UPSC Civil Prelims Results 2023: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష-2023 ఫలితాలు జూన్ 12న  విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పీడీఎఫ్ ఫైల్ ఫార్మాట్‌లో మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను పొందుపరిచారు. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌లో మొత్తం 14,624 మంది అభ్యర్థులు అర్హ‌త సాధించారు. మొత్తం 1105 పోస్టులకుగానూ సెప్టెంబ‌రు 15 నుంచి మెయిన్స్ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి.


ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష కోసం ఇప్పుడు మళ్లీ డిటైల్డ్ అప్లికేషన్ ఫామ్ - 1 (DAF-I)లో దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్పీ తెలిపింది. ఇందుకు చివరి తేదీని కమిషన్ త్వరలోనే వెల్లడించనుంది. ప్రిలిమ్స్ కటాఫ్, ఆన్సర్ కీని సివిల్స్ సర్వీసెస్ పరీక్ష మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత వెల్లడించనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 28న నిర్వహించిన సంగతి తెలిసిందే. 


UPSC Civil Prelims Results-2023 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..?


🔰 ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in ఓపెన్‌ చెయ్యాలి.


🔰హోమ్‌పేజ్‌లో కనిపించే 'Written Result - Civil Services (Preliminary) Examination, 2023' ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలి. 


🔰 క్లిక్ చేయగానే సివిల్స్‌ ప్రిలిమ్స్‌ - 2023' ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్‌ కనిపిస్తుంది.


🔰  సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.


🔰  మీ పేరును చెక్‌ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నంబర్/ రోల్ నంబర్‌తో చెక్ చేసుకోవాలి.


ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 


సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు (పేర్లతో)


Also Read:


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 35 జూనియర్ ఇంజినీర్ పోస్టులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 35 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 65 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ (సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జూన్ 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ  ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!
తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తుది పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నిర్వహించనున్న ధ్రువపత్రాల పరిశీలన తేదీలను పోలీసు నియామక మండలి ఖరారుచేసింది. ఈ మేరకు సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించిన షెడ్యూలును ప్రకటించింది. ఈ మేరకు జూన్ 9న అధికారిక ప్రకటన విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ అనంతరం కటాఫ్‌ మార్కులు ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం కటాఫ్‌ మార్కులు, అభ్యర్థుల రిజర్వేషన్‌, ఇతర కేసుల వెరిఫికేషన్‌ పూర్తవ్వగానే ఎంపికైన అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) 2023-24 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 782 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..