూపరింటెండెంట్


7) డిప్యూటీ సూపరింటెండెంట్


8) అసిస్టెంట్ సూపరింటెండెంట్


9) మేనేజర్


10) కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్


11) సూపర్‌వైజర్


12)  ఫోర్‌మ్యాన్


13) సైంటిఫిక్ అసిస్టెంట్


అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 


వయోపరిమితి: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. 18.08.2023 నాటికి పోస్టులను అనుసరించి 30 - 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. 


దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 


ఎంపిక విధానం: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.


ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 18.08.2023.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
General Manager (Instrumentation/Personnel & IRs./Corporate Planning)
Uranium Corporation of India Limited, (A Government of India Enterprise)
P.O. Jaduguda Mines, Distt.- Singhbhum East,
JHARKHAND-832 102.


Notification


Application


Website


ALSO READ:


ఎన్‌ఐఓహెచ్‌ అహ్మదాబాద్‌లో 54 టెక్నికల్ పోస్టులు, వివరాలు ఇలా!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌‌కు చెందిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్(ఎన్ఐఓహెచ్) టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, 12వ తరగతి, ఇంటర్‌, బీఈ, బీటెక్‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 04 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్‌ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) జులై 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 156 మంది ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో54 ఆయుర్వేద, 33 హోమియో, 69 యునానీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 22లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో 184 అప్రెంటిస్‌ ఖాళీలు, అర్హతలివే!
మధ్యప్రదేశ్‌ బాలాఘట్‌లోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) ఆధ్వర్యంలో పనిచేస్తున్న మలాంజ్‌ఖండ్‌ కాపర్‌ ప్రాజెక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా ఇంటర్ అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే మైనింగ్ విభాగంలో పోస్టులకు ఇంటర్ అర్హత అవసరం లేదు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial